26వ పుస్తక ప్రదర్శన

ఈ రోజు ఆదివారము కావటముతో ఖాళీగా ఉండటము ఎందుకని 26వ పుస్తక ప్రదర్శన కు మా స్నేహితులతో వెళ్ళాను. మధ్యాహ్నము ఒంటిగంట నుండి సాయంత్రము ఆరుగంటల వరకు అక్కడే ప్రదర్శనకు ఉంచిన దాదాపు అన్ని స్టాల్ లు తిరిగాము. నన్ను విపరీతముగా ఆకట్టుకున్న స్టాల్  మాత్రము e - తెలుగు స్టాల్ అని చెప్పటానికి సంతోషిస్తున్నాను. మొదట స్టాల్ చూసిన వెంటనే కొద్దిగా కరపత్రాలతో ఖాళీగా వున్నా అలమర,  వెనక చిన్న e - తెలుగు బానర్ తో, డెల్ లాప్టాప్ ముందు వున్న ఒక వ్యక్తి ని చూసాను తను కశ్యప్ . వెళ్లి నన్ను పరిచయము చేసుకుని ఖాళి CD ఇచ్చి వారి ఉపకరణాలను కాల్చి ఇవ్వమమని కోరాను. తను ఆపనిలో లో వుండగా అక్కడి కరపత్రాలలోని సమాచారాన్ని చదివాను. నాకు ఆదివారము అయినా, స్టాల్ ప్రారంభము లో వున్నా సందర్శకులు ఎక్కువగా రాకపోవటానికి కారణాలు కొన్ని కనిపించాయి. 1 . బానర్ లోపలివైపు కాకుండా పైభాగములో పెడితే బాగుంటుంది. 2 . స్టాల్ లో కనీసము ముగ్గురికి తక్కువ కాకుండా వాలేంటీర్ లు వుంటే బాగుంటుంది. 3 . ప్రక్కనే వున్నా స్వేచ్చ స్టాల్ లాగా మీ తెలుగు ఉపకరణాలని ముందుగానే కాల్చి సందర్శకులనించి నామమాత్రపు రుసుము 20 రూపాయలు వసూలు చేస్తే బాగుంటుంది.         చివరగా ఇంత మంచి కార్యక్రమము చేపట్టినందుకు అభినందిస్తూ ఈరోజు నుంచి నేను కుడా మీ కార్యక్రమాలకు హాజరు అవాలనుకుంటున్నానని తెలియజేస్తూ .... శ్రీను

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer