ఆగష్టు 9 సమావేశం విషయాలు

నమస్కారం,
నేను హైద్రాబాదులో ఆగష్టు 9 సమావేశంలో పాల్గొనదలచుకున్నాను. తెలుగు వికీపీడియా అభివృద్ధి చేయడానికి జరుగుతున్న కార్యక్రమాలగురించి చర్చిద్దామనుకుంటున్నాను.
ముఖ్యంగా, తెలుగు వికీపీడియా గురించి ఎక్కువమందికి తెలపడం, వికీపిడియన్లుగా చేర్చడం , తెలుగు వ్యాసాల నాణ్యత మెరుగుపర్చడం గురించి. వీటి గురించి, మీ అభిప్రాయాలు, అభివృధ్ది నిరోధకాలు తెలియచేయండి.

ధన్యవాదాలు
అర్జున
బెంగుళూరు.
http://teluginux.blogspot.com/

నమస్కారం, ఇటీవలి e-తెలుగు

నమస్కారం,

ఇటీవలి e-తెలుగు సమావేశంలో వికీ గురించి చర్చించటానికి అవకాశం కల్పించినందులకు ధన్యవాదాలు. దీనిలో చర్చించిన ముఖ్యంశాలు. ( వీవెన్, రాకేష్ తో విడిగా అంతకు ముందు రోజులలో చర్చించాను.)
చాలా మంది బ్లాగరులు వున్నప్పటికి, క్రమం తప్పకుండా తెలుగు వికీపీడియాకు పని చేసేవారు తక్కువ.
ఇప్పటి వరకు జరిగిన e-తెలుగు కార్యక్రమాలలో, తెలుగు వికీ గురించి ప్రస్తావించడం జరుగుతుంది.
ఇక ముందు వికీపీడియా అకాడమీ కార్యక్రమము చేపట్టడానికి పాల్గొన్న సభ్యులు అంగీకారం తెలిపారు.
తెలుగు వికీ సమాచార సిడి తయారు చేసి వితరణ చేయటానికి అంగీకారం కుదిరింది.
అర్జున కిరుబా ఆధ్వర్యంలో వికీ అకాడమీ పనిని, నాడిగ్ ఆధ్వర్యంలో కన్నడ వికీ అకాడమీ పని, సంపద.నెట్ ద్వారా ప్రజోపయోగ విషయాలు, రైతు సమస్యలు, సమాచార హక్కు గురించి చేస్తున్నపని వివరించారు. అలాగే తెలుగు వికీ అకాడమీలో విద్య, ఉద్యోగం, వైద్యం లాంటి విషయాలపై కృషి చేయాలని సూచించాను.
వికీమీడియా ఇండియా చాప్టర్ ఏర్పడితే, ధన సహాయం తో ఇతర సాఫ్ట్వేర్ అభివృద్ధికి తోడ్పడవచ్చని తెలిపాను.

అర్జున

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer