శ్రీవారిసేవామహభాగ్యము

ప్రియ భగవత్ భంధువుల్లారా!

తెలుగు భక్తి తరఫున ౩౮ మంది భక్తులు ది.౪ ఫిబ్రవరిన తిరుమలలోగల శ్రీవారిసేవాసదనములో ఉదయం ౯.౩౦ గంటలకు సమావేశమయ్యాము. శ్రీవారి సేవాసదనములోగల అధికారుల సూచనల మేరకు మా పత్రములను వారికి అందచేసి, వారిచ్చిన కండువాలు,దుప్పట్లు,చాపలు మొదలైనవి స్వేకరించి, లాకరులులలో మా వస్తువలను భద్రపరచుకొన్నాము. ఈలోగా శ్రీ గోపికృష్ణగారి ఆధ్వర్యంలో శ్రావ్యంగా సాముహిక శ్రీవిష్ణుసహస్రనామ సంకీర్తనము సాగినది. ఇది చూపరులెల్లరును ఆకట్టుకున్నది.
మేమంతా సామనులన్నీ సర్దుకునే సమయానికి, మా తదుపరి కార్యకమమును అధికారులు శ్రీజాజిశర్మగారికి అందచేశారు. దానిప్రకారము మా బృందము శ్రీవారి సేవాకార్యక్రమములో నిమగ్నమయ్యింది.
ఏఏ కార్యక్రమాలలో ఎవరు పాల్గొన్నారో శ్రీగోపికృష్ణగారు లోగడ వివరించారు. కావున ఆవివరాలు ఇక్కడ అప్రస్తుతము. దీనిలో ముఖ్యంగా సభ్యులు నాకు తెలియచేసిన వారి అనుభవాలు ప్రస్తావిస్తాను.

మూడవరోజున శ్రీస్వామివారి కళ్యాణసేవలో పాల్గొన్న సేవార్ధులు వారి సేవలు ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు వారి సేవలకు మెచ్చి, వారికి శ్రీవారి దర్శనభాగ్యము అధికారులు కలుగచేశారు. శ్రీవారి దర్శనము చేసుకొని తిరిగివస్తున్న బృందాన్ని, గర్భగుడిలో, శ్రీవారి సేవచేయమని అధికారులు కోరారు. అహో! వారి భాగ్యము ఏమని వర్ణించగలము! దాదాపు నాలుగు గంటలు శ్రీవారిని క్రీగంటచూస్తూ, భక్తులతోపాటు, గోవిందనామస్మ్రరణ చేస్తూ, శ్రీవారిసేవాభాగ్యము! ఆబృందము తరించినదినని చెప్పుట అతిశయొక్తికాదుగదా! ఈ బృందమునకు నాయకత్వము వహించిన శ్రీమతి నివేదిత గారు అభినందనీయులు.

adrustavanthulu

adrustavanthulu

naa laanti vaariki idi

naa laanti vaariki idi baagaanvundi . inkaa kaasta improv kaavaalsi vundi.english raani vaaru telugu lo vebsite kriyeat cheyaalantea english vaccina vaari sahaayam Tiasukovaalsi vustundi.
dhanyavaadaalu

e thelugu 

e thelugu  pravesapettinanduku kruthajnathalu kani denitho memu e vidhamga mails pampalo andc hatting chesukovalo kuda konacham vivarinchali

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer