తెలుగుబాట ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటలకి

 e-తెలుగు సంస్థ తెలుగుబాట   తెలుగు ప్రజలందరినీ చైతన్యవంతం చెయ్యటానికి తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు సంస్థ తెలుగుబాట అనే కార్యక్రమాన్ని చేయ సంకల్పించింది. ఆగస్టు 29 పనిదినం కావటంతో అందరికీ వీలుగా ఉండేందుకు ఆదివారం నాడు చేయాలని నిర్ణయించారు. ఆదివారం, ఆగస్టు 28, 2011 నాడు ఉదయం 9 గంటలకి మొదలవుతుంది. తెలుగు లలిత కళాతోరణం నుండి బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ వరకు నడక. ఈ కార్యక్రమం మన భాషపైన మనకున్న మక్కువను ప్రపంచానికి చాటడానికి. మన భాష ఉనికిని కోల్పోతుంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఎలుగెత్తి చాటాడానికి. రండి కలిసి నడుద్దాం. మన చేయూతనిద్దాం. మన భాషను పరిరక్షించుకునే ఈ ఉద్యమానికి తోడ్పడి దీనిని మహోద్యమంగామారుద్దాం. గత సంవత్సరము  తెలుగుబాట కార్యక్రమము ఆ విజయవతముగా నిర్వహించాము, . ఈ   తెలుగు బాట    కార్యక్రమమును  కార్యకర్తల/  సాహాయకుల  అవసరము  కలదు  కార్యకర్తలు  తెల్లవారుఘామున ఎనిమిది గంటలకు హాజరు కావలెను వస్త్ర ధారణ నియమములు ఏమీలేవు  . తెలుపు రంగు ,  తెలుగు సాంప్రదాయ ఆహార్యము అయితే మరీ మంచిది :) కార్యకర్త లకు బ్యాడ్జిలు,  కార్యక్రమ ప్రణాళిక అందచేయబడును  ,  కార్యకర్తలు  మధ్యానం  పన్నెండు గంటల వరకు  ఉండవలెను   దయచేసి తెలుగుబాటకు సహాయపడు  ఔస్తాహికులు  వివరములు  support@etelugu.org  మెయిల్  చేయగలరు.పేరు                     :ఫోను                    :e  మెయిల్            :సహాయము తరగతి :  నిర్వాహణ పరమైన / సాంకేతిక పరమైన   మన తెలుగు వారందరము కలసి ఈ తెలుగు బాటను విజయవంతం చేద్దాం, ప్రవేశం ఉచితం. మీకు తెలుగు బాట కార్యక్రమంలో పాల్గొనాలని ఉంటే, మా నమోదు ఫారాన్ని పూరించండి. నమోదు ఫారం http://telugubaata.etelugu.org/మీరు తెలుగు కోసం తపించే వారైతే మాతో కలవండి. మాతో నడవండి! 

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer