జనవరి నెల (2009) e-తెలుగు సమావేశపు నివేదిక

జనవరి నెల సమావేశము రెండవ ఆదివారమైన 11వ తేదీన జరిగింది. గత నెలగా e-తెలుగు సంఘం చేసిన కార్యక్రమాల వలన ఈ సమావేశానికి కొత్తవారు వచ్చారు. వీరు - మంచిపుస్తకం ముద్రణా సంస్థ నిర్వాహకులు కొసరాజు సురేశ్ గారు, భాగ్యలక్ష్మి గారు, లండనులో ఉంటున్న తెలుగు బ్లాగరి నాగమురళి గారు, విశ్రాంత ఉద్యోగి నాగేశ్వరరావు గారు, గిరి ప్రసాద్, శాంతి కుమార్ గారు.

సమావేశానికి వచ్చినవారి వివరాలు

1. ఎస్. శాంతి కుమార్
2. శ్రీనివాస కుమార్ (జీవితంలో కొత్త కోణం)
3. కత్తి మహేష్ కుమార్
4. వెంకట రమణ
5. భాగ్యలక్ష్మి (మంచి పుస్తకం)
6. కొసరాజు సురేష్ (మంచి పుస్తకం)
7. దూర్వాసుల పద్మనాభం
8. తుమ్మల శిరీష్ కుమార్
9. వీవెన్
10. నాగేశ్వర రావు
11. నాగ మురళి (ప్రత్యేక అతిథి)
12. కమల్ చక్రవర్తి
13. గిరి ప్రసాద్
14. దాట్ల శ్రీనివాసరాజు

అంతకు ముందు జరిగిన e-తెలుగు కార్యనిర్యాహక సభుల సమావేశ వివరాలు అద్యక్షులు శిరీష్ కుమార్ గారు తెలిపారు. అవి:

1. అంతర్జాలంలో తెలుగు గురించి వివిధ ప్రాంతాల్లో, ప్రదేశాల్లో ప్రచార కార్యక్రమాలను నిర్వహించేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న కార్యకర్తలు సరిపోరని, అందుకుగాను ఆసక్తి కలిగిన సభ్యులతో కార్యకర్తల జట్టులను తయారుచెయ్యాలి.
2. ముందు ఈ కార్యకర్తలందరికీ తగు శిక్షణ ఇవ్వాలి, తద్వారా ఈ కార్యక్రమాలన్నిటిలోను ఒక ఏకరూపతను సాధించవచ్చు. లేని పక్షంలో ఒక్కొక్కరు ఒక్కోరకంగా నిర్వహించే అవకాశం ఉంది.
3.అలాగే ఇప్పుడున్న వీడియోలు మొదలైన ప్రజెంటేషను సామాగ్రి ముఖ్యంగా పుస్తకప్రదర్శనలో ప్రదర్శించటానికి ఉన్న కొద్దిపాటి సమయంలో చెయ్యబడింది. దీనిని తాజాకరించి తయారుచెయ్యాలి.
4. e-తెలుగు అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికే పరిమితం కావాలి . అవసరమైతే, ఒక సంవత్సరం తరువాత, ఈ విధానాన్ని సమీక్షించాలి
5 ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం వద్దకు తీసుకువెళ్ళాలి., అధికారభాషా సంఘం అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాదు గారిని కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చెయ్యాలి. ఈ పనికి అవసరమైన సాంకేతిక సహాయాన్ని ఉచితంగా అందించవచ్చు.
6. సంఘంలోకి సభ్యులను చేర్పించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చెయ్యాలి. బ్యాంకు ఖాతాను నాలుగైదు రోజుల్లో తెరచి, వెంటనే సభ్యత్వాలను స్వీకరించాలి. సభ్యత్వ రుసుము ఇప్పుడు ఉన్నట్లుగానే ప్రవేశరుసుము 300 రూపాయలు (మొదటిసారి), వార్షిక రుసుము 200 రూపాయలు (ఏడాదికి) ఉంటుంది.

వీటితో పాటు చర్చించిన విషయాలు

e-తెలుగు చిహ్నాలున్న చొక్కాలు స్టిక్కర్లు చేయించాలని, రుసుము చెల్లించి సభ్యత్వము తీసుకున్న వారికి ఒక చొక్కా ఇస్తే బాగుంటుంది అనుకున్నాము. చక్రవర్తి గారు తెలుగు బ్లాగులకు ఉచిత టెంప్లేటులను (మూస/రూపులను) అందించడానికి http://telugutemplates.com అన్న సైటుని మొదలుపెట్టినట్టు చెప్పారు. దీనికి అందరూ సహాయపడవలసినదిగా కోరారు. తమ తమ బ్లాగు టెంప్లేటు కోడుని, వారి వద్ద ఉన్న ఉచితంగా పంపిణీ చెయ్యదగిన ఛాయాచిత్రాలను ఉంటే పంచవలసినదిగా అడిగారు.

జోడింపుకొలత
Jan2009-BM-1.jpg77.53 కిబై
Jan2009-BM-2.jpg88.8 కిబై
Jan2009-BM-4.jpg105.39 కిబై
IMG_0282.jpg97.4 కిబై

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer