శ్రీ భగవంతుని ఏం కోరుకోవాలి?

సాధారణంగా సాధనలోనున్న భగవత్భక్తులు శ్రీ భగవంతుని అనేకానేకమైన కోరికలతో ప్రార్ధనలు చేస్తూంటారు. కాని పరమహంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయరు స్వామి వారు సాధకులకు అమోఘమైన ప్రవచనము చేస్తూ, "మీరు ఎల్లప్పుడూ స్వామినే కోరుకోండి. ఆ స్వామి కూడా ఏమిటి భక్తులందరూ, అష్టైశ్వర్యాలు, ఇంకా ఏవేవో కోరుకుంటారు, నన్నేవ్వరూ కోరుకోవటంలేదని, ఆశ్చర్యపోతూవుంటారుట." అని అన్నారు. కాబట్టి, మనమంతా మన మన ప్రార్ధనలలో, శ్రీ భగవంతుని , "స్వామి మాకు నువ్వే కావలి" అని ప్రార్ధిద్దాము." జై శ్రీమన్నారాయణ.

జాజి శర్మ గారూ, మీరు ఈ

జాజి శర్మ గారూ, మీరు ఈ విషయాలన్నీ మీ బ్లాగులో రాయండి. e-తెలుగు సైటు ప్రజల రచనలకి వేదిక కాదు.

చర్చావేదికలు అని శీర్షిక చూసి

చర్చావేదికలు అని శీర్షిక చూసి ఏవైనా చర్చించవచ్చుననుకొన్నాను. చర్చావేదిక ఉద్దేశ్యము మీరు శీర్షికలో వెల్లడిస్తే బాగుంటుంది. ఇదివరలో చర్చావేదికలో కొన్ని విషయాలు ఉదహరించాను. ఒకసారి కొత్తచర్చలు చూడగలరు. ఇలాంటి విషయాలకు కూడ మీరు కాస్తంత చోటిస్తేనే బాగుంటుందని నా అభిప్రాయము. మరో సూచన. సభ్యులు వ్రాసిన విషయాలు మీ అధికారికబృందం పరిశీలించిన తరువాతనే, ప్రచురణ యోగ్యత కల్పించాలి. ఇలా మేము వ్రాసినది అంతర్జాలస్థలము నేరుగా లోనికి రాకూడదు. మీ భావాలు గౌరవిస్తున్నాను. జాజిశర్మ.

శ్రిమద్భాగవతకర్త పోతనగారు

శ్రిమద్భాగవతకర్త పోతనగారు ఏనాడో భగవంతుని ఏమికోరుకోవలో తెలియజేసారు. ఇదిగో ఇలా కోరుకోవ్ఫాలి:

నీపాద కమలసేవయు
నీపాదార్చకుల తోడ నెయ్యమును,నితాం
తాపార భూతదయయును
తాపసమందార నాకు దయసేయ గదే !

శ్రీమద్భావగవతమును

శ్రీమద్భావగవతమును ఆంధ్రీకరించిన బమ్మెరపోతనామాత్యులు ఇలా సత్సంగమును కోరుకొమనుటలో కూడ ఉద్దేశ్యము అదే కదా! -- భవదీయుడు జాజిశర్మ.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer