మే 2010, e-తెలుగు/బ్లాగర్ల సమావేశం విశేషాలు

సమావేశానికి హాజరైన వారు
1. వీవెన్ – వీవెనుడి టెక్కునిక్కులు
2. సుజాత – మనసులో మాట
3. సతీష్ యనమండ్ర – సనాతన భారతి
4. అరిపిరాల సత్యప్రసాద్ – జోకాభిరామాయణం
5. రవిచంద్ర – అంతర్వాహిని
6. ప్రవీణ్ – సాహిత్య అవలోకనం
7. కృపాల్ కశ్యప్ – కబుర్లు
8. శ్రీనివాస రాజు – శ్రీనివాసీయం
9. శ్రీనివాస కుమార్ – జీవితంలో కొత్తకోణం
10. ఎమ్మెస్ నాయుడు - ఎమ్మెస్ నాయుడు
11. శ్రీహర్ష – కిన్నెరసాని
ఇంకా ఔత్సాహికులు సాయిరాం (జ్యోతిష శాస్త్రజ్ఞులు), శ్రీకాంత్ పాల్గొన్నారు.
చర్చకు వచ్చిన అంశాలు:
• ముందుగా అరిపిరాల గారు, బ్లాగర్ల సమావేశం, e-తెలుగు సమావేశం మద్య నిర్దిష్టమైన విభజన రేఖ ఉండాలని సూచించారు. e-తెలుగు తరపున కథల పోటీ, అంతర్జాల అవధానం లాంటివి నిర్వహిస్తే సంస్థకు మరింత ప్రచారం చేకూరగలదని అభిప్రాయపడ్డారు.
• e-తెలుగు తరపున చేపట్టబోయే రచయితల వర్క్‌షాప్ ఈ నెల 30 వతేదీన నిర్వహించాలని నిర్ణయించాం. ఇందుకు సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటం జరిగింది. ప్రస్తుతం ఇందులో వీవెన్, కశ్యప్, సుజాత, అరిపిరాల సత్యప్రసాద్, రవిచంద్ర, తదితరులు సభ్యులుగా ఉన్నారు.
• ప్రస్తుతం అంతర్జాల మాద్యమంలో ఉన్న కొంత సాహిత్యం పత్రికల్లో వచ్చే సాహిత్యం కన్నా మంచి నాణ్యత కలిగి ఉండటం గమనించే ఉంటారు. వీటిని ముద్రణలోకి తీసుకెళ్ళేందుకు e-తెలుగు ఏమైనా చేయగలదా? అనే విషయం కూడా చర్చకు వచ్చింది.

ఈ-తెలుగు సమావేశాలు, వర్క్

ఈ-తెలుగు సమావేశాలు, వర్క్ షాప్ లు వైజాగ్ లో కూడా నిర్వహిద్దాం అని అక్కడ చెప్పాలనుకున్నాను. హైదరాబాద్ లో మీటింగ్ కి వచ్చినవాళ్ళే తక్కువ. వైజాగ్ లో ఎంత తక్కువ మంది వస్తారో అని డౌట్ వచ్చి చెప్పలేదు. అరిపిరాల గారు అన్నట్టు ఈ-తెలుగు యొక్క ఆబ్జెక్టివ్ గురించి స్పష్టంగా చెపితే ఈ-తెలుగులో ఎక్కువ మంది చేరుతారు.

priyamina etelugu site

priyamina etelugu site nirwahakulaku manavi.....ayya meru chala vaya prayasalu chesi , me samayanni antau venchinchi chala baga nirvahistunnaru.....kani samacharanni antayu meru acha telugu l0 e site lo militamu cheste baguntundi anedi n manavi......vudaharana work shop, meeting, objective ......e padamulu kuda meru telugu lo vudahariste baguntundi.....

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer