వర్షాకాల సమావేశం నుంచి కొన్ని చినుకులు

మొదటి సారి సమావేశానికి వర్షం లో తడిచి వెళ్ళటం బాగుంది. (seriousness ని నిరూపించుకునే అవకాశం దొరికింది :)
గేట్ వరకూ వెళ్ళి చదువరి గారికి ఫోన్ చేసి రింగ్ అవుతూండాగా నన్నెలా గుర్తు పడతారు, పేరు చెప్తే తెలుస్తుందా ఇలాటి సందేహాలొచ్చాయి.

తీరా అట్నుంచి హలో అనగానే "నేనూ.. స్వాతి ని గేట్ దగ్గరున్నా" అని తలా తోకా లేకుండా చెప్పేశా.
ఆయన వెంటనే "ఓ స్వాతీ! వెంకట రమణ వస్తున్నాడు" అని అంతే క్లుప్తం గా నా పని సులువు చేసేసారు.
ఆ పక్కనే బైక్ ఆపి తల తుడుచుకుంటున్న ఒకబ్బాయిని పక్కన అతని స్నేహితురాల్నీ చూసీ ఇటు తిరిగే లోపు వెంకట రమణ రానే వచ్చారు.

నన్ను వెంటనే గుర్తు పట్టి ఆ పక్క ఉన్న అబ్బాయిని కూడా నాతో పాటు సాదరం గా లోపలికి తీసుకు వెళ్ళారు. అలా వెళ్తూ ఉండగా పక్కనున్న ఆ అబ్బాయి నాతో "మీరు కూడా బ్లాగులు రాస్తారా (కొంపతీసి:)) ఇవ్వాళేదో మీటింగ్ ఉందటగా" అన్నాడు. తర్వాత్తెలిసింది అతను జ్యోతి గారబ్బాయని.
ఇక మమ్మల్ని తీసికెళ్ళటానికి రమణ గారితో పాటు వచ్చిన ఇంకో వ్యక్తి ని చూసి నేను right brain ఉపయోగించి ఫొటొలన్ని గుర్తు తెచ్చుకుని "సుధాకర్ గారా?" అని అడిగితే "కాదు, రోహిణీ కుమార్" అని మళ్ళి రమణే చెప్పారు.

అలా మన మిత్రులంత కూర్చున్న దృశ్య కనుచూపూ మేర లో కనిపించగానే రమణ నాకు దూరం నుంచే వారిని పరిచయం చేశారు. చదువరి, కిరణ్, అక్కిరాజు గారు, సుధాకర్ అని చెప్తుండగానే సుధాకర్ మమ్మల్ని క్లిక్కేశారు.
పలకరింపులయి కూర్చోగానే కిరణ్ ఒక smart ఐన అమ్మాయితో అంత్యాక్షరి ఆడ్డం గమనించా . తనే భావన అట(తర్వత్తర్వాతా నాక్కొద్దిగా ఫ్రెండ్ అయిందిలెండి).

మెల్లగా సమవేశ స్థలానికి వెళాం. ఈ లోపు ఎవరొ వార్త మోసుకొచ్చారు"వీళ్లంతా కలిసి సురేష్ గారిని ఆటొ లో వేసుకుని తెచ్చేశారు" అని.
చదువరి గారు కొద్దిగా నొచ్చుకుని."పోన్లెండి, ఆయనకి హైదరాబాద్ రోజులు గుర్తొచ్చుంటాయి" అని సమాధానపడ్డారు.
ఇలా మాట్లాడుకుంటు ఉండగా సుధాకర్ అత్యాశ గా అప్పటికే తెలుగులో ఇదంతా టైప్ చేసి చదువరి గారికి చూపించారు. ఆయన "గార్లు ఎక్కువయ్యాయి" అన్నరు. సుధాకర్ కొంచం confuse అయి "ఆ table మీద ఉన్నయి గార్లు" అనగనే నాకర్ధమైంది చదువరి గారు పేర్ల చివర పెట్టిన 'గార్లూ గురించి చెప్తే సుధాకర్ 'తీపి గార్లు(డౌనట్) గురించి చెప్పారని.

తర్వాత క్లుప్తం గా పరిచయాలు. బ్లాగులు రాయని వాళ్ళని రాయమని ప్రోత్సహించటం జరిగాయి.

ఒక చిన్న break.
break లో ఫోటో లు. ఫ్లాష్ రాకపోతే ఫోటో దిగినట్టు ఉండదని కశ్యప్ గారు ఫ్లాష్ కనిపించేదాకా వదల్లేదు.
భావన తనకి బోర్ గా ఉందని వాళ్ళ నాన్నగారిని alert చేసింది మరోసారి.

తర్వాత మళ్ళీ సమావేశం.
ఈ సారి చాలా సీరియస్ గా నామవాచకాలు, క్రియా రూపాలు మీద చర్చ. ఈ లోపు కారప్పూసలు గట్రా ఖాళీ అయ్యాయి.
అలా ఏడవుతుండగా భావన కి బోఋ ఎక్కువైపోవటం వల్ల అక్కిరాజు గారు జాగ్రత్త పడి బయల్దేరారు. సాగనంపటానికి రమణ గారూనూ. వాళ్ళతో పాటు నేనూ.
పాత్రల సంగ్రహం:
వెంకట రమణ: (పెళ్ళి పెద్ద) అందర్ని ఆహ్వానించటం నుంచి, మర్యాదలూ సాగనంపటాలు చేస్తూ కొత్త దనం పోగొట్టి ఆత్మీయం గా అనిపించారు.
చావా: అందర్నీ "పిల్లలూ" అంటూ సందడి చేశారు.
సుధాకర్: పాపం లాప్ టాప్ తోనే సరిపోయింది.
సురేష్: చొరవ, చర్చ అంతా వీరి చేతుల మీదే.
అక్కిరాజు : మీటింగ్ లో సెలెబ్రిటీ

--
http://swathikumari.wordpress.com
Regards,
Swathi.

రాబొయే,

రాబొయే, తెలుగు బ్లాగరుల,సమావేశ నివేదికలు, ఎవరి చేత రాయించాలా అన్న ప్రశ్నకు తెర పడినట్లే. సుధాకర్, స్వాతి ఇద్దరూ సమర్ధంగా రాస్తారని, ఇప్పుడు, అందరికీ తెలిసింది.

వున్నపళంగ

వున్నపళంగా హైదరాబాదు వచ్చేసి సమావేశాల్లో పాల్గోవాలనిపిస్తోంది.

(ఈ వాఖ్యల బాక్సు ఎడమవైపుకు జరిగి పోయి కొద్దిగా ఇబ్బంది పెడుతోందే! నాకేనా అందరికీనా?)

-- --ప్రసాద్
http://blog.charasala.com

బాగా

బాగా రాశారు. :-)
ఈ వ్యాఖ్యల పెట్టె నన్ను చూసి కూడా దాక్కుంటోంది.