తెలుగు వెబ్ సిట్ సహాయం కొరకు
Submitted by aggidi on శుక్ర, 07/30/2010 - 17:37
నేను తెలుగులో వెబ్ సైట్ తయారు చేయాలనుకుంటున్నాను.విండోస్ 7 ని వాడుతున్నాను.తెలుగు కోసం 'అను 7.0 సాఫ్ట్ వేర్' ను వాడుతున్నాను. కాని, నేను ఉపయోగిస్తున్న అడోబ్ డ్రీంవీవర్ సీయస్3 సాఫ్ట్ వేర్ లో తెలుగు పదాలు రావడం లేదు.అడోబ్ డ్రీంవీవర్ సీయస్3 లో తెలుగు రావాలంటే ఏం చేయాలి? ఎలాంటి సాఫ్ట్ వేర్ వాడాలి? తెలుపగలరు,.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

తెలుగులో వెబ్ సైట్లు తయారు
తెలుగులో వెబ్ సైట్లు తయారు చేయడానికి అను ఫాంట్లు ఉత్తమైన విధానం కాదు. మీరు యూనికోడ్ ఉపయోగించవచ్చు. e-తెలుగు సైటు యూనికోడ్ లోనే ఉంది. మీరు ఇక్కడ టైపు చేసినదాన్ని, డ్రీంవీవర్ లోనికి కాపీ చేస్తే, ఎలా కనిపిస్తుంది?
ఈ-తెలుగులో కొంచెం సమాచారాన్ని
ఈ-తెలుగులో కొంచెం సమాచారాన్ని మీరు చెప్పిన విదంగానే కాపి చేసి డ్రీంవీవర్ లో పేస్ట్ చేస్తే అచ్చ తెలుగులో పదాలు క్లియర్ గా వచ్చాయి. ఒక్క అక్షరం కూడ తప్పుగా రాలేదు, మరి నా కంప్యుటర్ లో తెలుగు ఎందుకు రావడం లేదు? తెలుగు కోసం ఎలాంటి యూనికోడ్ లను, సాఫ్ట్ వేర్ లను వాడాలి? వాటిని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? - శ్రీకాంత్.
మీకు వివరంగా ఈమెయిలు
మీకు వివరంగా ఈమెయిలు పంపించాను చూడండి.
నేను ఒకప్పుడు తెలుగు వెబ్
నేను ఒకప్పుడు తెలుగు వెబ్ సైట్ తయారు చెయ్యడానికి లేఖినిలో తెలుగు టైపింగ్ Open Suse జినోమ్ టెక్స్ట్ ఎడిటర్ లో పేస్ట్ చేసేవాడిని. కొత్తగా తెలుగులో వెబ్ సైట్ తయారు చేసేవాళ్లకి అదే సులభం.