తెలుగు బాటకి ఆహ్వానం!
Submitted by వీవెన్ on సోమ, 08/23/2010 - 06:31
తెలుగు భాషా దినోత్సవం (ఆగస్టు 29) సందర్భంగా e-తెలుగు తెలుగు బాట అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూంది. తెలుగుకై నడక ఈ కార్యక్రమ ఉద్దేశం.
వివరాలు:
- సమయం: ఆదివారం, ఆగస్టు 29, 2010 - ఉదయం 8 గంటల నుండి 9 వరకు.
- స్థలం: హైదరాబాద్, తెలుగు తల్లి విగ్రహం నుండి పీవీ జ్ఞానభూమి వరకు.
సంప్రదించాల్సిన నెంబర్లూ, తదితర వివరాలని తెలుగు బాట సైటులో చూడవచ్చు.
పై పాటను రాసిన రామ జోగయ్య శాస్త్రి గారి గళం నుండి వినండి
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి


తెలుగు బాటలో పాల్గొనాలని
తెలుగు బాటలో పాల్గొనాలని ఆశించి సదరు కార్యక్రమానికి నమోదు చేసుకున్నందులకు మీకు e-తెలుగు తరఫున ధన్యవాదములు. ఇలాగే ఇకపై మీ సహాయ సహకారాలు మాకు ఎల్ల వేళలా ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ సందర్బంగా మీ యొక్క సలహాలు కోరుతున్నాము. మరియు ఇకపై ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో కూడా తెలియ జేయమనవి. అలాగే మీరు కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని మాతో పాటు నడక సాగించినట్లైతే మీ అనుభవాలను మాతోగానీ లేదా మీ బ్లాగులో కానీ పంచుకోండి, అలా పంచుకున్న విషయాన్ని మాకు తెలియ జేయ మనవి.మీ తెలుగు ప్రయాణంలో e-తెలుగు మీకు ఎలా ఉపయోగపడగలదో అడగండి, అందుకు మేము మరియ మా సహాయం ఎల్లవేళలా సిద్దంగా ఉంటుంది.జై తెలుగు తల్లి.