మార్చి నెల 2008 హైదరాబాదు eతెలుగు సమావేశ నివేదిక
ఈసారి భానుడి ప్రతాపం వల్ల సమావేశం కొద్దిగా ఆలస్యముగానే ప్రారంభమైనది(మూడు గంటల 30 నిముషాలకు),ఈ సారితక్కువమంది సబ్యులు హాజరు అవుతారనుకుంటుండగా.. నాలుగు గంటలకు చిన్నగా ప్రారంభమై ఆరు గంటలవరకు వస్తూనేఉన్నారు!
సమయం: 3 గం 30 నిమిషములు
సమావేశస్థలం : క్రిష్ట్ణకాంత్ పార్క్ , యూసఫ్ గూడ.
హాజరైన సభ్యులు: 20
నూతన సభ్యులు: 4
ప్రవీణ్,శ్రావ్య,సత్యసాయి,శ్రీనివాసరాజు,త్రివిక్రం.
మొదటగా నూతన సభ్యుల పరిచయకార్యక్రమాలు మొదలయ్యాయి, నరసింహారావు గారు(పద్మనాభం గారి మిత్రులు), నందగిరి ప్రవీణ్ గారు(భాగ్యనగరం బ్లాగు), కె.యస్. శ్రావ్య గారు (సత్యసాయి గారి కుమార్తె). అప్పుడు సత్యసాయి గారు శ్రావ్యవరాళి(కె.యస్.శ్రావ్య)ని సభకు పరిచయం చేస్తు 7వ తరగతి పూర్తి చేసింది అనిచెప్పగా.. శ్రావ్య కలిపించుకొని 7వ తరగతి కాదు 8 మిది అనగానే సభలొ నవ్వులతొనిండి పొయింది. ఇంతలొ రావు గారు (సి.బి.రావ్) గారు పేరు పైన వివరణ అడిగితెలుసుకున్నారు, సీతారామ శాస్త్రి గారు(కే.బి.యల్ శర్మ గారి స్నేహితులు) నూతన బ్లాగరి! కొత్త వాళ్ళ పరిచయకార్యక్రమాలు ముగియగానే....
కట్టా విజయ్,తుమ్మల శిరీష్,సి.బి.రావ్,క్రిస్ట్నకిషొర్.
[సమయం 4 గం|30నిమిషములు..]
చదువరి గారి రాక(తుమ్మల శిరీష్),చావా కిరణ్ గారు (ఒరెమూన) తెలుగు బ్లాగర్లపై అలిగారని! అందుకే ఆలశ్యముగా వస్తున్నారని తెలియగనే సభలొ నవ్వులతొనిండిపొయింది, రావు గారికి సుధాకర్ (శొధన) గారికి మధ్య ఉత్తమ తెలుగు బ్లాగుల విషయమై చాలా రసవత్తరమైన చర్చజరిగింది! రావు గారు నేను ఎందుకు లెజండ్ కాదు అని ప్రశ్నించగానే ఎవరి బ్లాగుకి వారే "సుమన్" అని అనడంతొ విషయం చర్చ 'ఎవరిబ్లాగుకి వారే సు మన్ ' మీదకి వెళ్ళింది!
[సమయం 4 గంటల 45 నిముషాలు.. ]
జాన్ హైడ్ కనుమూరి గారి రాక. శర్మ గారు వారి పుత్రికను సభకు పరిచయం చేశారు పేరు 'సుమబాల'.
రావు గారు త్రివిక్రం గారిని ఉద్దేశించి 'వివాహాయ:బ్లాగునాశాయ: ' అని తరచూ బ్లాగు రయకపొవడంపై చిన్న చురక అంటించారు.
వెంకటరమణ,శర్మ(సుమబాల తొ),శాస్త్రి.
[సమయం 5 గంటలు....]
చావా కిరణ్ గారి రాక.
బ్లాగులు వాటి విలువలు, ఎలారాయలి, బ్లాగు లక్షణాలపై సుధాకర్ గారి సుదీర్గమైన వివరణ...లో బ్లాగుకి వెబ్ సైటుకి తేడా, ఏమి రాయలి, ఎప్పుడు రాయాలి అనేదాని పైన చర్చ జరిగింది. రావు గారు సుధాకర్ గారినుంచి వీలైనంతవిషయాన్ని చెప్పించటానికి ప్రయత్నించారు. 'తెలుగులొ అత్యుత్తమ బ్లాగులు' సుధాకర్ గారు టపాపై వివరణ ఇచ్చారు. ఇంతలొ వసంతకుమార్ గారి హాట్ మరియూ సత్యసాయి గారి స్వీట్స్ సభలొ చక్కెర్లు కొట్టాయి.
సభికులందరు ఎజండా పై చర్చని కొరగా.. వీవెన్ గారు బీటావికీ గురించి వివరణ ఇచ్చారు http://translatewiki.net/wiki/Main_Page ఇక్కడ అనువాదాలు చేయాలని దీనివలన ఇతర భాషల వికీలను కూడా తెలుగులో చదవవచ్చునని తెలిపారు, వివిధ అనువాదాలు ఎంతవరకు అయినది సభకు వివరించారు.
సత్యసాయి,శ్రీనివాసరాజు,త్రివిక్రం,సుధాకర్,వీవెన్.
[సమయం 6 గంటలు]
చివరిగా 20వ వ్యక్తిగా కాశ్యప్ గారి రాక! కొత్తబ్లాగర్లని పెంచడం ఏలా అని చర్చ! సత్యసాయి గారు localisation project (NIC) గురించి సభకు వివరించారు.
[సమయం 6 గం 10 నిమిషములు]
సత్యసాయి గారు సభకువీడ్కొలు పలికారు... అంతాలేచి నిలబడి గుంపులుగాచేరి చర్చించుకుంటున్నారు. జాన్ గారు కొత్తవారికి వారి రచనల పుస్తకాన్ని ఇచ్చారు. అందరం మాట్లాడుకుంటూ Cafetaria కి చేరుకొని టీ, కాఫి సేవించి బయలు దేరటానికి ఉపక్రమించాం.. అప్పుడు బడ్జెట్ పైన, రాజకీయాలపైన చర్చ జరిగింది (కొద్ది సేపే!!).
[సభికులు]
1. కశ్యప్
2. చావా కిరణ్
3. వసంతకుమార్
4. జాన్ హైడ్ కనుమూరి
5. తుమ్మల శిరీష్
6. సీతారామ శాస్త్రి
7. కే.బి.యల్ శర్మ
8. కే.యస్.శ్రావ్య
9. సత్యసాయి
10. శ్రీనివాసరాజు ధాట్ల
11. సుధాకర్
12. వెంకటరమణ
13. వీవెన్
14. త్రివిక్రం
15. సి.బి.రావు
16. పద్మనాభం దుర్వాసుల
17. నరసింహారావు
18. నువ్వుశెట్టి క్రిష్టకిషొర్
19. నందగిరి ప్రవీణ్
20. కట్టా విజయ్
వచనం:కట్టా విజయ్
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

సుధాకర్(శో
సుధాకర్(శోధన)రాసిన, తెలుగులో ఉత్తమ బ్లాగులు,బ్లాగుపై వారి నిర్వచనానికి, వారి వ్యక్తిగత అభిప్రాయం మేరకు ఎంపిక చేసినట్లుగా సుధాకర్ చెప్పటం తో ఉత్తమ బ్లాగుల పై చర్చ ఒక కొలిక్కి వచ్చింది.
౧ - "ఉత్తమ
౧ - "ఉత్తమ తెలుగు బ్లాగుల విషయమై చాలా రసవత్తరమైన చర్చజరిగింది" - దీనిని గురించి ఇంకొంచెం వివరంగా ఉండివుంటే బావుండేది.
౨ - "బ్లాగులు వాటి విలువలు, ఎలారాయలి, బ్లాగు లక్షణాలపై సుధాకర్ గారి సుదీర్గమైన వివరణ...లో బ్లాగుకి వెబ్ సైటుకి తేడా, ఏమి రాయలి, ఎప్పుడు రాయాలి అనేదాని పైన చర్చ జరిగింది." వీటి మీద కూడా.
౩ - "'తెలుగులొ అత్యుత్తమ బ్లాగులు' సుధాకర్ గారు టపాపై వివరణ ఇచ్చారు." వారు రాసినా టపా మీద వివరణ ఇచ్హారా లేక ఉత్తమ బ్లాగులు ఇవి _ ఎందుకని వివరించారా?
అనిల్ అట్లూరి
కందర్ప
కందర్ప కృష్ణమోహన్
ఆరోజు జెమినీ లో శంకరాభరణానికి దాసుడనై సమావేశానికి గైరుహాజరయినందుకు కడవలు కడవలుగా చింతించుచున్నవాడను.
కృష్ణమోహన
కృష్ణమోహన్‍గారూ..
ఈ సమావేసానికి నేను గత ౨ (2) నెలల నుండి ఎన్నెన్ని లెక్కలు పత్రాలు వేసాననుకున్నారు .. చాలా చాలా కూడికలు తీసివేతలు వేసి ప్రణాళిక సిధ్ధం చేసుకుంటే.. దురదృష్టవసాత్తు ఆరోజు ఉదయం అల్పాహారం (దిల్‍షుక్‍నగర్ లోని ఒక ౨ నక్షత్రాల హోటల్‍లో తిన్న) దోస, ఖచ్చితంగా నేను బయలుదేరే సమయానికి కడుపులో గుడగుడ చేసి.. ఆ పొద్దు తిన్న మధ్య్హాన్నాన్ని కూడా కలుపుకుని వాంతుల ద్వారా బయటకు తీసుకువచ్చేసింది. ఏమి చెయ్యమంటారు చెప్పండి?
సరదాకోసం.. నేను అందరికి ఒక ఆంగ్ల సామెతను నా నానుడిగా అడిగినా అడుగక పోయినా చెబుతూ ఉంటాను.. అలాగే మీతో ఇలా ఇక్కడ ఆంగ్లంలో
If we fail to plan, we are planning to fail.. ఇంత చెప్పి, ఇంత చేసి.. ఎంత ప్రణాళిక వేసుకున్నా ఆఖరినిమిషంలో విధి నామీద సీత కన్నేసింది.. ఏంచేద్దాం చెప్పండి.. అంతా మన ప్రాప్తాప్రాప్తం అని సరిపెట్టుకోవడం తప్పితే.
-------------------------------------------
వినదగు నెవ్వరు జెప్పినన్ - వినినంతనే వేగిర పడక వివరింప దగున్
కనికల్ల నిజము దెలిసిన - మనుజుడే పో నీతిపరుడు మహిలో సుమతి