theuscats.org ను తెలుగులో నిర్మించడం

మితృలారా,

The United States Capital Area Telugu Society (http://theuscats.org) అనేది ఇక్కడి ఉత్సాహంగా వున్న ఏడాది తెలుగు సంస్థ. ఇంకా ఇక్కడ ఒక పురాతన తెలుగు వాళ్ళ సంఘము (http://gwtcs.org) కూడా వుంది. ఈ మధ్య ఒకసారి వీళ్ళకు (thesuscats.org) తెలుగు వెర్షన్ కూడా వుంటే బాగుంటుంది కదా అని ఈమెయిల్ పంపించాను. వెను వెంటనే ఈ సంఘపు చైర్మను చిత్తరంజను గారు ఆసక్తి వ్యక్తం చేస్తూ ప్రత్యుత్తరం ఇచ్చారు. వాళ్ళ ఇతర కార్యవర్గ సభ్యులతో వచ్చే ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు.

ఇంతకీ ఇప్పుడు నేను చెప్పదల్చుకున్నదీ/అడగదల్చుకున్నదీ ఏమంటే... నేనక్కడికి తెలుగు బ్లాగరులు/e-తెలుగు వారి తరపున వెళుతున్నాను. నాక్కావలిసిన సామాగ్రిని సమకూర్చమని ప్రార్థన.

ప్రస్తుతం నేను చేయదల్చుకున్నది:
1) యూనికోడ్లో తెలుగు యొక్క అవసరం.
2) తెలుగును చదవడానికి/రాయడానికి గల ప్రతిభందకాలు ఏవైనా వుంటే వాటిని పరిష్కరించడం. సహాయం eతెలుగులో గానీ తెలుగు బ్లాగరుల గుంపులో గానీ దొరుకుతుందని చెప్పడం.
3) తెలుగులో వున్న బ్లాగులు మరియు కూడలి/తేనెగూడు/జల్లెడ/తెలుగుబ్లాగర్స్‌లను పరిచయం చెయ్యడం.
4) తెలుగులో బ్లాగు ఎలా మొదలెట్టాలో చెప్పడం.
5) తెలుగు వికీ గురించి వివరించడం.

ఆ మద్య తానాలో చూపించుటకని తయారు చేసిన PPT వుండాలి ఎక్కడుందో కనిపించటం లేదు. దయచేసి ఇదియునూ ఇంకా నేనేమయినా మరిచిపోయుంటే దయచేసి నాకు మీ సూచనలు సలహాలూ ఇవ్వగలరు. power point slides గానీ లేక ఏ ఇతర కరపత్రాలు గానీ దయచేసి నాకు పంపగలరు లేదా ఎక్కడ వున్నాయో సూచించగలరు.

ఈ సంఘపు అంతర్జాలాన్ని సమర్థవంతంగా తెలుగులోకి మనం మార్చితే ఆ అనుభవంతో మనం మరిన్ని తెలుగు సంఘాల పని పట్టవచ్చు.

--ప్రసాద్
http://blog.charasala.com

అమెరికా

అమెరికా రాజధాని ప్రాంతీయ తెలుగు సంఘం వారితో జరిగిన సమావేశ వివరాలకు నా బ్లాగు (http://www.charasala.com/blog/?p=191) చూడగలరు.

--ప్రసాద్
http://blog.charasala.com

అనువాదాలు

అనువాదాలు ఇక్కడ చేయవచ్చు: http://wiki.etelugu.org/TheUSCats
-వీ