తెలుగు వెలుగులు విరజిమ్మలంటే...

తెలుగును వైభవోపేతం చేయడానికి ఈ క్రింది సోపానాలు పాటించాలని నా
అభిప్రాయం

౧.ప్రాధమిక స్థాయి నుండే ప్రతీ పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేయాలి.

౨.వార్తా పత్రికలు మరియు ఇతర సమాచార మాధ్యమాలన్నీ తెలుగును సాధ్యమైనంత
వరకూ ప్రోత్సాహకరంగా వాడాలి.
౩.ప్రభుత్వం ఒక ప్రత్యేక భాషా సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రజల మధ్యకు వెళ్ళే
భాష తీరుతెన్నులను పర్యవేక్షిస్తూ భాషా ప్రాభవాన్ని పెంపొందించాలి,
అవసరమైతే పరాభవాన్ని నియంత్రించాలి.

౪.భాషా సంబంధిత కార్యక్రమాలు (అవధానాలు, వక్తుత్వ పోటీ, వ్యాస రచన,
కవితలు, భావ రచన మొదలైనవి) ప్రజాదరణ పొంది ఎల్ల కాలం నిర్వహింపబడేలా
చూడాలి.

౫.మనం చేసే సంతకం నుంచి వీధి , కొట్టు, కార్యాలయం, వాహనాలు ఇంకా అన్ని
ఇతర పేర్లు తెలుగులో గర్వంగా వ్రాసుకోవాలి.

గౌరవ సభ్యులు తమ తమ అభిప్రాయాలు తెలియెజేయగలరు...

౧.ప్రాధమిక

౧.ప్రాధమిక స్థాయి నుండే ప్రతీ పాఠశాలలో తెలుగును తప్పనిసరి చేయాలి.

మనమేంచేయగలం: ప్రభుత్వానికి, పార్టీలకు విన్నపాలు మరియు అభ్యర్థనలు

౨.వార్తా పత్రికలు మరియు ఇతర సమాచార మాధ్యమాలన్నీ తెలుగును సాధ్యమైనంత వరకూ ప్రోత్సాహకరంగా వాడాలి.

మనమేంచేయగలం: అవి మనమనుకున్నట్టు మారేవరకు, మన సూచనలు మరియు అభిప్రాయాలు వాటికి పంపుతుండడం

-వీ

మన

మన దురద్రుష్టం కొద్దీ ఏ రాజకీయ నాయకుడికి తెలుగు మీద సరైన గౌరవం లేదు. చాలా మందికి అత్మ గౌరవం లేదు, దూర ద్రుష్టి, సంఘటితం లేవు, మనం కనీసం వీటిని ప్రజలలోకి తీసుకెల్లాలి ముందు వారికి మనమంటే ఎమిటో మేలుకొలుపు చేయగలిగితే ఆ తర్వాత తెలుగు దానంతట అదే విరజిల్లుతుంది.

౧ - ఉందిగా,

౧ - ఉందిగా, ఇప్పుడు లేదా?
ఏప్పటి దాకా?

౨ - అలుపెరగని సైనికుడి లాగాన?
అనిల్

కందర్ప

కందర్ప కృష్ణమోహన్

అన్నింటికంటే ముందు మనలో చిన్నపిల్లలున్నవాళ్ళు, పిల్లల వాడుకలో తగిలిన ప్రతీ ఆంగ్లపదానికీ తెలుగు అర్థమేమిటో, అది నేర్చుకుని గుర్తుంచుకోవలసిన అవసరమేమిటో వారికి నచ్చజెప్పగలగాలి. ఆ ప్రక్రియలో మనం నిరుత్సాహపడకూడదు. పిల్లల్ని విసిగించనూకూడదు. మన వివరణలు వారిలో కుతూహలం పెంచేటట్లుగా ఉండాలి. వాళ్ళంతట వాళ్ళు అడిగి తెలుసుకునే స్థాయికి మనం వాళ్ళని తీసుకురాగలిగితే అది పెద్ద విజయమని నాకు నా ఐదేళ్ళ అమ్మాయి జయలక్ష్మి ద్వారా అనుభవమైంది.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer