నా అభిప్రాయం మరియు ఉపాయం
పెద్దలకి, పిన్నలకు నా నమస్కారములు, సవినయంగా నా నమస్సుమాంజులలు మీ అందరికి సమర్పించుకుంటు ముందుగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఆదర్శశీలురు తుమ్మల శిరీష్ కుమార్ (అధ్యక్షుడు): 98662 36956 మరియు దాట్ల శ్రీనివాసరాజు (సంయుక్త కార్యదర్శి) - 99082 18201 నా హ్రిదయపూర్వక ధన్యవాదములు.
నా దిశా నిర్దేశం గమ్యం ఒకటే, ఏనాటికి తెలుగు మాతృభాషా స్థాయిని విస్తరించాలని కోరుకుంటు, నా అభిప్రాయాలను తెలియపరచాలనుకుంటున్నాను
(గమనికా) నావి కేవలం అబిప్రాయాలు మాత్రమే తప్పొప్పులున్న తెలియచేయగలరని నా విన్నపం.
1. సభ్యుల వివరములను సమావేశములోనే కాకుండ మన ఈ ఫోరము వేయగలరని నా సూచన. ఈ
2. దయ చేసి గాత్రధారణ ఉంచినట్టైతే ఈ సభులందరికి ఎంతో ఉపయోగకరమైనదిగా ఉంటుంది.
3. అందరికి నేరు గా రాగలిగిన సౌకర్యం ఉండొచ్చు, ఉండకపోవఛ్ఛు, కాబట్టి సభ్యులకు ఈ -చాట్ వంటి సహకారం అందించగలరని నా అభ్యర్థన.
ధన్యవాదములు
మీలో ఒకడిని.
శివ సూర్య కార్తికేయ.
- వ్యాఖ్యానించడానికి లోనికి ప్రవేశించండి లేదా సభ్యులుకండి

తెలుగు భాష భాష తియ్యదనాన్ని
తెలుగు భాష భాష తియ్యదనాన్ని అందరికీ పంచిన చక్కని వెబ్ సైట్ eతెలుగు
అయితే తెలుగువారైన ప్రతిఒక్కరు తెలుగు తెలిసిన ప్రతివారు ఉపయోగించుకునే విధంగా వెబ్ సైట్ ను రూపొందించాలి ఎక్కువగా కంప్యుటర్ ఉపయోగించే వారి అవసరాన్ని ,అవకాశాన్ని ,ఆనందాన్ని ,మంచి అభిరుచిని కూడా పెంపొందించేలా వెబ్ సైట్స్ రూపొందించాలి భాషా అంశాలు పారిభాషికపదాలు మరీ అనువాద పూరితం కాకుండా భావ స్ఫురణ కలిగేలా ఉపయోగ సౌలభ్యంతోఉండాలి
ముఖ్యంగా తెలుగు భాషను ఆధునిక కాలంలో సుసంపన్నం చేయాలంటే తప్పని సరి మీడియా ప్రచారం చాలా అవసరం.మంచి తెలుగు వెబ్ లింకుల పరిచయం ఆకర్షణీయంగా చేయాలి .వెబ్ సైట్ ల వినియోగాన్ని ,ఉపయోగాన్ని పత్రికల్లో చక్కని వ్యాసాల ద్వారా పరిచయం చేయాలి
కాకినాడ లో వున్న
కాకినాడ లో వున్న తెలుగుబ్లాగర్లందరిని ఒక వేదిక మీదకు తీసుకురావలని ఆశగా వుంది. మీరేమంటారు?