e-తెలుగు నెలవారీ సమావేశం, హైదరాబాద్ — ఆదివారం, జూన్ 19 2011

e-తెలుగు జూన్ నెల మావేశంఈ నెల 19, ఆదివారం
వేదిక: లమకాన్, హైదరాబాద్
సమయం : సాయంత్రం 3 నుండి 5 గఁ॥ వరకు

కంప్యూటర్లలోనూ, జాలం లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి, వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే వర్కుషాపులను గురించి తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ, తెలుగు గురించి చర్చించు కొందాం.

గమనిక: 1. అంకోపరి గల వారు తమ వెంట తెచ్చుకోవాలని మనవి, wifi ఉండొచ్చు కాబట్టి సమాచారాన్ని పంచుకుందాం
2. వేదికలో ఏమైనా మార్పులు ఇక్కడ తెలుపబడతాయి

e-తెలుగు నెలవారీ సమావేశం, హైదరాబాద్ — ఆదివారం, మే 8 2011

సమయం: ఆదివారం, మే 8, 2011 సాయంత్రం 5 గంటల నుండి 7 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

తెలుగు సంగణనపై సదస్సు — హైదరాబాద్, ఏప్రిల్ 16

సిలికానాంధ్ర మరియు ఆంధ్రప్రదేశం ప్రభుత్వం సంయుక్తంగా "అంతర్జాల తెలుగు సదస్సు" (Telugu Internet Symposium) అని ఒక రోజు చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

సమయం
శనివారం, ఏప్రిల్ 16, 2011 నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

వేదిక
డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD),
జూబ్లీ హిల్స్, హైదరాబాద్. (గూగుల్ మ్యాప్స్ పటం)

కంప్యూటర్లలో తెలుగు గురించి చాలా మంది వ్యక్తులూ, సంస్థలూ అనేక విధాలైన కృషి జరుపుతున్నారు. అలాంటి ప్రయత్నాలన్నింటినీ ఒక దగ్గరకు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాచార సాంకేతక రంగంలో తెలుగు గురించి లేదా తెలుగు కోసం కృషి చేస్తున్న వివిధ వ్యక్తుల మధ్య చర్చలకు వీలుకల్పిస్తూ, ఇప్పటివరకూ జరిగిన కృషి ఏమిటి, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్న దానిపై దృష్టిసారించాలన్నది ఈ సదస్సు యొక్క ఉద్దేశం.

e-తెలుగు కూడా ఈ సదస్సులో పాలుపంచుకుంటూంది. ఈ సదస్సుకి మీరు హాజరవాలనుకుంటే, ఈ నమోదు ఫారాన్ని పూరించండి. (ప్రవేశం ఉచితం.)

వెబ్ డెవలపర్లకు e-తెలుగు వర్క్‌షాప్ (జాల నిపుణులకు అవగాహనా సదస్సు)

గత జనవరి e-తెలుగు సమావేశంలో చర్చించుకున్నట్టుగానే ఈ నెల 13 న వెబ్ డెవలపర్స్ కొరకు ఒక సదస్సు మరియు వర్క్‌ షాప్ ను e-తెలుగు నిర్వహించనుంది. ఈ వర్క్ షాపు పూర్తిగా ఉచితం. ఈ వర్క్ షాపులో ఈ అంశాలను చర్చిస్తాము.

  • యూనికోడ్ అంటే ఏమిటి? నేపథ్యం, పరిచయం, ప్రయోజనాలు, టైపింగు పద్ధతులు
  • తెలుగు యూనికోడ్ లో ఒక వెబ్ సైటు నిర్మాణం: PHP, ASP.NET, Python, mySql లలో అమరికలు
  • వర్డ్ ప్రెస్ , డ్రూపల్, మీడియావికీ వంటి CMS లలో తెలుగు సైట్లను రూపొందించడం ఎలా?

హైదరాబాదులో వికీపీడియా దశాబ్ది వేడుక మరియు తెవికీ అవగాహనా సదస్సు

స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా ఏర్పడి ఈ నెల పదిహేనవ తేదీకి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులందరూ వికీపీడియా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. హైదరాబాదులో e-తెలుగు సంస్థ కూడా ఈ వేడుకలను నిర్వహిస్తూంది. ఈ వేడుకలలో భాగంగా, తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం.

25వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు, ఔత్సాహికులకు ఆహ్వానం

ఈ నెల 16 నుండి 26 వరకూ జరిగే 25 హైదరాబాదు పుస్తక ప్రదర్శన (సిల్వర్ జూబ్లీ)లో e-తెలుగు తరపున ఒక స్టాలుని ఏర్పరుస్తున్నాం. ఈ స్టాలు ముఖ్య ఉద్దేశం పుస్తక ప్రదర్శన సందర్శకులకి కంప్యూటర్లలో తెలుగు గురించి తెలియజేయడం, తెలుగు సంబంధించిన సాంకేతిక సమస్యలకి పరిష్కారాలు సూచించడం. ఈ స్టాలుని సందర్శకులకి కంప్యూటర్లలో తెలుగు గురించి, తత్సంబంధిత సమస్యలకి పరిష్కారాలు వివరించడానికి ఔత్సాహికుల అవసరం ఉంది.

స్టాలు పనివేళలు

  • పనిదినాలలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
  • శని, ఆదివారాలలో (వారాంతం) మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు

స్టాలులో వాలెంటీర్లుగా పాల్గొనదలచినవారు మరింత తాజా సమాచారానికై e-తెలుగు హైదరాబాదు గుంపులో చేరండి.

ఈ స్టాలు నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొని దీన్ని తెలుగు వెలుగుల్ని మరింత మందికి చేరువచేయడంలో తోడ్పడతారని ఆశిస్తున్నాం.

ఇట్లు,
e-తెలుగు బృందం.

తెలుగు బ్లాగుల దినోత్సవం 2010

 

మిత్రులారా!

 

ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల రెండో ఆదివారం తెలుగు బ్లాగుల దినోత్సవం గా జరుపుకుంటున్న సంగతి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది.

ఈ సంవత్సరం కూడా  ఈ ఉత్సవంలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయండి.

మీరు చేయదగ్గ పనులు

తెలుగు బాటకి ఆహ్వానం!

తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29)  సందర్భంగా e-తెలుగు తెలుగు బాట అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూంది. తెలుగుకై నడక  ఈ కార్యక్రమ ఉద్దేశం.

వివరాలు:

  •  సమయం: ఆదివారం, ఆగస్టు 29, 2010 - ఉదయం 8 గంటల నుండి 9 వరకు.
  •  స్థలం: హైదరాబాద్, తెలుగు తల్లి విగ్రహం నుండి పీవీ జ్ఞానభూమి వరకు.

సంప్రదించాల్సిన నెంబర్లూ, తదితర  వివరాలని తెలుగు బాట సైటులో చూడవచ్చు.

అచ్చ తెలుగు మాట... పచ్చి తెలుగు మాట... తెలుగునాట ప్రతి నోట పలకాలని; ప్రతిన బూనరా సోదరా... తెలుగుతల్లి రుణం తీర్చుకోరా... నిను కన్ననేల విలువ తెలుసుకోరా... నడవరా తెలుగుబాట... మన జాతికదే వెలుగుబాట...
పై పాటను రాసిన రామ జోగయ్య శాస్త్రి గారి గళం నుండి వినండి

తెలుగు బాట: తెలుగుకై నడుద్దాం!

ఆగస్టు నెల హైదరాబాద్ సమావేశం (8వ తేదీన)

సమయం: ఆదివారం, ఆగస్టు 8, 2010 సాయంత్రం 3 గంటల నుండి 5 వరకు
వేదిక: కృష్ణకాంత్ ఉద్యానవనం, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్. (పటం)

చర్చాంశాలు:

  • ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మన కార్యక్రమం గురించి చర్చ
  • ఇతరత్రా

సంప్రదింపులు: 99630 29061

తెలుగు రచయితలకు అవగాహనా సదస్సు (ఈ ఆదివారం, హైదరాబాదులో)

తెలుగు రచయితలకు ఆహ్వానం! కంప్యూటర్లలోనూ, జాలం లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి తెలుగు రచయితలకి e-తెలుగు ఒక అవగాహనా సదస్సుని నిర్వహిస్తూంది.

సమయం: ఆదివారం, మే 30, 2010 ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 వరకు

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer