వెబ్ డెవలపర్లకు e-తెలుగు అవగాహనా సదస్సు (హైదరాబాద్, ఏప్రిల్ 15)

తెలుగు వెబ్‌సైట్ల నిర్మాణంలో సాంకేతికాంశాల గురించి
వెబ్ డెవలపర్లకు అవగాహనా సదస్సు

సమయం
ఆదివారం, ఏప్రిల్ 15, 2012 — ఉదయం 10 గంటల నుండి
మధ్యాహ్నం 12 గంటల వరకు

వేదిక
హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై. లి.
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004.
(గూగుల్ పటం)

సంప్రదింపులు:
93965 33666, support @ etelugu [dot] org

కంప్యూటర్ నిర్వాహక వ్యవస్థలలోనూ, ఇతరత్రా ఉపకరణాలలోనూ యూనికోడ్ ప్రమాణానికి తోడ్పాటు (ప్రత్యేకించి తెలుగు వంటి సంక్లిష్ట లిపులకు సాంకేతిక తోడ్పాటు, ఫాంట్ల అందుబాటు) పెరగటంతో ఇప్పుడు జాలంలో తెలుగు సమాచారం అనేక రూపాల్లో వెల్లివిరుస్తూంది. సమాచార సాంకేతిక ఫలాలు అన్ని వర్గాలకీ అందాలంటే ఇంకా అనేక రంగాల గురించిన సమాచారం జాలంలో అందుబాటు లోనికి రావాలి.

తెలుగులో వెబ్ సైట్లు తయారు చేసే వారికి కంప్యుటర్లు మరియు జాలంలో తెలుగు గురించిన సాంకేతిక అవగాహనను కల్పిస్తే, వారు తెలుగు సమాచారాన్ని అందించే వైవిధ్యమైన జాలగూళ్ళను వెలుగు లోనికి తీసుకువస్తారు. వారికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడానికే ఈ అవగాహనా సదస్సు!

తెలుగులో జాలగూళ్ళను తయారుచేయడానికి అవసరమయ్యే ప్రాధమిక సాంకేతిక పరిజ్ఞానంపై ఈ సదస్సులో ప్రసంగాలు, ప్రదర్శనలూ ఉంటాయి. ఈ సదస్సు దృష్టిసారించే అంశాలు:

  • కంప్యూటర్లో అక్షరాలను సూచించే ఎన్‌కోడింగ్ పద్ధతులు, యూనికోడ్ ఆవిర్భావం
  • జాలం - దాని నిర్మాణాకృతి, HTTP మరియు HTMLలలో భాషలను తెలియజేసే పద్ధతులు, మెళకువలు
  • తెలుగు టైపింగ్ పద్ధతులు
  • తెలుగు ఫాంట్లు, వాటిని వెబ్‌సైట్లలో ఉపయోగించడం (@font-face)
  • తెలుగు గురించి వివిధ ప్రోగ్రామింగ్ భాషలలో (PHP, ASP.net, Java) అమరికలు
  • మొబైళ్ళలో తెలుగు
  • డ్రూపల్, వర్డ్‌ప్రెస్ వంటి ప్రముఖ CMS (విషయ నిర్వహణ వ్యవస్థ) లలో తెలుగు సంబంధిత అమరికలు

ఈ సదస్సు ఇప్పటికే వెబ్ డెవలప్‌మెంట్ చేస్తున్న/నేర్చుకుంటున్న వారికి ఉద్దేశించినదే అయినా సాంకేతికంగా జాలం అందులో తెలుగు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారు కూడా ఈ సదస్సు నుండి లబ్ది పొందవచ్చు.

ఈ సదస్సుకి హాజరై తద్వారా నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానంతో మరిన్ని తెలుగు గూళ్ళను తయారుచేస్తారని ఆశిస్తూ...

e-తెలుగు బృందం.

Sarala - An Ergonomic

Sarala - An Ergonomic Keyboard Layout All, I have developed an ergonomic Keyboard Layout for Telugu, after doing thorough  analysis of the frequency of telugu letter usage and has released it with Creative Common's License and has seen couple of thousands of downloads. It is developed for  Windows, and can be used to type directly into many Windows applicatins like Microsoft word, powerpoint, notepad, excell, publisher, etc. I live in North Carolina, USA. So I can only wish I would be in Hyderabad to present it to the attendees. But I hope the organizers will be able to bring this to the attention of the participants. The home page for this software is: http://www.medhajananam.org/sarala/ The research paper is available at: http://www.medhajananam.org/sarala/files/Sarala-ErgonomicKeyboards-Telugu-ResearchPaper.pdf Thanks everyone, and keep contributing to bring Telugu to the electronic age ! 

కృష్ణ గారూ, కృతజ్ఞతలు. సరళ

కృష్ణ గారూ, కృతజ్ఞతలు. సరళ కీబోర్డు లేయవుటు గురించి సదస్సులో ప్రస్తావిస్తాను. తెలుగులో టైపు చెయ్యడం ఎలా? పేజీ లోనూ ఈ లంకెను చేర్చాను.

కృష్ణ గారు, ధన్యవాదములు.మీరు

కృష్ణ గారు, ధన్యవాదములు.మీరు రూపొందించిన నందిని ఖతి(ఫాంటు) బాగుంది. లినక్సులో కూడా పనిచేస్తున్నది.సరళ కీబోర్డు నమూనాని లినక్సులో కూడా అందుబాటులోకి తీసుకురాగలరు.

ఈ వర్క్‍షాప్‍కు రాలేనివారు నా

ఈ వర్క్‍షాప్‍కు రాలేనివారు నా ప్రదర్శనను ఇక్కడ చూడవచ్చు :

PHP లో తెలుగు వెబ్ డెవెలప్మెంట్

అందరికి నమస్కారం

అందరికి నమస్కారం

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer