ఈ రోజు నేను, శిరీష్ కుమార్ గారూ హైదరాబాదు పుస్తకప్రదర్శన కమిటీ అద్యక్షులు శ్రీ శ్రీనివాసరావు గారిని మరియు కమిటీ సెక్రటరీ శ్రీ
హనుమంతరావు గారిని కలసి వచ్చే డిసంబరు నెల 17 నుండి 27 వరకు జరగబోయే 24 వ పుస్తక ప్రదర్శనలో గత ఏడాదిలాగే e-తెలుగుకి ఒక ష్టాలుని కేటాయించవలసిందిగా కోరాము. వారు దీనికి సానుకూలంగా స్పందించి అంగీకరించారు.
అలాగే పుస్తక ప్రదర్శన కాలంలో ఏదో ఒక రోజు రెండు గంటలవరకు కాలాన్ని తమ ప్రదర్శనశాలలో ప్రదర్శన నిమిత్తం e-తెలుగుకి కేటాయింటానికి అంగీకరించారు.
కనీసం 10,000 కరపత్రాలు ముద్రించి e-తెలుగు స్టాలు వద్ద పంచటానికి ఏర్పాట్లు సాగుతున్నాయి.
ఆశించినంతగా సభ్యత్వ నమోదు జరగలేదు. పుస్తక ప్రదర్శనలో ష్టాలునిర్వహణ, తరువాత -తెలుగు చెయ్యాల్సిన కార్యక్రమాలకు చాలావ్యయం అవుతుంది. అందుకు సభ్యులు, మరియు అభిమానులనుండి విరాలాలు సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రకటణ త్వరలో చెయ్యబడుతుంది.
స్టాలు నిర్వహణకు కావాల్సిన వాలంటీర్ల కొరకు ఇచ్చిన ప్రకటనకు కొంతమంది తెలుగు భాషాభిమానులు సానుకూలంగా స్పందించారు. ఇ-తెలుగు సభ్యులు ఈ విషయంలో చొరవ తీసుకొని మరింతమందిని నమోదు చెయ్యాలి.
పై విషయాలలో సభ్యుల సహాయ సహకారాలు కోరుతున్నాను.
- దూర్వాసుల పద్మనాభం
అద్యక్షుడు -తెలుగు
ఇటీవలి వ్యాఖ్యలు
2 రోజులు 10 గంటలు క్రితం
3 రోజులు 9 గంటలు క్రితం
4 రోజులు 9 గంటలు క్రితం
6 రోజులు 16 గంటలు క్రితం
1 వారం 17 గంటలు క్రితం
1 వారం 5 రోజులు క్రితం
2 వారాలు 10 గంటలు క్రితం
2 వారాలు 1 రోజు క్రితం
2 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 3 రోజులు క్రితం