వ్యక్తులు - చలోక్తులు

విజయవాడలో శ్రీనటరాజకళాసమితి అనే లలితకళాసంస్ఠ వుండేది(ఇప్పుడుకూడావుందేమో). చాలామంది న్యాయవాదులు,వైద్యులు,అందులో సభ్యులుగా వుండేవారు. న్యాయవాదులు, సినీకళాకారులైన కీ.శే.రామన్నపంతులు, కీ.శే.రామచంద్రకాశ్యప, మొదలైన ప్రముఖులు ఆ సంస్థలో సభ్యులుగా వుండేవారు. మాతండ్రిగారు కీ.శే.కీసర వెంకటరామనరసింహారావుగారు న్యాయవాది కావున ఆయనకు దానిలో సభ్యత్వం వుండేది. ప్రతి నెల ఒక నాటకమో, ఒక సంగీత కార్యక్రమమో, జరుగుతూవుండేవి. మాతండ్రిగారితో నేను ఆ కార్యక్రమాలకు వెడుతూవుండేవాడిని. కార్యక్రమాలకు ఒక ప్రముఖుని అహ్వనించేవారు. ఒకసారి కార్యక్రమానికి కీ.శే.భానుమతి గారు రావలసివుంది. కాని ఏకారణంచేతనో భానుమతిగారు రాలేకపోవటంతో సభానిర్వహకులు పట్టణంలోనే షూటింగు నిమిత్తమై వచ్చియున్న కీ.శే.గుమ్మడి వెంకటేశ్వరరావుగారిని ఆసభకు ఆహ్వనించారు. ఆ సభలో గుమ్మడిగారు ప్రసంగిస్తూ, "శ్రీమతి భానుమతి గారి స్థానాన్ని స్థూలంగానైనా,సూక్ష్మంగానైన భర్తిచేయటం చాల కష్టం " అనే సరికి సభ గోల్లుమంది.

ప్రముఖ సినీ నటులు

ప్రముఖ సినీ నటులు శ్రీకోటశ్రీనివాసరావు పూర్వాశ్రమములో భారతీయ స్టేట్ బ్యాంక్ లో పనిచేసేవారు. ఆరోజులలో నాటకరంగం, సినీరంగం మీద మమకారం చేత ప్రమోషను వద్దని, టెల్లరుగానే వుండిపోయారు. నారాయణగూడలోని శాఖలో ఆయనతో పనిచేసేవాడిని. ఆయన నిజజీవితంలో కూడ ఎంతో హస్యముగా మెలిగేవారు. (పెద్దవాడుకదాని ఇప్పుడు బహువచనం గాని, అప్పుడు "ఏరా" అనేగా సంభోధన). నేను అక్కౌంటెంటు గిరిలో వెలిగిపొయెవాడిని. ఆయన మద్యాహ్న్ం రెండున్నరకల్లా, నగదు హెడ్ కి అప్పచెప్పి రిహర్సల్సు గట్రా అని తుర్రుమంటువుండేవారు. నేను పలహారానానికని శ్రీ ల్.య్ స్.యన్. మూర్తి (మరో ప్రముఖ రచయిత,నటుడు, ల్.బి.శ్రీరామ్ సోదరుడు)తో, బయటకు వెడుతూవుంటే, బ్యాంకింగ్ హాలులో, ఓ నవయువకుడు, ఒక్కడే కూర్చునివుండటం గమనించాను. వ్యాపారవేళలయిపోవటంతో, "ఏందుకున్నావు" అని ప్రశ్నించాను. ఆ యువకుడు "కొత్తనోట్లు ఇంకా ఆరలేదాండి". అనడిగాడు. "కోత్తనోట్లేమిటి, ఆరడమేమిటి" అనడిగాను.
"ఆ టెల్లరుగారు కొత్తనోట్లు ఆరుతున్నాయి. కూర్చొమన్నారండి." అన్నాడు. అప్పుడు అర్ధమయ్యింది శ్రీకోటాగారి హాస్యం. ఈ కుర్రడు, శ్రీకోటావారిని, తనకి కొత్తనోట్లు కావాలని అడిగుంటాడు. ఆయన తన సహజ హాస్యధోరణిలో, "కొత్తనోట్లా, అరుతున్నాయి, కూర్చోమ్మా" అని ఆయన ఆ పేమెంట్ పెండింగులో పెట్టి తనమానాన తను వెళ్ళిపోయాడు. ఆ కుర్రడికి వున్నంతలో మంచి నోట్లిచ్చి, మేము శ్రీకోటా గారి సంగతి మర్నాడు చెప్తే, "ఈ కాలేజీ కుర్రాళ్ళకి బొత్తిగా బ్యాకింగ్ తెలియదురా" అని నోచ్చుకున్నాడు.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer