ఏమి చేస్తే బాగుంటుంది?

నమస్కారం,

eతెలుగు సభ్యులందరికీ ఓ విన్నపం. క్రొత్తగా eతెలుగు సభ్యులైన వారందరికీ స్వాగతం. అలాగే సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ క్రొత్త సంవత్సరంలో eతెలుగు కార్యవర్గం ఏమి చేస్తే బాగుంటుందో అందరూ సూచించ గలరని మనవి. ఈ సంవత్సరంలో చాలా చేస్తే బాగుంటుందని eతెలుగు కార్యవర్గం తలచింది. వాటిల్లో ముఖ్యంగా ఉగాదిలోపుల రచయితలు మరియు కవులకు ఓ చిన్న సదస్సు నిర్వహిస్తే బాగుంటుందని ప్రయత్నం. 'ఎలా ఉంటుందో..' అన్న విషయాన్ని త్వరలో మీ ముందుచుతాము.

ఇవి కాకుండా, మరింకా ఏమైనా చేస్తే బాగుంటుందో తెలియ జేస్తారని ఆశిస్తున్నాను. ఏమో ఏ బుర్రలో ఏ ఆలోచన ఉందో ఎవ్వరికి ఎఱుక.

ఇట్లు
చక్రవర్తి