వెబ్ డెవలపర్లకు e-తెలుగు వర్క్‌షాప్ (జాల నిపుణులకు అవగాహనా సదస్సు)

గత జనవరి e-తెలుగు సమావేశంలో చర్చించుకున్నట్టుగానే ఈ నెల 13 న వెబ్ డెవలపర్స్ కొరకు ఒక సదస్సు మరియు వర్క్‌ షాప్ ను e-తెలుగు నిర్వహించనుంది. ఈ వర్క్ షాపు పూర్తిగా ఉచితం. ఈ వర్క్ షాపులో ఈ అంశాలను చర్చిస్తాము.

  • యూనికోడ్ అంటే ఏమిటి? నేపథ్యం, పరిచయం, ప్రయోజనాలు, టైపింగు పద్ధతులు
  • తెలుగు యూనికోడ్ లో ఒక వెబ్ సైటు నిర్మాణం: PHP, ASP.NET, Python, mySql లలో అమరికలు
  • వర్డ్ ప్రెస్ , డ్రూపల్, మీడియావికీ వంటి CMS లలో తెలుగు సైట్లను రూపొందించడం ఎలా?

ఆ పై అక్కడికక్కడే ఆహూతులతో ప్రత్యక్షంగా హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. ఆసక్తి గల వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోగలరు.

వివరాలు

తేదీ మరియు సమయం:
ఆదివారం, ఫిబ్రవరి 13, 2011 మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు

వేదిక:
హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై. లి.
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004.
(పటం)

సంప్రదింపులు: 90303 65266, support @ etelugu.org

ఈ తెలుగు సమావేశాల వివరాలు

ఈ తెలుగు సమావేశాల వివరాలు ఎప్పటికప్పుడు మెయిల్ చేస్తారని ఆశిస్తున్నాను.                              ....నమస్సులతో                                                                  మిస్టర్ మేన 

హైదరాబాదులో జరిగే e-తెలుగు

హైదరాబాదులో జరిగే e-తెలుగు కార్యక్రమాల వివరాల కోసం  etelugu-hyd గూగుల్  గుంపులో చేరండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer