26వ హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో తొలి రోజు...

ఆనందంగా ఉత్సాహంగా గడిచింది. e-తెలుగు అధ్యక్షుడు వీవెన్, కార్యదర్శి కశ్యప్, కినిగె చావా కిరణ్, అట్లురి అనిల్, రెహ్మానుద్దీన్, ప్రవీణ్, రవితేజ, శ్రీనివాసకుమార్ తదితరుల కలయికతో మన e-తెలుగు స్టాల్ (2వది) కళకళలాడింది. కబుర్లు.. చెప్పుకుంటూ అలమరలు, కుర్చీలు, బల్ల సర్దుకోవడం, అంతర్జాలంలో ఉచితంగా అందుబాటులో ఉన్న తెలుగు వనరుల గురించి తెలిపే కరపత్రాలు సిద్ధం చేయడం, పంపిణీ చేయడం, అధ్యక్ష, కార్యదర్శుల అంకోపరుల (Laptop) ద్వారా సందర్శకులకు కంప్యూటర్లు, అంతర్జాలంలో తెలుగు వాడకం గురించి తెలియజేయడం తదితర కార్యకలాపాలతో తొలిరోజు కార్యక్రమం ఉల్లాసంగా గడిచింది. వచ్చిన సందర్శకుల్లో ఒకరిద్దరు మన e-తెలుగు కార్యక్రమాల పట్ల అత్యంతాసక్తిని కనబరచడం ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మిగిలిన తొమ్మిది రోజుల్లో మరిందరు సందర్శకులు, మన బ్లాగర్లు, వికీపిడియన్లు, సభ్యుల రాక e-తెలుగు స్టాల్ మరింత కళను సంతరించుకుంటుందని ఆశిద్దాం...

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer