మీ విజయగాథని మాతో పంచుకోండి!

కంప్యూటర్లలోనూ మరియు జాలంలోనూ తెలుగు వచ్చిన తర్వాత మరియు దీని వల్ల మీకు చెప్పుకోదగ్గ విజయం లభించిందా? మీ విజయగాథని మేం వినాలనుకుంటున్నాం. రానున్న హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో పంచే కరపత్రాలలోనూ, సీడీలలోనూ ఈ విజయగాథలను చేర్చాలని మా ఆకాంక్ష. తద్వారా మరింత మందికి ప్రేరణ కల్గించాలనుకుంటున్నాం.

జాలంలో తెలుగు వల్ల మీకు మంచి స్నేహితులు దొరికారా, లేదా మీరు కొరుకుంటున్న సమాచారం మీ భాషలో అందుబాటులో ఉండటం వల్ల మీ ఆనందం, లేదా మీ తెలుగు బ్లాగు వల్ల మీ రచనా శైలి మెరుగయి మీకు మరిన్ని అవకాశాలు వచ్చాయా? ఇలా దేని గురించైనా, జాలంలో తెలుగు వల్ల మీకు సంతోషం, లాభం, లేదా విజయం లభిస్తే మాతో పంచుకోండి.

మీ స్పందనని ఇక్కడే వ్యాఖ్యలుగా రాయవచ్చు లేదా support [at] etelugu.or g చిరునామాకి "విజయగాథ" అన్న విషయంతో మెయిలుగానూ పంపవచ్చు లేదా మా సైటులోని సంప్రదింపు ఫారం ద్వారానూ పంపవచ్చు.

హై. పుస్తక ప్రదర్శన లో స్టాల్

హై. పుస్తక ప్రదర్శన లో స్టాల్ నెం ఎంత?

217 (స్టేజీ వెనకవైపు)

217 (స్టేజీ వెనకవైపు)

ఇప్పటిది కాదులే శరీర

ఇప్పటిది కాదులే
శరీర వాసన
జ్వలించి, జల్లించి, జాతరించి
పేనిన మమైకాన్ని తోడు
తోడు రాని
తోడ ...తొడ
శహన రాగపు రంగేది?
ఒడలిన ఒదిలిన
వయో స్వప్నాల్లో నువ్వెవరు?
ముకుళించే
రూపనాదాలన్నీ అలిఖితాలేనా?
కృశించే జన్మ క్రియలన్నీ
అలభ్య అజ్ఞాతాలేనా?
ఇప్పటిది కాదులే
వాక్య వ్యళీకం

రా ... వద్దు ఇష్టం లేని

రా ... వద్దు
ఇష్టం లేని వాక్యమే
ఈ సమాధి. అంతమవ్వని ఇష్టం.

తెగని గ్రీన్ గ్రీఫ్
శవపేటిక శ్వాసిస్తోంది మూడు ముళ్ళ బొడ్డుతో.

ఏ చిత్రం కిందో
అలుక్కుపోయిన అలలు.

ఆలోచించి చెప్పకు
కన్నీళ్ళు ఏమంటున్నాయో.

నేత్రంలో లేని అక్షరాల్తో
వస్తావా? రాకే.

రా ... వద్దు
పూర్ణాంతర శూన్యంలోకి.

ప్రతి మనిషి జీవితంలొ ఏదొ ఒక

ప్రతి మనిషి జీవితంలొ ఏదొ ఒక రోజు పెళ్ళి చేసుకొవలసిందే.ఏ మతాచారలొనైనా ఏ సంప్రదాయం లొ నైనా ఖచ్చితంగా మూడూ మాటలను పలికిస్తారు. ధర్మ,అర్థ,కామం,నందు ఇరువురం సమానంగా పంచుకుంటాం ఆని పలికిస్తారు.ధర్మ,అర్థ,కామంలతొ చెసెది సంసారం, ధర్మన్ని విస్మరించి చెసెది వ్యబిచారం, ధర్మ,అర్థలను విస్మరించి చెసెది ఆత్యచారం,

నా మోదటి తెలుగు ఈ మైలు నిన్న

నా మోదటి తెలుగు ఈ మైలు నిన్న విజయవాడ పుస్తక ప్రదర్సన ద్వారా కావడం సంతోషం గా ఉంది
పుస్తకాలు చదవడం వల్ల ఎన్నో విషయాలు తెలియడంతో పాటు మంచిని నేర్చుకోవడానికి ఉపకరిస్తాయి.

కాళేశ్వరరావు గారు, పుస్తక

కాళేశ్వరరావు గారు,

పుస్తక ప్రదర్శనలో చివ్వరి దాకా కూర్చుని శ్రద్దగా మా మాటలు ఆలకించి మమ్మల్ని మన్నించినందులకు మీకు ధన్యవాదములు.

మీకు ఎటువంటి అవసరమైనా మేము ఉన్నామని గుర్తుంచుకోగలరు

ఇ తెలుగు కార్యక్రమాలకు నా

ఇ తెలుగు కార్యక్రమాలకు నా సేవలు వినియోగించాలను కుంటున్నాను. దయచేసి తగిన మార్గం సూచించగలరు.

కాళేశ్వరరావు గారు, తప్పకుండా

కాళేశ్వరరావు గారు,

తప్పకుండా మీ సేవలు eతెలుగు వినియోగించుకుంటుంది. అంత వరకూ మీకు వీలైనంత తెలుగులో వ్రాయ ప్రయత్నించండి.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer