జూలై 2009 హైదరాబాద్ సమావేశ విశేషాలు

జూలై 2009 హైదరాబాద్ సమావేశ విశేషాలు ఇవీ:

తెలుగు వికీపీడియాకి తోడ్పడటం
తెవికీలో ప్రస్తుతం ఉన్న గ్రామాలు మరియు ఊళ్ళకి సంబంధించిన వ్యాసాల్లో చాలా వరకు ఏకవాక్య వ్యాసాలే. వీటి నాణ్యతని మెరుగు పరచడానికి గానూ వికీపీడియన్ కాజా సుధాకర బాబు గారు ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేమిటంటే, తెవికీలో గ్రామాల ప్రాజెక్టుకి ఊతంగా వివిధ మండలాధికారులను ఉపాధ్యాయులను వారి వారి మండలాలు మరియు గ్రామాలకు సంబంధించిన సమాచారాన్ని తెవికీలో చేర్చమని ఆహ్వానించడం. ఒక వేళ వారికి జాల సంధానం లేకుంటే ఆ సమాచారాన్ని హైదరాబాదులో e-తెలుగు చిరునామాకి పంపించవచ్చు. అలా వచ్చిన సమాచారాన్ని ఔత్సాహికులు తెవికీలో చేరుస్తారు.

దీనికి అనుబంధంగా ఈ సలహాలు కూడా వచ్చాయి: (1) ఇదే ఆలోచనని బ్లాగుల్లో కూడా ప్రచారం చేయడం. (2) నవోదయ పాఠశాలల్లోని ఉపాద్యాయులకి విద్యార్థులకి కూడా (అక్కడైతే అనేక ప్రాంతాల నుండి వచ్చిన వారు ఉంటారు కనుక) ఈ సందేశం పంపిచడం.

ఈ ఆహ్వాన కరపత్రం మరియు ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తారు.

స్థానికీకరణ ప్రక్రియ
మీడియావికీ ప్రస్తుతం 92% అనువాదమైంది. ఇటీవలే విడుదలైన ఫైర్‌ఫాక్స్ 3.5 తెలుగులో కూడా లభ్యమవుతుంది. వీటిని ఉపయోగించేవారు వాటి అనువాదాలపై తమ స్పందనని తెలియజేయవచ్చు. మీ భాషలో గూగుల్ ద్వారా గూగుల్ మరియు జీమెయిల్ అనువాదాలని ప్రస్తుతం అనుమతించట్లేదు. అందువల్ల జీమెయిల్ అనువాదాల్లోని పలుకురాళ్ళని సవరించడం మనకి కుదరట్లేదు.

తెలుగు OCR
తెలుగు అక్షరాలని గుర్తించే OCRకై తెలుగు సంగణన గుంపులో కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి. వివిధ ఫాంట్లలో వివిధ తెలుగు అక్షరాలని స్కాన్ చేసి వాటిని OCR ఉపకరణానికి నేర్పాలి. ఇలాంటి కొన్ని అసాంకేతిక పనులలో తోడ్పడటానికి సమావేశానికి హాజరైన వారు సంసిద్థత వ్యక్తం చేసారు.

ఇతరత్రా
సుధాకర బాబు గారు మస్కట్ నుండి తీసుకొచ్చిన ఖర్జూరాలు ఈ సారి విశేషం. రఘునాధరాజు గారు మరియు వికీపీడియన్ రవిచంద్రలు మెదటిసారిగా ఈ నెల e-తెలుగు సమావేశాలకి వచ్చారు.

హాజరైనవారు:

  • పద్మనాభం
  • మహేష్ కుమార్
  • శిరీష్ కుమార్
  • సుధాకర బాబు
  • రవిచంద్ర
  • వీవెన్
  • రఘునాధ రాజు
  • శ్రీనివాసరాజు

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer