e-తెలుగు మొదటి సర్వసభ్య సమావేశం 2009 అక్టోబరు 25 న జరపాలని కార్యవర్గం నిర్ణయించింది. ఈ సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు కూడా ప్రతిపాదించబడింది. ఈ ఎన్నికలకు తుమ్మల శిరీష్ కుమార్ ను ఎన్నికల అధికారిగా నిర్ణయించారు. ఎన్నికల విధివిధానాలు ఇల ఉంటాయి.
- ఎన్నికల తేదీ: 2009 అక్టోబరు 25
- ఎన్నికల సమయం: మధ్యాహ్నం 3:45 గంటలకు
- నామినేషన్ల స్వీకరణ:
-
- ప్రారంభం: 2009 అక్టోబరు 25 మధ్యాహ్నం 3:00 కు
- ముగింపు: 2009 అక్టోబరు 25 మధ్యాహ్నం 3:30 కు
- సమావేశానికి హాజరైన సభ్యులు 8 మంది కార్యవర్గ సభ్యులను వోటింగు ద్వారా ఎన్నుకుంటారు. సభ్యుల ద్వారా ఎన్నుకోబడ్డ ఈ ఎనిమిదిమంది, సమావేశమై కింది పదవుల కోసం తగిన వ్యక్తులను తమలోనుండి ఎన్నుకుంటారు.
-
- అధ్యక్షుడు
- ఉపాధ్యక్షుడు
- కార్యదర్శి
- కోశాధికారి
- కార్యవర్గ సభ్యులు - 4 పోస్టులు
- కార్యవర్గానికి పోటిచేసే సభ్యులు హైదరాబాదు వాస్తవ్యులై ఉండాలి. సంస్థలో సభ్యత్వ రుసుము బకాయి లేకుండా ఉండాలి.
- సంస్థలో సభ్యత్వ రుసుము బకాయి లేనివారు వోటు వేసేందుకు అర్హులు. బకాయిలను సమావేశానికి ముందు చెల్లించి ఎన్నికలలో పాల్గొనవచ్చు.
- ఎన్నికల అధికారి: తుమ్మల శిరీష్ కుమార్
- 8 పదవులకోసం 8 కంటే ఎక్కువమంది నామినేషను వేసిన సందర్భంలో ఎన్నికలు జరుగుతాయి.
- 8 మందిగానీ, అంతకంటే తక్కువమంది నామినేషను వేసిన సందర్భంలో పోటీదారులంతా ఏకగ్రీవంగా ఎన్నికౌతారు.
ఇటీవలి వ్యాఖ్యలు
2 రోజులు 16 గంటలు క్రితం
3 రోజులు 16 గంటలు క్రితం
4 రోజులు 15 గంటలు క్రితం
6 రోజులు 22 గంటలు క్రితం
1 వారం 23 గంటలు క్రితం
1 వారం 5 రోజులు క్రితం
2 వారాలు 16 గంటలు క్రితం
2 వారాలు 1 రోజు క్రితం
2 వారాలు 2 రోజులు క్రితం
5 వారాలు 3 రోజులు క్రితం