తెలుగు బ్లాగుల దినోత్సవం 2011 (డిసెంబర్ రెండవ ఆదివారం)

e-తెలుగు సభ్యులకు ఔత్సాహికులకు, తెలుగు బ్లాగర్లకు, తెలుగు భాషాభిమానులకూ… తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

తెలుగు బ్లాగుల దినోత్సవం — డిసెంబర్ రెండవ ఆదివారం

ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 11న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు:

సమయం:
ఆదివారం, డిసెంబర్ 11, 2011 మధ్యాహ్నం 3 గంటలకు

వేదిక:
హనీపాట్ ఐటీ కన్సెల్టింగ్ ప్రాంగణం,
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004. (పటం)

సంప్రదింపులు:
93965 33666

ఇప్పటివరకూ బ్లాగ్ముఖంగా మాత్రమే పరిచయమున్న మిత్రులను కలిసే సదవకాశమిది. మీకున్న సాంకేతిక సమస్యలను నలుగురితో చర్చించి వాటికి పరిష్కారమూ పొందవచ్చు. పాల్గొన్నవారందరికీ ఈ సమావేశం నూతనోత్సాహాలను కలగజేస్తుందని ఆశిస్తున్నాం.

వచ్చే ఏడాదికి తెలుగు బ్లాగులు “లక్ష బ్లాగులూ కోటి సందర్శకులు”గా ఎదగాలని ఆశిస్తూ… తెలుగు బ్లాగరులందరికీ ఇదే మా ఆహ్వానం!

ఈ సదవకాశం కోసం ఆతృతగా ఎదురు

ఈ సదవకాశం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాను...

 మనమందరం యీ సదవకాశాన్ని

 మనమందరం యీ సదవకాశాన్ని వినియోగించుకొని మరింత మందిని  యీవైపు  తీసుకు వద్దాం  డియర్. శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు. 

 ఇక్కడ మేము వ్యాఖ్యలు

 ఇక్కడ మేము వ్యాఖ్యలు చేయడానికి తెలుగు పరికరం అనుసంధించక పోవడం నాకు  ఆశ్చ్చర్యం కలిగించింది. దయచేసి .ఆంగ్ల/తెలుగు  ట్రాన్స్లిటరేషన్ పరికరం ఒకదాన్నిఇక్కడ  అనుసంధానం చెయ్యండి .అప్పుడు వ్యాఖ్యానించడానికి వీక్షకులు  బద్దకించరు  . మీ యీ ప్రయత్నం శుభప్రదమై జయప్రదం కావాలని నా ఆకాంక్ష. అభినందనలు ...శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.    

 ప్రియమైన  వీవెన్ గారు ! నేడు

 ప్రియమైన  వీవెన్ గారు ! నేడు మీ ఆధ్వర్యం లొ  జరగిన e తెలుగు సమావేశం వివరాలను.... ఓ నివేదిక (అనవచ్చా! ) రూపం లొ  మీకు పంపుతున్నాను.  సభకు విచ్చేసిన సభ్యుల వివరాలు నా వద్ద సంపూర్ణంగా లేని కారణంగా  ఆవివరాలు నేను పొందు పరచ లేదు.ఆ వివరాలు  మీరు  పూరించండి. నా వద్ద  వున్న సమూహ చిత్రం  దీనికి  అనుసంధానం  చేస్తున్నాను. యీ నివేదికను నా బ్లాగులోనూ  నా ఫేస్బుక్ పేజీలలోనూ ప్రచురించు తా నని  మీకు తెలియజేస్తున్నాను. మీ ఈమెయిలు అడ్రస్  ఇవ్వగలరు....శ్రేయోభిలాషి నూతక్కి రాఘవేంద్ర రావు. నా  ఈమెయిలు చిరునామా  :  nutakkir@gmail.com    దిగ్విజయం e తెలుగు సమావేశం. నూతక్కి రాఘవేంద్ర రావు.   e  తెలుగు సంస్థ వారు  11-12-2011 న  భాగ్య  నగరం  లొ  నిర్వహించిన  రాష్ట్ర స్థాయి  తెలుగు బ్లాగర్ల  సమావేశాలు దిగ్విజయంయ్యాయి.  నిర్ణీత సమయానికి సమావేశ స్థలికి చేరిన తెలుగు బ్లాగర్లను  సభ నిర్వాహకులు  శ్రీ కశ్యప్,శ్రీ  వీవెనుడు  స్వాగతించారు.   శ్రీ కశ్యప్ ఆహూతులను సంబోధించి ,అంతర్జాలం లొ తెలుగు వినియోగానికి  సదుపాయాలందించే  కృషిలో గత ఎన్నో సంవత్సరాలుగా,తాము చేసిన కృషిని  వివరిస్తూ ... internet లొ తెలుగు వాడుక నాడు నేడు  వైవిధ్యాన్ని వివరించారు. ఇంటర్నెట్  కై వాడే  వివిధ ఆంగ్ల సాంకేతిక  పదాలకు అనుగుణ్యమైన తెలుగు పదాలను  కొన్నిటిని తాము సిద్ధం చేసి వియోగం లోకి తెచ్చినట్లు వివరిస్తూ , వాటిలో కొన్నిటిని ఉదహరించారు. అంతర్జాలం=Internet, జాలము =net,  blog =గూడు  group=గుంపు, సమూహము వంటి క్లిష్టతరమైన అనేక తెలుగు పద ప్రత్యామ్న్యాయాలను అంతర్జాలం లొ వినియోగం లోకి  తెచ్చి ప్రభుత్వ,దృశ్య పత్రికా మాధ్యమాల  ప్రసంసలు పొందిన విషయం తెలియజేసారు.   లేఖినీ.ఆర్గ్ ...లేఖిని తెలుగు కంపైలర్ సృష్టికర్త శ్రీ వీవెనుడు e-తెలుగు కరపత్రాన్ని విడుదల  చేసి మాట్లాడుతూ ఇంగ్లీషు రాని తెలుగువారు  కూడా తమ అవసరాల కొఱకు కంప్యూటర్లనూ, ఎలెక్ట్రానిక్ పరికరాలనూ మరియూ అంతర్జాలాన్ని  వినియోగించుకో గలిగే స్థితికి తీసుకొని  వచ్చి తద్వారా తెలుగు భాష మనుగడకు తమవంతు కృషి చేయడం ముఖ్య ఆశయంగా e- తెలుగు కృషి చేస్తుందని వివరించారు.  ప్రచారం ,సాంకేతిక సహాయం,అవగాహనా సదస్సులు,స్థానికీకరణ,తెలుగు వికీ పీడి యా వంటి  స్వేచ్చాయుత ప్రాజెక్టులలో పాలుపంచుకోవడం, ఆ విషయమై ఔత్సాహికులకు తోడ్పడటం,వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు.  ఇంటర్నెట్ లేకుండా నూ తెలుగులో టైపు  చేయడం ,తెలుగులో చూడగలగడం  వంటి విషయాలలో ఎదురయ్యే సాంకేతికపర   సమస్యలకు,పరిష్కారాన్ని పొందేందుకు  support@etelugu.org అన్న e mail చిరునామా  లొ  సంప్రదించ  వలసినది  గా  కోరారు .  ఆహూతులైన బ్లాగర్లు  సభకు తమను తాము పరిచయాలు చేసుకొని తమ తమ బ్లాగుల  చిరునామాలు, మరియు తాము తమ  బ్లాగుల్లో  ప్రచురించే విషయాల గురించి సంక్షిప్తీకరించిన తదుపరి తేనీటి విందు, వందన సమర్పణ కార్యక్రమాలతో సభ ముగిసింది.  ఇరవై  అయిదు మంది బ్లాగర్లు పాల్గొన్న యీ సభలో సభ్యులు  అందరూ సభా ప్రారంభ సమయానికి విచ్చేసి సమయ పాలన పాటించడం , ఇద్దరు స్త్రీ బ్లాగర్లు విచ్చేయగా, ఒంగోలునుంచి, గుంటూరునుండి ఒక్కొక్క బ్లాగరు సభకు విచ్చేయడం తొలిమేరుపైతే , సభ చివరివరకు  సభ్యులు ఓపికగా వుండటం కొసమెరుపు.  

రాఘవేంద్రరావు గారూ, నమస్కారం.

రాఘవేంద్రరావు గారూ, నమస్కారం. మీ నివేదికకు ధన్యవాదాలు. మీకు ఒక ఈమెయిలుని పంపించాను.

నమస్కారం రాఘవేంద్ర రావు గారు,

నమస్కారం రాఘవేంద్ర రావు గారు, మీరు మీటింగ్ యొక్క నివేదిక! తాయారు చేసి పోస్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు తీసిన ఫోటోలు మరియు విడీయో నాకు మెయిల్ చెయగలరా! మరియు మీ ఫోన్ నంబరు తీసుకోవడం మరిచిపోయాను, మెసేజ్ పంపగలరు. - కందుకూరి రాము   

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer