ఈ-తెలుగులో చేరాలంటే ఏమి చెయ్యాలి?

నాకు దీప్తి ధార బ్లాగ్ ద్వారా ఈ-తెలుగు గురించి తెలిసింది. ఈ-తెలుగు సమావేశాలు ఎక్కువగా హైదరాబాద్ లోనే జరుగుతున్నాయి. ఇలాగైతే దూర ప్రాంతాలలో ఇంటర్నెట్ లో తెలుగు వాడకం ప్రొమోట్ చెయ్యడం కష్టం. నేను ఉండేది శ్రీకాకుళంలో. ఇక్కడ నుంచి హైదరాబాద్ రైలు మార్గపు దూరం గరిష్ఠం 840 కిలో మీటర్లు. శ్రీకాకుళం, వైజాగ్, కాకినాడ లాంటి దూర ప్రాంతాలలో ఉండేవారు హైదరాబాద్ లో ఈ-తెలుగు సమావేశాలకి రాలేరు. దూర ప్రాంతాలలో ఉండేవాళ్ళు ఈ-తెలుగులో చేరాలంటే ఏమి చెయ్యాలి? తమ ప్రాంతంలో ఈ-తెలుగు శాఖ తెరవాలంటే ఏమి చెయ్యాలి? శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, తూర్పు గోదావరి జిల్లాలకి ఈ-తెలుగు శాఖ తెరిచి ఈ నాలుగు జిల్లాల శాఖకి వైజాగ్ ని హెడ్ క్వార్టర్ గా పెడితే బాగుంటుందనుకుంటున్నాను.

ప్రవీణ్ గారూ, e-తెలుగుపై మీ

ప్రవీణ్ గారూ,
e-తెలుగుపై మీ ఆసక్తికి నెనరులు. ఇతర ప్రాంతాల వారు హైదరాబాదు వచ్చి e-తెలుగు సమావేశాల్లో పాల్గొనాల్సిన అవసరం లేదు. ఎక్కడివారక్కడే సంఘ నిబంధనలకు లోబడి సమావేశాలను నిర్వహించుకోవచ్చు.

ప్రవేశ రుసుము (300 రూపాయలు), మొదటి సంవత్సరపు చందాు (200 రూపాయలు - మొత్తం 500 రూపాయలు) చెల్లించి e-తెలుగులో సభ్యులు కావచ్చు. సభ్యత్వ రుసుము ఏ ఖాతాకు పంపించాలో తెలియజేస్తాము.

ఇంకా వివరాలు కావాలంటే ఇక్కడ రాయండి. లేదా president@etelugu.org కి రాయండి.

నేను మే నెలలో చేరుతాను. ఈ

నేను మే నెలలో చేరుతాను. ఈ మధ్య నేను వ్యాపార పనుల్లో బిజీగా ఉన్నాను. కొన్ని రోజులు తరువాత తప్పకుండా చేరుతాను.

praveensklm యూజర్ యొక్క పాస్

praveensklm యూజర్ యొక్క పాస్ వర్డ్ మరచిపోయాను. అందుకే praveensarma అనే కొత్త యూజర్ రిజిస్టర్ చెయ్యాల్సివచ్చింది. మే నెలలో చేరాలనికున్నాను కానీ ఆలశ్యం అయినందుకు క్షమించాలి. మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ మెయిల్ చేస్తే అందులో డబ్బులు వెయ్యగలను. నా ఈ-మెయిల్ అడ్రెస్ praveen@pkmct.net

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer