తెలుగు సంగణనపై సదస్సు — హైదరాబాద్, ఏప్రిల్ 16

సిలికానాంధ్ర మరియు ఆంధ్రప్రదేశం ప్రభుత్వం సంయుక్తంగా "అంతర్జాల తెలుగు సదస్సు" (Telugu Internet Symposium) అని ఒక రోజు చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి.

సమయం
శనివారం, ఏప్రిల్ 16, 2011 నాడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు.

వేదిక
డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRD),
జూబ్లీ హిల్స్, హైదరాబాద్. (గూగుల్ మ్యాప్స్ పటం)

కంప్యూటర్లలో తెలుగు గురించి చాలా మంది వ్యక్తులూ, సంస్థలూ అనేక విధాలైన కృషి జరుపుతున్నారు. అలాంటి ప్రయత్నాలన్నింటినీ ఒక దగ్గరకు తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాచార సాంకేతక రంగంలో తెలుగు గురించి లేదా తెలుగు కోసం కృషి చేస్తున్న వివిధ వ్యక్తుల మధ్య చర్చలకు వీలుకల్పిస్తూ, ఇప్పటివరకూ జరిగిన కృషి ఏమిటి, భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి అన్న దానిపై దృష్టిసారించాలన్నది ఈ సదస్సు యొక్క ఉద్దేశం.

e-తెలుగు కూడా ఈ సదస్సులో పాలుపంచుకుంటూంది. ఈ సదస్సుకి మీరు హాజరవాలనుకుంటే, ఈ నమోదు ఫారాన్ని పూరించండి. (ప్రవేశం ఉచితం.)

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer