నమస్కారం
నిన్న కలిసిన వారందరికీ..
@ కోశాధికారి గారు.
చూశారా నేనెంత బుద్ధిమంతురాలినో..మీ మాట జవదాటలేదు !
ఇంటికి వచ్చీ రాగానే ఇ- తెలుగు తీర్ధం పుచుకొన్నాను!
మీ కుటుంబం లోకి అభిమానం గా ఆహ్వానించినందుకు అనేక ధన్యవాదాలు.
@వీవెన్ గారు
లేఖిని మాలో ఒకటి. మీ అందరి ఫోటో తీసుకు రానందుకు ఇంటికి రాగానే మా అమ్మాయి నుంచి ఒక మొట్టికాయ బహుమతి లభించింది..:-)
అవునండీ ,మేము మీ అభిమానులం.
@ సి.బి.రావు గారు, చదువరి,వరూధినీ, పూర్ణిమ,అరుణ,భవదీయుడు,కశ్యప్ గార్లు,
( నాకెందుకో బాగా మాట్లాడిన వారొకరి పేరు ఖచ్చితంగా మరిచానననిపిస్తుంది.మన్నించగలరు)
మీ అందరినీ కలవడం ఎంతో బావుంది.చాలా సంతోషం.
అన్నట్లు, మీ అందరి బ్లాగ్ వివరాలు నేను తీసుకొలేదు.
మీకు వీలున్నపుడు తెలియపరచగలరు.
మీరు ఇప్పటికే చాలా మంచి పనులు చేస్తున్నారు.ఇకపైనా ఇలాగే కొనసాగాలని కోరుకొంటూ..
స్నేహంతో..
చంద్రలత
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
