vemana padyamulu

అన్నదానమునకు నధిక సంపదగల్గి
యమర లోక పూజ్యుడ గను మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయ
విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యం: అన్ని దానాలలోకి అన్నదానం గొప్పది. ఆ దానాన్ని మించిన దానం లేదు. అన్నదానం చేస్తే దేవలోక పూజలు అందుకుంటాడు. అన్నం పరబ్రహ్మ స్వరూపం.