e-తెలుగు భవిష్యత్తు కార్యక్రమం

హై.లో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు చేసిన ప్రచార కార్యక్రమానికి సందర్శకుల స్పందనను గమనిస్తే మన ప్రయత్నం సఫలమైనట్టేననిపిస్తోంది. కంప్యూటర్లో తెలుగు చదవొచ్చు, రాయొచ్చూ నని కొత్తగా తెలుసుకొన్నవారు కొందరైతే ఇప్పటికే ఏదో ఒక రకంగా తెలుగును వాడుతూ, అందులో ఎదురౌతున్న ఇబ్బందులకు సంబంధించి సహాయం పొందినవారు కొందరు. రోమను లిపిలో టైపు చేస్తే, తెలుగులోకి లిప్యంతరీకరణ జరిగిపోతుందని తెలుసుకున్నవారు మరి కొందరు. ఇంతమందికి ఎంతో కొంత కొత్త సమాచారాన్ని చెప్పామన్న తృప్తి మనకు కలిగింది. ఈ కార్యక్రమ నివేదికను చూడండి.

23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక (డిసెంబరు 18-28, 2008)

అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసే క్రమంలో 23వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు ఒక స్టాలు తీసికొని నిర్వహించింది. e-తెలుగు నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో కెల్లా ఇదే పెద్దది. హైదరాబాదులో ఉన్న e-తెలుగు సభ్యులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సభ్యులు కూడా తగు సూచనలు సలహాలనిస్తూ పరోక్షంగా పాల్గొన్నారు.

గూగుల్ లో e-తెలుగు

గూగుల్ లో "తెలుగు" అని ఆంగ్లాక్షరాలతో ఎప్పుడయినా టైపు చేసి చూసారా? మొదటగా ఆంగ్ల వికిపీడియాలో తెలుగును గూర్చిన వ్యాసం వస్తుంది. తర్వాత తర్వాత ఎక్కువశాతం సినిమా కబుర్ల సైటులూ లాంటి చెత్తా చెదారం కనిపిస్తాయి. నేను సెర్చి చేసిన సమయానికి తెలుగు సైటు 5 వ లేక 6 వ పేజీలో కనిపించింది. దీనిని మనం మార్చలేమా?

e-తెలుగు సైటుని అనువదిద్దాం రండి!

e-తెలుగు సైటు స్థానికీకరణలో పాలుపంచుకోండి. కంప్యూటర్లు మరియు జాలంలో తెలుగుకై పాటుపడుతున్న మన సైటు పూర్తిగా తెలుగులో ఉండటం అత్యవసరం. ఈ స్థానికీకరణలో పాల్గొనాలంటే, ఇక్కడ వ్యాఖ్యానించండి.

తెలుగు బ్లాగుల దినోత్సవ ప్రత్యేక సమావేశపు నివేదిక — హైదరాబాద్

తెలుగు బ్లాగుల దినోత్సవ హైదరాబాద్ సమావేశపు నివేదిక


e-తెలుగు బ్యానరుతో బ్లాగర్లులు

డిసెంబరు 14 ఆదివారం నాడు తెలుగు బ్లాగరుల విశిష్ట సమావేశం జరిగింది. మొదటి తెలుగు బ్లాగు దినోత్సవం సందర్భంగా జరిగిన ఈ సమావేశానికి 27 మంది వచ్చారు. ఇప్పటివరకు జరిగిన సమావేశాలన్నిటిలోకి అత్యధికంగా హాజరైన సమావేశమిది.

తెలుగు నిలుపుట

తెలుగు భాషకు ప్రాచీన హోదా వచ్చేసింది. సంతోషం. అయితే మాధ్యమాల్లోను, వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, ప్రజావసరాలు, దుకాణాలు మొదలైన వాటిల్లోను తెలుగు వాడకం ఎలా ఉంటోందని గమనిస్తే భాషాభిమానులకు ఆవేదన కలుగుతుంది. టీవీ ఛానెళ్ళలో వాడే తెలుగులో తెలుగు కాక, ఇంగ్లీషే ఎక్కువగా ఉంటోంది. సినిమాల్లో పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. పరిపాలన ఎక్కువగా ఇంగ్లీషులోనే జరుగుతోంది. బడుల్లో తెలుగు మాధ్యమం స్థానే ఇంగ్లీషును ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలుగు నేటి భాష, రేపటి భాషా కాక, కేవలం ప్రాచీన భాషే అయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది.

తెలుగులో టైపు చెయ్యడం ఎలా?

ఈ రోజుల్లో తెలుగుని చాలా సులువుగా టైపు చెయ్యవచ్చు. అందుకు చాలా పరికరాలు, పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటన్నింటి సమాహారమే ఈ టపా.

డిసెంబర్ నెల e-తెలుగు సమావేశ వివరాలు

చల్లని డిసెంబరు నెలలో , పుస్తక ప్రదర్శన జరిగే హైదరాబాదు నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర మన e తెలుగు సమావేశం జరిగింది.

e-తెలుగు హైదరాబాదు సమావేశం అక్టొబర్ 2007

ముఖ్యవిషయములు:
సమావేశస్థలం : క్రిష్ట్ణకాంత్ పార్క్ , యూసఫ్ గూడ.
సభ్యుల సంఖ్య : 13
నూతన సభ్యులు : 1
సమావేశం ప్రారంభం : 3 గంటల 10 నిముషాలు.
విషయములు:

సెప్టెంబరు నెల eతెలుగు సమావేశ వివరాలు

నేను, వీవెన్, రావుగారు ముందుగా నిర్ణయించుకున్న నెక్లెస్ రోడ్ చేరుకున్నాం. అక్కడ ఈట్‌స్ట్రీట్‌లో అప్పటికే శ్రీధర్ గారు, జ్యోతిగారు, జ్యోతిగారి కుమార్తె దీప్తి వేచి ఉన్నారు. చుట్టు పక్కల జనం, గందరగోళ సంగీతం ఇబ్బంది కలిగిస్తున్నాగాని వానొచ్చే సూచనలు కనిపించడంతో అక్కడే సమావేశం అవుదామని నిర్ణయించుకున్నాం.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer