బెంగుళురు తెలుగు బ్లాగరుల సమావేశ వివరములు 23 మార్చి 2008

బెంగుళూరు తెలుగు బ్లాగరుల సమావేశం ఆదివారం అనగా 23 మార్చి 2008 లాల్ బాగ్ లో ఉదయం 10:15 గ లకు జరిగింది.
హాజరైన వారు:
-------------
మురళీకృష్ణ కూనపరెడ్డి
ప్రవీణ్ గార్లపాటి
ప్రదీప్ మాకినేని
అంబటి శ్రీధర్
అంబటి ఉష

కొత్తగా చేరినవారు:
----------------
అంబటి శ్రీధర్
అంబటి ఉష

చర్చించినవి:
------------
1. వికితో ఎలా పని చేయాలి?
2. వికిలో ఎలా ఫోటోలను అప్ లోడ్ చేయాలి?
౩. కబుర్లు, కూడలి ఎలా వాడాలి?
4. యాగ్రిగేటర్లు అనగానేమి?
5. ఓపెన్ సోర్స్ సాప్ట్ వేర్స్ "umbutu linux, python language" గురించి
6. యూనీకోడ్ , rts, inscript అనగానేమి?

7. డాట్ నెట్ లో ఆంగ్లం నుండి తెలుగులో మాట్లాడే సాప్ట్ వేర్ తయారు చేస్తే బాగుంటుదని
కూడలిలో సమావేశాల గురించి "notification area :" బేనరు ఉంటే ఎక్కువ మంది
చూస్తారని చర్చించాము.
తరువాత కొన్ని చక్కని ఫోటోలను తీసుకొని 12:45 p.m. కి వీడ్కోలు
పలికితిమి.

ఫొటోలో ఉన్నవారు : మురళీకృష్ణ కూనపరెడ్డి,ప్రదీప్ మాకినేని,అంబటి శ్రీధర్,అంబటి ఉష

ఫొటోలో ఉన్నవారు : మురళీకృష్ణ కూనపరెడ్డి,ప్రవీణ్ గార్లపాటి,ప్రదీప్ మాకినేని,అంబటి శ్రీధర్

మీ
శ్రీధర్ అంబటి.
http://tellaboutyourself.blogspot.com

వ్యాఖ్యలు

పైన ఏడో పాయింటును ఈ విధంగా చదువుకోండి. .NET ఉపయోగించి, మనం తెలుగులో మాట్లాడే మాటలను అర్థం చేసుకుని, వాటిని లిపిలోకి మార్చే సాఫ్టువ్రును (అనగా Speech Recognition Software for telugu) తయారుచేయగలిగితే బాగుంటుందని అనుకున్నాము. తెలుగులో మనం ఉచ్చరణకు అనుగునంగా రాస్తూ ఉంటాముకాబట్టి ఇలాంటి ఒక సాఫ్టువేరును రోపొందించటం కూడా సులువని అభిప్రాయపడ్డాము.

నలుగురైనా సరె.. మీరు చక్కగా ఒక్క తాటిపై నిలబడి ఇలా మీ మీ అభిప్రాయాలను పంచుకున్నందులకు .. మీకు నా అభినందనలు

Dell System, Latitude d830 తొ హైదరాబాదు నుంచి
చక్రవర్తి

Over to you Sridhar

PS: TV ఛానల్ రిపొర్టింగ్ పద్దతిలో చదువుకోగలరు..
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి

కందర్ప కృష్ణమోహన్

మంచి ప్రారంభం - మాకినేని ప్రదీపూ.. ముద్దెట్టుకునేంత అందంగా ఉన్నారు సుమీ........
ప్రవీణ్ గార్లపాటిని ఇన్నాళ్ళకి చూడగలిగాను భేషో భేష్.. మాలాగే (అనగా హై.బా) చక్కగా బ్రేకులూ గ్యాపులూ లేకుండా మీ సమావేశాలు కొనసాగాలని మనసారా కోరుకుంటూ.........