పాత్రికేయుల వర్కుషాపు

కంప్యూటరులో, ప్రత్యేకించి అంతర్జాలంలో తెలుగు వ్యాప్తి కోసం e-తెలుగు సంస్థ కృషి చేస్తోంది. అందుకుగాను అనేక కార్యక్రమాలు చేస్తోంది. ఇటీవల ముగిసిన హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో ఒక స్టాలు నెలకొల్పి అంతర్జాలంలో తెలుగు గురించిన ప్రచారం కల్పించడమే కాక, కొన్ని తెలుగు సాఫ్టువేర్లను ఉచితంగా అందించింది. ఈ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను చేపట్టింది. వివిధ అంశాలపై తగు సమాచారం ఇవ్వడమే కాకుండా అనేక సాంకేతిక, సాంకేతికేతర విషయాల్లో తక్షణ సహాయం అందించడం ఈ వర్కుషాపులలో ప్రధాన అంశం. కంప్యూటర్లతో ప్రత్యక్ష డిమాన్‍స్ట్రేషను చెయ్యడం ఈ వర్కుషాపుల్లో ఒక భాగం.

eతెలుగు సభ్యత్వం తీసుకునే సమయంలో మీ సభ్యనామాన్ని(యూజర్ నేమ్) తెలుగులో కూడా పెట్టుకోవచ్చు అన్న విషయం మీకు తెలుసా?

మీ విజయగాథని మాతో పంచుకోండి!

కంప్యూటర్లలోనూ మరియు జాలంలోనూ తెలుగు వచ్చిన తర్వాత మరియు దీని వల్ల మీకు చెప్పుకోదగ్గ విజయం లభించిందా? మీ విజయగాథని మేం వినాలనుకుంటున్నాం. రానున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పంచే కరపత్రాలలోనూ, సీడీలలోనూ ఈ విజయగాథలను చేర్చాలని మా ఆకాంక్ష. తద్వారా మరింత మందికి ప్రేరణ కల్గించాలనుకుంటున్నాం.

e-తెలుగు స్టాలు నిర్వహణ సంబంధిత విషయాలు

ఈ రోజు నేను, శిరీష్ కుమార్ గారూ హైదరాబాదు పుస్తకప్రదర్శన కమిటీ అద్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారిని మరియు కమిటీ సెక్రటరీ శ్రీ
హనుమంతరావు గారిని కలసి వచ్చే డిసంబరు నెల 17 నుండి 27 వరకు జరగబోయే 24 వ పుస్తక ప్రదర్శనలో గత ఏడాదిలాగే e-తెలుగుకి ఒక ష్టాలుని కేటాయించవలసిందిగా కోరాము. వారు దీనికి సానుకూలంగా స్పందించి అంగీకరించారు.
అలాగే పుస్తక ప్రదర్శన కాలంలో ఏదో ఒక రోజు రెండు గంటలవరకు కాలాన్ని తమ ప్రదర్శనశాలలో ప్రదర్శన నిమిత్తం e-తెలుగుకి కేటాయింటానికి అంగీకరించారు.

కనీసం 10,000 కరపత్రాలు ముద్రించి e-తెలుగు స్టాలు వద్ద పంచటానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.

హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు

హైదరాబాదు పుస్తక ప్రదర్శన డిసెంబరు నెల 17 నుండి 27 వరకు నెక్లసు రోడ్డులోని పీపుల్స్ ప్లాజా లో జరుగుతుంది. క్రిందటి సంవత్సరం లాగానే e-తెలుగు ఒక స్టాలును నిర్వహించాలని తలపెట్టింది.

మామూలు రోజుల్లో మద్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు మరియు శని, ఆది వారాలలో మద్యాహ్నం 12 నుండి రాత్రి 9 గంటల వరకు స్టాలు తెరచి ఉంటుంది. స్టాలును విజయవంతంగా నడుపుటకు చాలా మంది వాలంటీర్ల అవసరం ఉంది. తమ సేవలను అందివ్వగల తెలుగు అభిమానులు క్రింది వివరాలను ఇ-మెయిలు ద్వారా గాని టెలిఫోను ద్వారా గాని తెలియపరచమని కోరుతున్నాము.

