హైదరాబాదులో వికీపీడియా దశాబ్ది వేడుక మరియు తెవికీ అవగాహనా సదస్సు

స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వమైన వికీపీడియా ఏర్పడి ఈ నెల పదిహేనవ తేదీకి 10 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఔత్సాహికులందరూ వికీపీడియా దశాబ్ది ఉత్సవాలను జరుపుకుంటున్నారు. హైదరాబాదులో e-తెలుగు సంస్థ కూడా ఈ వేడుకలను నిర్వహిస్తూంది. ఈ వేడుకలలో భాగంగా, తెలుగు వికీపీడియాను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన అవగాహనా సదస్సును నిర్వహిస్తున్నాం. తెలుగు వికీపీడియా లోని విశేష వ్యాసాలతో కూడిన సీడీని కూడా ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నాం.

ఈ వేడుకలలో పాల్గొని ప్రేరణ పొందండి. అవగాహనా సదస్సులో వికీపీడియాకి తోడ్పడటమెలాగో తెలుసుకోండి. తద్వారా, తెలుగులో అపూర్వ విజ్ఞాన సంపందని పోగేసే ఈ మహా ప్రయత్నంలో మీరు కూడా భాగస్వాములవండి.

రండి, తెలుగు విప్లవంలో పాలుపంచుకోండి!

వివరాలు

తేదీ మరియు సమయం:
ఆదివారం, జనవరి 23, 2011 ఉదయం 10 గంటల నుండి 12 వరకు

వేదిక:
హనీపాట్ ఐటీ కన్సల్టింగ్ ప్రై. లి.
6-2-46, అడ్వొకేట్స్ కాలనీ,
ఏసీ గార్డ్స్, లకడీ-కా-పూల్,
హైదరాబాద్ - 500 004.
(పటం)

సంప్రదింపులు: 90303 65266, support @ etelugu.org

మరింత సమాచారం

ప్రచారం

మీరు A4 పరిమాణంలో ముద్రణకి ఈ కరపత్రాన్ని ఉపయోగించుకోవచ్చు.

ఈ కార్యక్రమానికి మీ వంతు ప్రచారం చేయడానికి ఈ క్రింది వనరులను ఉపయోగించుకోవచ్చు.

పెద్ద సైడుబారుకి:

<a href='http://etelugu.org/node/358'>
<img src='http://etelugu.org/files/wikipedia10_te_web_sidebar.png' alt='హైదరాబాదులో తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకలకు ఆహ్వానం'>
</a>

చిన్న సైడుబారుకి:

<a href='http://etelugu.org/node/358'>
<img src='http://etelugu.org/files/wikipedia10_te_web_sidebarmini.png' alt='హైదరాబాదులో తెలుగు వికీపీడియా దశాబ్ది వేడుకలకు ఆహ్వానం'>
</a>

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer