తెలుగు రచయితలకు అవగాహనా సదస్సు (ఈ ఆదివారం, హైదరాబాదులో)

తెలుగు రచయితలకు ఆహ్వానం! కంప్యూటర్లలోనూ, జాలం లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి తెలుగు రచయితలకి e-తెలుగు ఒక అవగాహనా సదస్సుని నిర్వహిస్తూంది.

సమయం: ఆదివారం, మే 30, 2010 ఉదయం 10 నుంచి మద్యాహ్నం 1 వరకు
వేదిక: హనీపాట్ కెరీర్ క్యాంపస్, ఎ.సి. గార్డ్స్ బస్ స్టాప్ ఎదురు సందు, లక్డీ క పూల్, హైదరాబాద్ (పటం)

చర్చించే అంశాలు:

  1. అంతర్జాలంలో తెలుగు పత్రికలు, కథలు, కవితలు పంచుకోవడానికి ఉచితంగా లభ్యమవుతున్న వేదికల విశేషాలు.
  2. తెలుగులో డీటీపీ చేసుకునేందుకు సరళమైన, ఉచిత ఉపకరణాల పరిచయం.
  3. కంప్యూటర్లలో తెలుగు చదవడం, వ్రాయడం, ఉచితంగా బ్లాగులు తయారు చేసుకోవడం.
  4. ఈమెయిల్స్, సంభాషణలను తెలుగులో నిర్వహించుకోవడం.

రచయితలకి లాభాలు:

  • మీ పుస్తకాల్ని మీరే ప్రచారం చేసుకోవచ్చు.
  • పాఠకులతో నేరుగా సంభాషించవచ్చు.
  • సులభంగా మీ రచనలను ముద్రించుకోవచ్చు.
  • అవధుల్లేని సాహిత్య చర్చలు నిర్వహించుకోవచ్చు.

హాజరైన వారికి ఉచిత తెలుగు సాఫ్ట్‌వేర్లు కలిగిన సీడీ ఇవ్వబడును.

మరిన్ని వివరాలకు: 93965 33666.

may 25 na hyderabadlo

may 25 na hyderabadlo jarigina telugu  rachayitala avagahanaa sadassulo charchaneeyasaalu poorthiga teliyaalante ela? naati sadassu sameeksha eedayina undaa? dayachesi telupagalaru.

 విశేషాలు ఇక్కడ చదవండి.

 విశేషాలు ఇక్కడ చదవండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer