హైదరాబాదులో

హైదరాబాదులో జరిగే e-తెలుగు సమావేశాలు గురించి ప్రకటనలు, చర్చలు, గట్రా

ఎండాకాలం

ఎండాకాలం వచ్చింది ఎండలు బాగా ముదిరినాయి .ఇంట్లోనుండి బయటికి రావడాని ప్రజలు చాలా బయపడిపోతున్నారు.ముఖ్యముగా వయసు మళ్లినవారు ఈఎండాకాలం దినదిన గండంగా మారుతుంది.

26వ పుస్తక ప్రదర్శన

ఈ రోజు ఆదివారము కావటముతో ఖాళీగా ఉండటము ఎందుకని 26వ పుస్తక ప్రదర్శన కు మా స్నేహితులతో వెళ్ళాను. మధ్యాహ్నము ఒంటిగంట నుండి సాయంత్రము ఆరుగంటల వరకు అక్కడే ప్రదర్శనకు ఉంచిన దాదాపు అన్ని స్టాల్ లు తిరిగాము. నన్ను విపరీతముగా ఆకట్టుకున్న స్టాల్  మాత్రము e - తెలుగు స్టాల్ అని చెప్పటానికి సంతోషిస్తున్నాను. మొదట స్టాల్ చూసిన వెంటనే కొద్దిగా కరపత్రాలతో ఖాళీగా వున్నా అలమర,  వెనక చిన్న e - తెలుగు బానర్ తో, డెల్ లాప్టాప్ ముందు వున్న ఒక వ్యక్తి ని చూసాను తను కశ్యప్ . వెళ్లి నన్ను పరిచయము చేసుకుని ఖాళి CD ఇచ్చి వారి ఉపకరణాలను కాల్చి ఇవ్వమమని కోరాను.

26వ పుస్తక ప్రదర్శన లో రెండొవ రోజు విషయాలు

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో రెండొవ రోజు విషయాలు వ్రాసే అవకాశం నాకు రావడం చాలా అనందానిస్తోంది. ఈ రోజు శుక్రవారం అయినందున ప్రదర్శనకు విచ్చేసిన అతిధుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం వల్ల e-తెలుగు స్టాల్ నందు కళ కొంచం తగ్గినట్లు కనబడ్డా, అది మన ఒక్క స్టాల్ వరకూ మాత్రమే పరిమితం కాకుండా అన్ని స్టాళ్లు బోసి పోయినాయి.

26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తొలి రోజు...

ఆనందంగా ఉత్సాహంగా గడిచింది. e-తెలుగు అధ్యక్షుడు వీవెన్, కార్యదర్శి కశ్యప్, కినిగె చావా కిరణ్, అట్లురి అనిల్, రెహ్మానుద్దీన్, ప్రవీణ్, రవితేజ, శ్రీనివాసకుమార్ తదితరుల కలయికతో మన e-తెలుగు స్టాల్ (2వది) కళకళలాడింది. కబుర్లు.. చెప్పుకుంటూ అలమరలు, కుర్చీలు, బల్ల సర్దుకోవడం, అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉన్న తెలుగు వనరుల గురించి తెలిపే కరపత్రాలు సిద్ధం చేయడం, పంపిణీ చేయడం, అధ్యక్ష, కార్యదర్శుల అంకోపరుల (Laptop) ద్వారా సందర్శకులకు కంప్యూటర్లు, అంతర్జాలంలో తెలుగు వాడకం గురించి తెలియజేయడం తదితర కార్యకలాపాలతో తొలిరోజు కార్యక్రమం ఉల్లాసంగా గడిచింది.

తెలుగును రక్షించుకునేందుకు ఈ కార్యం ఉద్యమంలా సాగాలి

  తెలుగును రక్షించుకునేందుకు ఈ కార్యం ఉద్యమంలా సాగాలి.తెలుగువాళ్లందరూ ఇలాంటి తెలుగు వెబ్ సైట్లలో రాసేలా అలవాటు చేయాలి.మన తెలుగు వాడకానికి ప్రాచుర్యం కల్పిద్దాం...

e-తెలుగు నెలవారీ సమావేశం, హైదరాబాద్ — ఆదివారం, జూన్ 19 2011

e-తెలుగు జూన్ నెల మావేశంఈ నెల 19, ఆదివారం
వేదిక: లమకాన్, హైదరాబాద్
సమయం : సాయంత్రం 3 నుండి 5 గఁ॥ వరకు

కంప్యూటర్లలోనూ, జాలం లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి, వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను గురించి తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ, తెలుగు గురించి చర్చించు కొందాం.

గమనిక: 1. అంకోపరి గల వారు తమ వెంట తెచ్చుకోవాలని మనవి, wifi ఉండొచ్చు కాబట్టి సమాచారాన్ని పంచుకుందాం
2. వేదికలో ఏమైనా మార్పులు ఇక్కడ తెలుపబడతాయి

e-తెలుగు నెలవారీ సమావేశం, హైదరాబాద్ — ఆదివారం, మే 8 2011

సమయం: ఆదివారం, మే 8, 2011 సాయంత్రం 5 గంటల నుండి 7 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

తెలుగు బ్లాగుల దినోత్సవం 2010

 

మిత్రులారా!

 

ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండో ఆదివారం తెలుగు బ్లాగుల దినోత్సవం గా జరుపుకుంటున్న సంగతి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఈ సంవత్సరం కూడా  ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయండి.

మీరు చేయదగ్గ పనులు

సెప్టెంబర్ నెల సమావేశం - 12th Sep 2010

సెప్టెంబర్ నెల సమావేశం యధావిధిగా రెండవ ఆది వారం నాడు యూసఫ్ గుడా లోని కృష్ణ కాంత్ పార్క్ యందు మధ్యాహ్నాం మూడు గంటలకు జరుగుతుంది. ఒక వేళ వరుణుడు అడ్డు పడితే ఎక్కడ జరగాలన్న విషయానికై మాలోని ఎవ్వరినైనా సంప్రదించండి.
చర్చాంశాలుః

  • తెలుగు బాట - స్వీయావలోకనం
  • ఇతరత్రా..

భవదీయుడు,

చక్రవర్తి

944 14 18 139

I want to know about e-telugu programs

   naaku e site chala nachimdi.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer