e-తెలుగు ప్రచార సామాగ్రి
అంతర్జాలంలో తెలుగును వ్యాపింపజేసే పనిలో భాగంగా e-తెలుగు కొన్ని ప్రచార సామాగ్రిని తయారుచేస్తూ ఉంటుంది. ఈ సామాగ్రిని ఇక్కడ చూడవచ్చు 2006 లో "కంప్యూటరుకు తెలుగు నేర్పడం ఎందుకు, ఎలా?" అనే పుస్తకాన్ని రచించి, ప్రచురించింది. అప్పటికి అధికారికంగా సంఘం నమోదు జరగనప్పటికీ, e-తెలుగు కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ పుస్తకంలో మూడు ప్రధాన విభాగాలుంటాయి. మొదటి విభాగంలో వికీపీడియా గురించి వివరించారు. రెండవ విభాగంలో బ్లాగుల గురించి వివరించారు. మూడవ విభాగంలో కంప్యూటరులో తెలుగు చూడటం ఎలా, తెలుగులో రాయడం ఎలా అనే అంశాలను చర్చించారు. ఈ పుస్తకాన్ని ఇక్కడి నుండి దించుకోవచ్చు. 2008 డిసెంబరులో హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు స్టాలు నిర్వహించింది. అప్పుడు ప్రచారం కోసం కొన్ని బ్యానర్లు, కరపత్రాలను ప్రచురించింది.
| జోడింపు | కొలత |
|---|---|
| కంప్యూటర్లో_తెలుగు_కరపత్రం_15Dec2008.doc | 16.3 కిబై |
| etelugu-logo896x256.png | 31.07 కిబై |
| etelugu-logo448x128.png | 14.61 కిబై |
| telugubaata-logo3672x1053.png | 201.14 కిబై |
| telugubaata-logo1024x294.png | 51.36 కిబై |
| logo1792x512.png | 66.54 కిబై |
| telugubaata-2011-invite.png | 132.43 కిబై |
