25వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు, ఔత్సాహికులకు ఆహ్వానం

ఈ నెల 16 నుండి 26 వరకూ జరిగే 25 హైదరాబాదు పుస్తక ప్రదర్శన (సిల్వర్ జూబ్లీ)లో e-తెలుగు తరపున ఒక స్టాలుని ఏర్పరుస్తున్నాం. ఈ స్టాలు ముఖ్య ఉద్దేశం పుస్తక ప్రదర్శన సందర్శకులకి కంప్యూటర్లలో తెలుగు గురించి తెలియజేయడం, తెలుగు సంబంధించిన సాంకేతిక సమస్యలకి పరిష్కారాలు సూచించడం. ఈ స్టాలుని సందర్శకులకి కంప్యూటర్లలో తెలుగు గురించి, తత్సంబంధిత సమస్యలకి పరిష్కారాలు వివరించడానికి ఔత్సాహికుల అవసరం ఉంది.

స్టాలు పనివేళలు

  • పనిదినాలలో మధ్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు
  • శని, ఆదివారాలలో (వారాంతం) మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు

స్టాలులో వాలెంటీర్లుగా పాల్గొనదలచినవారు మరింత తాజా సమాచారానికై e-తెలుగు హైదరాబాదు గుంపులో చేరండి.

ఈ స్టాలు నిర్వహణలో ఉత్సాహంగా పాల్గొని దీన్ని తెలుగు వెలుగుల్ని మరింత మందికి చేరువచేయడంలో తోడ్పడతారని ఆశిస్తున్నాం.

ఇట్లు,
e-తెలుగు బృందం.

e-తెలుగు బాడ్జి

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer