మొదటి e-తెలుగు సర్వసభ్య సమావేశం నివేదిక

2009 అక్టోబరు 25 వ తేదీన మొదటి e-తెలుగు సర్వసభ్య సమావేశం జరిగింది.
హాజరైన వారు:

1. కృపాల్ కశ్యప్
2. ఉప్పల వెంకటరమణ
3. యనమండ్ర సతీష్ కుమార్
4. సి.బి.రావు
5. తుమ్మల శిరీష్ కుమార్
6. పి.వి.ఎస్.ఎస్. శ్రీహర్ష
7. డి.ఎస్.కె.చక్రవర్తి

మూడు గంటలకు సభ సమావేశమైనపుడు సరిపడినంత కోరం లేకపోవడం వలన వాయిదా పడి, పావుగంట తరువాత తిరిగి సమావేశమైంది.

అధ్యక్షుడు గత సంవత్సర కాలంలో చేసిన కార్యక్రమాల గురించి వివరించారు. తన నివేదికను ముద్రించి హాజరైన సభ్యులకు పంచారు. కోశాధికారి జమాఖర్చు వివరాలను ముద్రించి సభ్యులకు పంచారు.

తరువాత ఎన్నికలను నిర్వహించారు. ఎన్నుకోవలసిన పదవుల సంఖ్యకు సరిపడినంతమంది సభ్యులు అక్కడ లేకపోవడం చేత, ప్రత్యామ్నాయ మార్గం కొరకు సభ్యులు చర్చించి కిందివిధంగా నిర్ణయించారు.

* హాజరైన సభ్యుల్లో ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషను ఎంతమంది వేస్తారో చూడాలి.
* మిగిలిన స్థానాలను నింపడం కోసం హాజరు కాని సభ్యులకు ఫోను చేసి, ఎన్నికలో పాల్గొనేందుకు ఉత్సాహం ఉన్నదేమో కనుక్కోవాలి.
* వారు అందుకు అంగీకారం తెలిపితే వారి నామినేషన్ను స్వీకరించాలి.

ఈ పద్ధతిని సభ్యులు ఏకగ్రీవంగా ప్రతిపాదించగా ఎన్నికల అధికారి తుమ్మల శిరీష్ కుమార్ అంగీకరించారు. ఈ పద్ధతిని అనుసరించి కిందివిధంగా సభ్యుల ఎన్నిక జరిగింది.

హాజరైన సభ్యుల్లో నామినేషను వేసినవారు:

1. కృపాల్ కశ్యప్
2. సి.బి.రావు
3. యనమండ్ర సతీష్ కుమార్
4. డి.ఎస్.కె చక్రవర్తి

మిగిలిన నాలుగు స్థానాల కోసం సభ్యులకు ఫోను చేసి కార్యవర్గంలో చేరేందుకు వారికి సమ్మతమో కాదో అడిగాము. కింది సభ్యులు ఇందుకు స్వచ్ఛందంగా సమ్మతించారు.

1. వీర వెంకట చౌదరి
2. నామాల నాగమురళీధర్
3. కత్తి మహేష్ కుమార్
4. దూర్వాసుల పద్మనాభం

పై ఎనిమిది మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్యవర్గంలో చేరేందుకు అంగీకరించారు కాబట్టి వారి నామినేషన్లు స్వీకరించారు. ఎనిమిది స్థానాలకు గాను ఎనిమిది నామినేషనులు వచ్చాయి. అంచేత ఎనిమిది మందీ కూడా పోటీ లేకుండా ఎన్నికైనట్టుగా ప్రకటించారు.

కొత్త కార్యవర్గం వీలైనంత త్వరలో సమావేశమై పదాధికారులను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ సమావేశాన్ని నవంబరు 8 వ తేదీన (రెండో ఆదివారం) నాడు నిర్వహించాలని నిర్ణయించాము. ఆ సమావేశంలో కింది పనులు చేపడతాము.

1. పదాధికారుల ఎన్నిక
2. కొత్త కార్యవర్గానికి విరమణ చేస్తున్న అధ్యక్ష, కోశాధికారులు బాధ్యతల అప్పగింత. (బాధ్యతలను అప్పగించేందుకు విరమణ చేస్తున్న కార్యవర్గం సన్నద్ధమై వచ్చినప్పటికీ, ఆ పనిని కొత్త కార్యవర్గపు పదాధికారులను ఎన్నుకున్న తరువాతే చేద్దామని కొత్త సభ్యులు ప్రతిపాదించినందువలన పాత కార్యవర్గం అంగీకరించి, వాయిదా వెయ్యడమైనది)

------------------------------

ఈ ఎన్నికల తరువాత, కొత్త కార్యవర్గం ఏర్పడింది. ఇకపై పాత కార్యవర్గం ఆటోమాటిగ్గా రద్దైపోయినట్లే. అయితే, కొత్త కార్యవర్గం సమావేశమై, పదాధికారులను ఎన్నుకుని పాత కార్యవర్గం నుండి బాధ్యతలను స్వీకరించే లోపు ప్రస్తుత కార్యవర్గం తాత్కాలిక బాధ్యతలు నిర్వహిస్తుంది. ఈలోపు ఎటువంటి ఆర్థిక కార్యకలాపాలు జరుపదు. ఏ కొత్త ఒప్పందాలూ చేసుకోదు.

అధ్యక్షుడు
e-తెలుగు

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer