etelugu.org చర్చావేదికలు

చర్చావేదికల విభాగాలపై సూచనలు, కొత్త విషయాలపై ప్రత్యేక చర్చావేదికలకు ప్రతిపాదనలు

ఏమి చేస్తే బాగుంటుంది?

నమస్కారం,

eతెలుగు సభ్యులందరికీ ఓ విన్నపం. క్రొత్తగా eతెలుగు సభ్యులైన వారందరికీ స్వాగతం. అలాగే సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రొత్త సంవత్సరంలో eతెలుగు కార్యవర్గం ఏమి చేస్తే బాగుంటుందో అందరూ సూచించ గలరని మనవి. ఈ సంవత్సరంలో చాలా చేస్తే బాగుంటుందని eతెలుగు కార్యవర్గం తలచింది. వాటిల్లో ముఖ్యంగా ఉగాదిలోపుల రచయితలు మరియు కవులకు ఓ చిన్న సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని ప్రయత్నం. 'ఎలా ఉంటుందో..' అన్న విషయాన్ని త్వరలో మీ ముందుచుతాము.

ఇవి కాకుండా, మరింకా ఏమైనా చేస్తే బాగుంటుందో తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఏమో ఏ బుర్రలో ఏ ఆలోచన ఉందో ఎవ్వరికి ఎఱుక.

ఇట్లు
చక్రవర్తి

telugu bhasha - e-telugu krushi

తేనెలొలుకు తెలుగు భాషను ఇంటర్నెట్ మాధ్యమం లోనికి తీసుకురావటానికి మరియు తెలుగు భాష ప్రాచుర్యానికి మీరు చేస్తున్న కృషి అభినందనీయం హర్షణీయం.
వందనములతో
భవదీయుడు,
తిమోతి జెట్టి

తెలుగు సాహిత్యం

ఇంత చక్కటి వేదికను తెలుగు సాహిత్య చర్చకు, మంచి రచనల పరిచయానికి, అవి లభించే మార్గాలు వగైరాల కోసం వాడుకుంటే బావుంటుందని నా ఉద్దేశ్యం.
ఉదాహరణకు ముళ్ళపూడి వారి బుడుగు, శ్రీ రమణ గారి మిధునం పుస్తకాల గురించి చర్చించుకోవచ్చు. కొత్త తరం పాఠకులకు ఇవి ఎంతో ఉపయోగంగానూ, సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుతాయి. చాలా వెబ్ సైట్లు మంచి తెలుగు పుస్తకాల్ని ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నాయి. ప్రాచీన గ్రంధాలు మరియు మహనీయుల రచనల కోసం www.archive.org లో తెలుగు అని search కొడితే చాలా అందుబాటులో ఉచితంగా దౌన్ లోడ్ కి ఉన్నాయి. అందుకోండి. ఆనందించండి.

బాలికల జీవన నైపుణ్యాలు

జీవన నైపుణ్యాల పరిచయం 6వ తరగతిలో మొదలై 7 వ తరగతిలో కొనసాగి, 8వ తరగతి పూర్తి చేసుకొనే సమయానికి బాలికలకు పరిపూర్ణమైన అవగాహన కొన్ని అంశాలలో వస్తుంది. కొన్ని సందర్బాలలో పిల్లలు, ఉపాధ్యాయుల లేదా పెద్దల సహయం తీసుకొవలసి ఉంటుంది

http://www.indg.in/primary-education/childrenscorner/c2cc3ec32c3fc15c32-...

తెలుగు నిలుపుట

తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చేసింది. సంతోషం. అయితే మాధ్యమాల్లోను, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజావసరాలు, దుకాణాలు మొదలైన వాటిల్లోను తెలుగు వాడకం ఎలా ఉంటోందని గమనిస్తే భాషాభిమానులకు ఆవేదన కలుగుతుంది. టీవీ ఛానెళ్ళలో వాడే తెలుగులో తెలుగు కాక, ఇంగ్లీషే ఎక్కువగా ఉంటోంది. సినిమాల్లో పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. పరిపాలన ఎక్కువగా ఇంగ్లీషులోనే జరుగుతోంది. బడుల్లో తెలుగు మాధ్యమం స్థానే ఇంగ్లీషును ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు నేటి భాష, రేపటి భాషా కాక, కేవలం ప్రాచీన భాషే అయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది.

ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ

ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే విషయం మీద నేను ఒక పుస్తకాన్ని, ఒక బ్లాగునీ రాశాను.

ప్రాధమిక వాస్తవం అయినటువంటి సమాచారానికి జీవితానికి ఉన్న సంబంధం ఏమిటి? ప్రభుత్వ నిర్వహణలో సమాచార సక్రమ యాజమాన్యం, వినియోగం ప్రజల జీవితాల్లో ఏ విధంగా మార్పు తేగలుగుతుంది, ప్రజాపాలనలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగపు విలువ, పద్దతి, అవసరం, అగత్యం, సందర్భాలని గురించి దానిలో చర్చించాను.

హైదరాబాదు e-తెలుగు సమావేశం - 2008 మే

e-తెలుగు హైదరాబాదు సమావేశం 2008 మే 11 న హైదరాబాదు కృష్ణకాంత్ పార్కులో జరిగింది. సమావేశం సాయంత్రం 4 గంటల్కు అనుకున్నప్పటికీ 4:20కి మొదలైంది. ఫ్రాన్సులో ఉండే వారణాసి కిరణ్, ఈ సమావేశానికి రావడం ఒక విశేషం.

సమావేశానికి వచ్చిన స్సభ్యులు:
యు.వెంకటరమణ
తుమ్మల శిరీష్ కుమార్
విజయ్ కట్టా
కృపాల్ కశ్యప్
సాయిచరణ్

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer