నిష్పూచీ

అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసేందుకు అవసరమైన ప్రచార కార్యక్రమాలు ఉచితంగా చెయ్యడం, ఉచితంగా సాంకేతిక సహాయం అందించడం e-తెలుగు లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో భాగంగా అవసరమైన కార్యక్రమాలను సంఘం చేపడుతుంది. అంతర్జాలంలోగానీ, బయటగానీ e-తెలుగు అధికారికంగా చేపట్టే కార్యక్రమాల గురించిన పూర్తి వివరాలు ఈ వెబ్‌సైటులో ఉంటాయి.

e-తెలుగు ఏ విధమైన సాఫ్టువేరు ఉత్పత్తులను గాని, ఇతర ఉత్పత్తులనుగానీ విక్రయించదు, విక్రయించడంలో సహకరించదు. సంఘం అందించే ఉత్పత్తులన్నిటినీ ఉచితంగానే అందజేస్తుంది. e-తెలుగు పేరిట ఏ వ్యక్తి, వ్యక్తులు, లేదా సంస్థలు చేసే క్రయ విక్రయాలతో సంఘానికి సంబంధం లేదు. అట్టి క్రయవిక్రయాలకు e-తెలుగు బాధ్యత వహించదు.

e-తెలుగు చిహ్నం e-తెలుగు కాపీహక్కులలో భాగం. president@etelugu.org నుండి వ్రాతపూర్వకమైన అనుమతి లేకుండా e-తెలుగు చిహ్నాన్ని అంతర్జాలంలోగానీ, బయటగానీ, సాఫ్టువేరు ఉత్పత్తులు, లేక ఇతర ఉత్పత్తులపై ముద్రించడం లేదా ఇతర విధాలుగా వాడటం చట్టవిరుద్ధం. అటువంటి చర్యలు సంఘం దృష్టికి వచ్చినపుడు, బాధ్యులపై e-తెలుగు చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది.

e-తెలుగుకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ etelugu.org డొమెయినులోని ఈమెయిళ్ళ ద్వారానే జరుపుతుంది. ఇతర పబ్లిక్ లేదా ప్రైవేటు డొమెయిన్ల లోని ఈమెయిలు ఐడీల ద్వారా జరపదు.

కాపీహక్కులు, పూచీకత్తులు, అందుకు సంబంధించిన అధికారిక సమాచారం కోసం president@etelugu.org ను మాత్రమే సంప్రదించాలి.

e-తెలుగుకు సంబంధం లేని విషయాల గురించిన పాక్షిక జాబితా కోసం సందేహాలు పేజీ చూడండి

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer