ఆహ్వానాలు, సమావేశ నోటీసులు

పాత్రికేయుల వర్కుషాపు

కంప్యూటరులో, ప్రత్యేకించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం e-తెలుగు సంస్థ కృషి చేస్తోంది. అందుకుగాను అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల ముగిసిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు నెలకొల్పి అంతర్జాలంలో తెలుగు గురించిన ప్రచారం కల్పించడమే కాక, కొన్ని తెలుగు సాఫ్టువేర్లను ఉచితంగా అందించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను చేపట్టింది. వివిధ అంశాలపై తగు సమాచారం ఇవ్వడమే కాకుండా అనేక సాంకేతిక, సాంకేతికేతర విషయాల్లో తక్షణ సహాయం అందించడం ఈ వర్కుషాపులలో ప్రధాన అంశం. కంప్యూటర్లతో ప్రత్యక్ష డిమాన్‍స్ట్రేషను చెయ్యడం ఈ వర్కుషాపుల్లో ఒక భాగం.

పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ప్రదర్శన

అంతర్జాలంలో తెలుగు e-తెలుగు ప్రదర్శన

హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్‌ప్లాజాలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అంతర్జాలంలో తెలుగు అనే ప్రదర్శనను e-తెలుగు సమర్పించనుంది. 2008 డిసెంబరు 20, శనివారం సాయంత్రం 6 - 7 గంటల పుస్తక ప్రదర్శన స్థలం బయట ఉన్న వేదికపై ఈ ప్రదర్శన జరుగుతుంది. తెలుగు నెజ్జనులంతా వచ్చి, ఈ సభని విజయవంతం చెయ్యవలసినదిగా కోరుతున్నాం. ఈ ప్రదర్శన చివర ప్రేక్షకులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు కూడా e-తెలుగు సభ్యులు ఇస్తారు.

Syndicate content