ఐ-న్యూస్ కోసం e-తెలుగు కార్యక్రమం

జనవరి నెల 25న కొత్తగా వచ్చిన వార్తా ఛానల్ ఐ-న్యూస్ వారు e-తెలుగు పై, వాటి కార్యకలాపాలపై ఒక కార్యక్రమాన్ని జరపదలచి e-తెలుగును సంప్రదించారు. ఈ మధ్య అనేక వార్తా పత్రికలలో e-తెలుగు కార్యకలాపాలపై వ్యాసాలు వచ్చినా, ఐ-న్యూస్ ద్వారా అనేక మందికి e-తెలుగు కార్యక్రమాలను పరిచయం చేయగలిగే అవకాశం రావటం శుభసూచకం.

సమయం చాలా తక్కువగా వుండటం వలన, కార్యక్రమం ఇంటిలో చేయడంతో స్థలాభావం వలన కేవలం అందుబాటులో వున్న e-తెలుగు సభ్యులను అప్పటికప్పుడు హడావిడిగా పిలవడం జరిగింది.

అనుకున్న సమయానికి కాస్త అటూ ఇటూగా సభ్యులందరూ మధ్యాహ్నం చదువరి గారి ఇంటికి చేరుకున్నారు. ఐ-న్యూస్ వారితో పరిచయాలు అయిన తరువాత షూటింగ్ మొదలయింది.

ఈ-తెలుగు అధ్యక్షులు శిరీష్ గారు e-తెలుగు ఎప్పుడు ఎలా స్థాపించారో, దాని ఆశయాలు ఏమిటో, ఇప్పటివరకు చేసిన మరియు రాబోయే కాలంలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు.

నల్లమోత శ్రీధర్ గారు కంప్యూటర్‍లో తెలుగును ఎలా స్థాపించాలో, ఎలా రాయాలో వివరంగా చెప్పారు.

దాట్ల శ్రీనివాసరాజు తెలుగు వికీపీడియా గురించి, అందులో ఎన్ని వ్యాసాలు వున్నాయో, ఎంతమంది సభ్యులు వున్నారో, తెలుగు వికీలో ఎలా రాయాలో చెప్పడం జరిగింది.

వీవెన్ గారు బ్లాగుల సంకలిని అయిన కూడలి గురించి, బ్లాగుల గురించి వివరించారు.

యనమండ్ర సతీష్ గారు వెబ్ పత్రికలయిన ఈ-మాట, పొద్దు, ప్రజాకళ, భూమిక, నవతరంగం గురించి వాటి సామాజిక, సాహిత్య విలువల గురించి వివరించారు.

గుళ్ళపూడి శ్రీనివాసకుమార్ గారు బ్లాగులలోని టపాలకు వచ్చే స్పందనలు ప్రచార మాధ్యమాలకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయో, యూనికోడ్ వల్ల ఉపయొగాలను తెలియజేసారు.

ఉప్పల వెంకటరమణ గారు ఈ-తెలుగు కార్యక్రమాలకు అయ్యే ఖర్చు సభ్యులే భరిస్తున్నారని, సాంకేతిక సహాయాన్ని ఉచితంగా అందిస్తున్నారని చెప్పారు.

నామాల నాగమురళి గారు స్థానికీకరణ గురించి, అందుబాటులో వున్న సాఫ్ట్ వేర్‍ని తెనుగీకరించడం గురించి చెప్పి షూటింగ్ కార్యక్రమాన్ని ముగించారు.

మురళి గారి కూడా వచ్చిన మిత్రుడు తారక్ ఈ కార్యక్రమ నిర్వహణలో సహకరించారు.

ఐ-న్యూస్ వారు వెళ్ళిన తరువాత మన ప్రచార సామగ్రిని మెరుగుపరచే అంశం మీద చాలాసేపు చర్చించాము. ఈ చర్చ జరుగుతున్న సమయంలో e-తెలుగు గురించి తెలుసుకున్న కార్తీక్ గారు ఫోన్ చేసి తననూ e-తెలుగు కార్యక్రమాలలో భాగస్తుడిని చెయ్యమని అడిగారు.

గమనిక: ఈ కార్యక్రమం ఇటీవలే ప్రసారమయ్యిందని తెలిసింది.

hello sir, this is

hello sir,
this is rajasekhar.vempati, i have seen e-telugu on i-tv today itself,
so, what i need is, what i have to do for this organization,
First of all i have to introduce myself, I'm a M.C.A. graduate,
i worked for a company at vizag, i'm not satisfied with that job,
now i'm looking for the better opportunity ,
meanwhile i want to do something, can you tel me is there any help i can do for this organization.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer