జూలై 2009 హైదరాబాద్ సమావేశ విశేషాలు

జూలై 2009 హైదరాబాద్ సమావేశ విశేషాలు ఇవీ: తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ, తెలుగు OCR.

జూలై నెల హైదరాబాద్ సమావేశం (12 న)

సమయం: ఆదివారం, జూలై 12, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

 • తెవికీలో పాల్గొనడం గురించి
 • స్థానికీకరణ ప్రగతి, పాల్గొనాలనుకునే వారి సందేహాలకు సమాధానాలు
 • జాలంలో తెలుగుకై జరుగుతున్న మరిన్ని ప్రయత్నాలు
 • మరేమైనా...

సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)

e-తెలుగు కార్యవర్గ సమావేశం, జూన్ 14, 2009

2009 జూన్ 14 నాడు జరిగిన e-తెలుగు కార్యవర్గంలోని సమావేశ విశేషాలు:

మార్చి 2009 హైదరాబాదు సమావేశం (8 న)

సమయం: ఆదివారం, మార్చి 8, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

 • స్థానికీకరణ ప్రగతి
 • మరేమైనా...

సంప్రదింపులు: 98664 95967 (వీవెన్)

ఫిబ్రవరి నెల e-తెలుగు సమావేశ వివరాలు

ఫిబ్రవరి నెల e-తెలుగు సమావేశం 8వ తేదీ ఆదివారం యూసఫ్‌గుడా లోని కృష్ణకాంత్ పార్కులో జరిగింది.
సమావేశానికి వచ్చినవారు:
1. తుమ్మల శిరీష్ కుమార్
2. తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం
3. గుళ్ళపూడి శ్రీనివాసకుమార్
4. నామాల నాగ మురళీధర్
5. భార్గవ రామ
6. దాట్ల శ్రీనివాసరాజు
7. కృపాల్ కశ్యప్
8. దూర్వాసుల పద్మనాభం
9. కత్తి మహేష్ కుమార్
10. యనమండ్ర సతీష్ కుమార్
11. వీవెన్
12. పప్పు అరుణ
13. అట్లూరి అనిల్
14. నందం నరేష్
15. సి.హెచ్. మనోహర్
16. శివ ప్రసాద్
ఈ సమావేశానికి వచ్చిన కొత్తవారు
మనోహర్ గారు. వీరు మ్యూజింగ్స్ బ్లాగరి.

ఐ-న్యూస్ కోసం e-తెలుగు కార్యక్రమం

జనవరి నెల 25న కొత్తగా వచ్చిన వార్తా ఛానల్ ఐ-న్యూస్ వారు e-తెలుగు పై, వాటి కార్యకలాపాలపై ఒక కార్యక్రమాన్ని జరపదలచి e-తెలుగును సంప్రదించారు. ఈ మధ్య అనేక వార్తా పత్రికలలో e-తెలుగు కార్యకలాపాలపై వ్యాసాలు వచ్చినా, ఐ-న్యూస్ ద్వారా అనేక మందికి e-తెలుగు కార్యక్రమాలను పరిచయం చేయగలిగే అవకాశం రావటం శుభసూచకం.

సమయం చాలా తక్కువగా వుండటం వలన, కార్యక్రమం ఇంటిలో చేయడంతో స్థలాభావం వలన కేవలం అందుబాటులో వున్న e-తెలుగు సభ్యులను అప్పటికప్పుడు హడావిడిగా పిలవడం జరిగింది.

జనవరి నెల (2009) e-తెలుగు సమావేశపు నివేదిక

జనవరి నెల సమావేశము రెండవ ఆదివారమైన 11వ తేదీన జరిగింది. గత నెలగా e-తెలుగు సంఘం చేసిన కార్యక్రమాల వలన ఈ సమావేశానికి కొత్తవారు వచ్చారు. వీరు - మంచిపుస్తకం ముద్రణా సంస్థ నిర్వాహకులు కొసరాజు సురేశ్ గారు, భాగ్యలక్ష్మి గారు, లండనులో ఉంటున్న తెలుగు బ్లాగరి నాగమురళి గారు, విశ్రాంత ఉద్యోగి నాగేశ్వరరావు గారు, గిరి ప్రసాద్, శాంతి కుమార్ గారు.

సమావేశానికి వచ్చినవారి వివరాలు

1. ఎస్. శాంతి కుమార్
2. శ్రీనివాస కుమార్ (జీవితంలో కొత్త కోణం)
3. కత్తి మహేష్ కుమార్
4. వెంకట రమణ
5. భాగ్యలక్ష్మి (మంచి పుస్తకం)
6. కొసరాజు సురేష్ (మంచి పుస్తకం)
7. దూర్వాసుల పద్మనాభం
8. తుమ్మల శిరీష్ కుమార్

e-తెలుగు ప్రచార సామాగ్రి

అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే పనిలో భాగంగా e-తెలుగు కొన్ని ప్రచార సామాగ్రిని తయారుచేస్తూ ఉంటుంది. ఈ సామాగ్రిని ఇక్కడ చూడవచ్చు 2006 లో "కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎందుకు, ఎలా?" అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించింది. అప్పటికి అధికారికంగా సంఘం నమోదు జరగనప్పటికీ, e-తెలుగు కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ పుస్తకంలో మూడు ప్రధాన విభాగాలుంటాయి. మొదటి విభాగంలో వికీపీడియా గురించి వివరించారు. రెండవ విభాగంలో బ్లాగుల గురించి వివరించారు. మూడవ విభాగంలో కంప్యూటరులో తెలుగు చూడటం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనే అంశాలను చర్చించారు.

e-తెలుగుతో చేయి కలపండి

వివిధ ప్రాంతాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాల్లో e-తెలుగు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆయా ప్రదేశాల నుండి కార్యకర్తలు కావాలి. ఈ కార్యకర్తలు అంతర్జాలంలో తెలుగు గురించి ప్రజలకు సమాచారం అందించే కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంటుంది. ఈ కార్యక్రమాలు కింది వర్గాల ప్రజలను ఉద్దేశించి నిర్వహిస్తూ ఉంటాము.

 • ఉపాధ్యాయులు
 • లెక్చరర్లు
 • కాలేజీ విధ్యార్థులు, విద్యార్థినులు
 • పాత్రికేయులు
 • కంప్యూటరు ల్యాబు సహాయకులు
 • DTP ఆపరేటర్లు
 • ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు

విజయవాడ 20 వ పుస్తక ప్రదర్శనలో ‘e-తెలుగు’ సందడి

విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలలో నాలుగో రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రోజున పుస్తకప్రియులు నగరంలో పాదయాత్ర నిర్వహిస్తారు. పుస్తక పఠనం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పడం దాని లక్ష్యం. 2009 జనవరి 4 న జరిగిన పాదయాత్రలో ‘e-తెలుగు’ కూడా పాల్గొంది. ఆ రోజున ప్రదర్శనలోని ప్రతిభావేదికపై ప్రదర్శన కూడా ఇచ్చింది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer