e-తెలుగు కార్యవర్గ సమావేశం, జూన్ 14, 2009
2009 జూన్ 14 నాడు జరిగిన e-తెలుగు కార్యవర్గంలోని సమావేశ విశేషాలు:
చర్చాంశాలు:
- గత మూణ్ణాలుగు నెలల పనుల సమీక్ష
- బ్యాంకు ఖాతా తెరవడం
- సంఘపు ఎన్నికలు
- e-తెలుగు సమావేశాల గురించి
- భవిష్యత్తు కలాపాలు
గత మూణ్ణాలుగు నెలల పనుల సమీక్ష
- దూరదర్శన్‌లో కార్యక్రమం చేసాం.
- ఈటీవీలో జాలంలో తెలుగువెలుగుల గురించి కార్యక్రమం ప్రసారమైంది.
- స్థానికీకరణల్లో శిరీష్ మరియు వీవెన్‌లు పాల్గొన్నారు.
- అనూ ఫాంట్ల నుండి యూనికోడ్ మార్పిడికి దాట్ల శ్రీనివాసరాజు ఒక పరికరం తయారుచేసారు.
బ్యాంకు ఖాతా తెరవడం
ఈ శుక్రవారం లోగా శిరీష్ మరియు పద్మనాభం కలిసి ఈ పని పూర్తి చేస్తారు. ఈ నెల చివరికల్లా అంతా పూర్తవుతుంది.
సంఘపు ఎన్నికలు
ముందుగా, సభ్యత్వ నమోదు కార్యక్రమం (కనీసం ఓ నెలపాటు) జరుగుతుంది. తర్వాత ఎన్నికల గురించి ప్రకటన, అభ్యర్థుల ప్రతిపాదనలు. విధానాలు ప్రకటిస్తారు.
ఆ ఎన్నికల్లో అధ్యక్షులు, సెక్రెటరీ మరియు కోశాధికారి పదవులకు స్థానికులే (ఆర్థిక వ్యవహారాలు, సంస్థాగత సౌకర్యం దృష్ట్యా) అయివుండాలని కార్యవర్గ సమావేశంలో అనుకున్నాం. దీనికై సర్వసభ్య సమావేశం కూడా నిర్వహిద్దామని అనుకున్నాం.
e-తెలుగు సమావేశాల గురించి
నెల నెలా e-తెలుగు ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాలకి ఓ వారం ముందు e-తెలుగు సైటునుండి అధికారిక ప్రకటన ఇవ్వాలి. ఈ సమావేశాల్లో చర్చాంశాలు కూడా e-తెలుగు ఆశయాల మేరకు మాత్రమే ఉంటాయి.
భవిష్యత్తు కలాపాలు
దీనిపై పెద్దగా ఏమీ చర్చించలేదు.
ఇతరత్రా
e-తెలుగు సైటులో ఉన్న చర్చావేదికని వేరేచోటికి తరలించాలి. e-తెలుగు సైటులోని విషయమంతా అధికారికంగానే ఉండాలని అనుకున్నాం.
హాజరైనవారు:
- తుమ్మల శిరీష్ కుమార్
- దాట్ల శ్రీనివాసరాజు
- వెంకట రమణ
- దూర్వాసుల పద్మనాభం
- వీవెన్
- కత్తి మహేష్ కుమార్
- కృపాల్ కశ్యప్
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి
