ఫిబ్రవరి నెల e-తెలుగు సమావేశ వివరాలు

ఫిబ్రవరి నెల e-తెలుగు సమావేశం 8వ తేదీ ఆదివారం యూసఫ్‌గుడా లోని కృష్ణకాంత్ పార్కులో జరిగింది.
సమావేశానికి వచ్చినవారు:
1. తుమ్మల శిరీష్ కుమార్
2. తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం
3. గుళ్ళపూడి శ్రీనివాసకుమార్
4. నామాల నాగ మురళీధర్
5. భార్గవ రామ
6. దాట్ల శ్రీనివాసరాజు
7. కృపాల్ కశ్యప్
8. దూర్వాసుల పద్మనాభం
9. కత్తి మహేష్ కుమార్
10. యనమండ్ర సతీష్ కుమార్
11. వీవెన్
12. పప్పు అరుణ
13. అట్లూరి అనిల్
14. నందం నరేష్
15. సి.హెచ్. మనోహర్
16. శివ ప్రసాద్
ఈ సమావేశానికి వచ్చిన కొత్తవారు
మనోహర్ గారు. వీరు మ్యూజింగ్స్ బ్లాగరి.
నరేష్ గారు HMTVలో పనిచేస్తున్నారు. వీరు అంతర్వాహిని బ్లాగరి
శివ ప్రసాద్ గారు ఒక ప్రముఖ బయోటెక్ కంపనీలో సీనియర్ ఎక్జిక్యుటివ్ గా పనిచేస్తున్నారు.


చర్చించిన విషయాలు:
సభ్యత్వ నమోదు గురించి చర్చ జరిగింది. త్వరలో బ్యాంక్ అకౌంట్ తెరచిన వెంటనే ఒక సభ్యత్వ నమోదు ఉద్యమం మొదలుపెట్టడం జరుగుతుంది. e-తెలుగు నిబంధనావళి ప్రకారం సభ్యత్వ రుసుము చెల్లించి సభ్యులుగా చేరవచ్చు. రుసుము చెల్లించి సభ్యులైనవారు వార్షికక సమావేశంలో, కార్యవర్గ ఎన్నికల్లో పాల్గొని తమ వోటుహక్కు వినియోగించుకోవచ్చు. కార్యవర్గానికి ఎన్నిక కావచ్చు. అయితే e-తెలుగు కార్యకలాపాలలో పాల్గొనటానికి, నెలవారీ సమీక్షా సమావేశాలకు వచ్చి తమ సలహాలు అందించటానికి, సాంకేతిక సహాయం పొందటానికి, సహాయం చెయ్యడానికి రుసుము చెల్లించి సభ్యులు కావాలన్న నిబంధన లేదు.

e-తెలుగు తరఫున కార్యక్రమాలు జరపాలనుకొనేవారు, ఆయా కార్యక్రమాల వివరాలను e-తెలుగు కార్యనిర్వాహక సమితికి పంపిస్తే అందుకు అవసరమైన ప్రచార సామాగ్రిని, ఇతర సహాయాన్ని e-తెలుగు అందిస్తుంది.

అంతరాలంలో తెలుగు కంటెంటు వ్యాప్తిని ప్రోత్సహించడం, అందుకవసరమైన ప్రచారం చెయ్యడం e-తెలుగు కార్యక్రమాల్లో ప్రధానమైనది. వాటిలో బ్లాగులను ప్రోత్సహించటం కూడా ఒకటి. బ్లాగు ప్రక్రియను వ్యాప్తి చెయ్యడమే తప్ప, వాటిని క్రమబద్ధీకరించడం లేదా వాటిపై ఆధిపత్యం చెలాయించటం e-తెలుగు కార్యక్రమాల్లో లేదు.