పేరు:
టెలిఫోను నంబరు:

e-తెలుగు నూతన కార్యవర్గ సభ్యులు

నవంబరు 8 (ఆదివారం) మద్యాహ్నం 2 గంటలకు శ్రీ సి బి రావు గారి ఇంట్లో
సమావేసమైన e-తెలుగు నూతన కార్యవర్గ సభ్యులు క్రింది వారిని పదాధికారులుగా
ఏకగ్రివంగా ఎన్నుకున్నారు.
1) దూర్వాసుల పద్మనాభం - అధ్యక్షులు
2) కత్తి మహేష్ కుమార్ - ఉపాధ్యక్షులు
3) కృపాల్ కశ్యప్ - కార్యదర్శి
4) డి.ఎస్.కె చక్రవర్తి - కోశాధికారి
క్రింది నలుగురు సభ్యులు కార్యవర్గ సభ్యులుగా ఉంటారు.
1) యనమండ్ర సతీష్ కుమార్
2) నామాల నాగమురళీధర్
3) వీరవెంకట చౌదరి ( వీవెన్)
4) సి.బి.రావు
తుమ్మల శిరీష్ కుమార్ గారు, ఉప్పల వెంకట రమణ గారు తమ తమ పదవీ భాధ్యతలను
కొత్త కార్యవర్గానికి అప్పగించారు.

మొదటి e-తెలుగు సర్వసభ్య సమావేశం నివేదిక

2009 అక్టోబరు 25 వ తేదీన మొదటి e-తెలుగు సర్వసభ్య సమావేశం జరిగింది.
హాజరైన వారు:

e-తెలుగు కార్యనిర్వాహకవర్గ ఎన్నికలు

e-తెలుగు మొదటి సర్వసభ్య సమావేశం 2009 అక్టోబరు 25 న జరపాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు కూడా ప్రతిపాదించబడింది. ఈ ఎన్నికలకు తుమ్మల శిరీష్ కుమార్ ను ఎన్నికల అధికారిగా నిర్ణయించారు. ఎన్నికల విధివిధానాలు ఇల ఉంటాయి.

  • ఎన్నికల తేదీ: 2009 అక్టోబరు 25
  • ఎన్నికల సమయం: మధ్యాహ్నం 3:45 గంటలకు
  • నామినేషన్ల స్వీకరణ:
    1. ప్రారంభం: 2009 అక్టోబరు 25 మధ్యాహ్నం 3:00 కు
    2. ముగింపు: 2009 అక్టోబరు 25 మధ్యాహ్నం 3:30 కు

సెప్టెంబరు 2009 హైదరాబాదు సమావేశం (13వ తేదీన)

సమయం: ఆదివారం, సెప్టెంబరు, 2009 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

  • కొత్త సభ్యుల చేరిక
  • కార్యకలాపాలపై అవగాహన
  • స్థానికీకరణ ప్రగతి

సంప్రదింపులు: 98664 95967, 98662 36956, 99896 91606

e-తెలుగు సభ్యత్వ దరఖాస్తు ఫారం

e-తెలుగు కొత్త సభ్యులను అహ్వానిస్తోంది
కొత్తగా చేరువారు క్రింది ధరకాస్తు ఫారం డౌన్ లోడ్ చేసుకొని, నింపి e-తెలుగు కార్యాలయానికి సభ్యత్వ రుసుముతో పాటు అందజేయాలి.
రుసుము వివరాలు, చెల్లింపు పద్ధతులు దరఖాస్తు ఫారంతో ఇవ్వబడినాయి.
ఇట్టి సభ్యులు e-తెలుగు సర్వసభ్య సమావేశాలలో పాల్గొనవచ్చు. e-తెలుగు కార్యవర్గానికి పోటీ చేయవచ్చు.
దీని వలన e-తెలుగు ఆశయాలకు మరింత చేయూతనివ్వటానికి వీలవుతుంది

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer