నా పరిచయం
నా పేరు పులికొండ సుబ్బాచారి నేను ద్రావిడ విశ్వవిద్యలయం లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. అంతే కాదు జానపద, గిరిజన అధ్యయనశాఖకు హెడ్ గాను డీన్ ఆఫ్ అకడమిక్ ఎఫైర్స్ గాను పని చేస్తున్నాను. నేను కంప్యూటర్ లో తెలుగు వాడకాన్ని దాదాపు పది హేను సంవత్సరాలుగా చేస్తున్నాను. చాలా రకాల తెలుగు సాఫ్ట్ వేర్ లు ఉపయెగించాను. దాదాపు పద్నాలుగు సంవత్సరాలనుండి తెలుగును చేత్తో రాయడం మర్చిపోయాను. నా పుస్తకాలు వ్యాసాలు అన్నీ తెలుగులోనివి ఇంగ్లీషులోనివి అన్నీ కంప్యూటర్ లోనే చేశాను.
తెలుగు వ్యాపకం ఇంత విస్తృతంగా అంతర్జాలంలో జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంతర్జాలం అంటే ఇంటర్నెట్ అని అర్థం. నేను చాలా కంప్యూటర్ పరిభాషను తెలుగులోనికి అనువదించాను. కంప్యూటర్ శాస్త్రాన్ని తెలుగులో ఎందుకు బోధించకూడదు అనే దిశగా పని చేస్తున్నాను. కంప్యూటర్ ను తెలుగులో సంగణకం అని అనవచ్చు. త్వరలో ఒక తెలుగు బ్లాగును కూడా తయారు చేయాలని ఆలోచిస్తున్నాను. తర్వాత ఈ బ్లాగును ఎలా అందరికీ తెలిసేలా చేయాలో అందరినీ అడిగి తెలసుకుంటాను. మిగతా వివరాలు తర్వాత రాస్తాను. వివిధ విషయాలపై వ్యాసాలు కూడా రాస్తాను.
ప్రస్తుతానికి ఇక్కడ పనికి వచ్చే సమాచారం ఇస్తున్నాను. మా విశ్వవిద్యాలయంలో మార్చి 3 వ తేదీన గ్లోబలైజేషన్ వల్ల భారతీయ భాషలకు వచ్చిన నష్టం ఏమిటి అలాగే లాభం ఏమిటి అనే అంశం పైన ఒక చర్చా సదస్సు నిర్వహిస్తున్నాము. ఆసక్తి ఉన్నవాళ్ళు దీనిలో పాల్గొనవచ్చు. లేదా మీ అభిప్రాయాలను నా ద్వారా తెలుపవచ్చు. ప్రస్తుతానికి సెలవు.
సుబ్బాచారి.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

నా పేరు రత్నేశ్వరరావు , నేను
నా పేరు రత్నేశ్వరరావు , నేను వృక్ష శాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం.
తెలుగు లో మీరు సైటును నిర్వహించడం చాలా ఆనందంగా వుంది.
ధన్యవాదములు మీరు హైదరాబాదులో
ధన్యవాదములు
మీరు హైదరాబాదులో ఉంటే ప్రతీ నెల రెండవ ఆదివారం జరిగే e-తెలుగు సమావేశంలో పాల్గొనవచ్చు