తెలుగు బ్లాగుల చరిత్రని భద్రపరచే ప్రక్రియలో భాగంగా, బ్లాగులను సంగ్రహించి, ఒక భాండాగారం తయారు చెయ్యాలని తాడేపల్లి బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రస్తావన చేసారు. దీనిలోని సాధక బాధకాలపై చర్చ జరిగింది. మూతపడిపోతున్న బ్లాగులను ఈ విధంగా నిక్షిప్త పరచవచ్చన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే ఇందులోని కాపీహక్కుల పరమైన ఇబ్బందులను పరిశీలించి, e-తెలుగు నిర్ణయం తీసుకుంటుంది.

ఇదే సమావేశంలో HMTV చానలు వారు అంతర్జాలంలో e-తెలుగు కార్యకర్తలతో ఇంటర్వ్యూ చేసారు. ఆ తరువాత ఐ-న్యూస్ వారు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు.

మనోహర్ గారి బ్లాగు

మనోహర్ గారి బ్లాగు న్యూజింగ్స్.
ఇతర కొత్త బ్లాగరులని ఇలా పరిచయం చేసేప్పుడు వారి బ్లాగు ఎడ్రసు కూడా ఇస్తే ఉపయోగంగా ఉంటుంది.
రెండో విషయం .. ఒక స్వఛ్ఛంద సంస్థగా నడుస్తున్నారు గావున, ఈ సమావేశాలకి హాజరయ్యే వారు సంస్థలో సభ్యులా కాదా, సభ్యులు కాని వారు ఏ మేరకు క్రియాశీలక చర్చల్లో పాల్గొనవచ్చు, సంస్థయొక్క కార్యాచరణ నిర్ణయాల్లో ఎటువంటీ భాగం తీసుకుంటున్నారు, ఇటువంటివి మీకు మీరే (కార్య నిర్వాహక వర్గం) తీర్మానించుకుని, ఒక పద్ధతి ప్రకారం consistent గా చేస్తే మంచిది. ఉదాహరణకి నేను సంస్థ సభ్యుణ్ణి కాను. ఏదో హైదరాబాదు పక్కనించి ప్రయాణీస్తూ సమావేశం జరుగుతోందని తెల్సి హాజరయ్యా ననుకోండి. నేనేమో సమావేశాల్లో నోరుమూసుకుని కూర్చునే రకం కాదు. అలాగని నే చెప్పే మాటలో సూచనలో మీ సంస్థ కార్యాచరణ ప్రణాలికని పక్కదారి పట్టించ కూడదు కదా.

కొత్తపాళీ గారూ, మీరు చెప్పిన

కొత్తపాళీ గారూ,
మీరు చెప్పిన విషయాలపైన e-తెలుగు కార్యనిర్వాహక సంఘంలో సమగ్రమైన్ చర్చి ఇంతకముందు జరిగింది.
ప్రతినెల జరిగే సమావేశాలకు ఎవరైనా రావచ్చు. చర్చలలో పాల్గొనవచ్చు. వారి సూచనలను కార్యనిర్వాహక సంఘం తప్పక పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ఋసుము చెల్లించి సభ్యులుగా నమోదైన వారుమాత్రమే కార్యనిర్వాహక సభ్యులు కాగలరు.
నెలవారీ సమావేశాలు జరపటంలో ఉద్దేశం e-తెలుగు కార్యకలాపాలు అభిమానులందరికీ తెలియచెయ్యటం, క్రొత్తవారిలో ఉత్సాహం నింపటం, విచ్చేసినవారి సూచనలు, సలహాలు తీసుకోవటం.
బ్లాగులు e-తెలుగులో ఒక భాగమేకాని బ్లాగులే e-తెలుగు లక్ష్యం కాదు.
కొత్తవారి బ్లాగు గురించి సమావేస వివరాలలో వ్రాయబడుతూనే ఉంది. పూర్తి బ్లాగు చిరునామా ఇవ్వటంలో ఇబ్బంది లేదు.

- దూర్వాసుల పద్మనాభం

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer