ఈ నెల 7వ తేదీన "మంచి పుస్తకం" బుక్ ట్రస్ట్త్రస్టీలలో ఒకరైన శ్రీ సురేష్ గారి కోరికమేరకు తార్నాకాలోని వారి కార్యాలయం లోని కాన్ఫరెన్స్ హాలులో e-తెలుగు ఒక ప్రదర్శన ఇచ్చింది. దీనిలో నల్లమోతు శ్రీధర్ గారితో పాటు నేనూ పాల్గొన్నాను. చక్కని పుస్తకాలను తెలుగులో పిల్లలకు చేరువలోకి తీసుకురావటం కోసం 'మంచి పుస్తకం' బుక్ ట్రస్ట్ గత ఎనిమిది సంవత్సరాలుగా కృషి చేస్తూ ఉంది.
ప్రదర్సనలో భాగంగా కంప్యూటరులో తెలుగుని స్థాపించడం, తెలుగు వ్రాయటానికి అందుబాటులో ఉన్న లేఖిని, బరాహా వంటి పరికరాలను వాడే విధానం, తెలుగులో బ్లాగులను సృష్టించడం- వీటన్నిటి గురించీ వీడియో ద్వారా చెప్పడం జరిగింది. అక్కడ దగ్గరగా ఉన్న NGOల నుండి కూడా 20 మంది దాకా వచ్చేరు. ప్రదర్శన తరువాత సభికుల ప్రశ్నలకు సమాధానాలియ్యటం జరిగింది. శ్రిధర్ గారు అక్కడికక్కడే ఒకరిద్దరి లాప్ టాప్ లలో తెలుగు వ్యవస్థాపించి "బరాహా" ఇన్ స్టాల్ చేశారు కూడా. ఇంకొక విశేషమేమిటంటే సురేష్ గారు అక్కడే, శ్రిధర్ గారి సహకారంతో తమ బ్లాగు
http://manchipustakam.blogspot.com ని సృష్టించారు.
వచ్చినవారిలో చాలామంది తమ బ్లాగులను త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు.
ఇటువంటి ప్రదర్శనలు e-తెలుగు లక్ష్యసాధనలో ఎంతగానో తోడ్పడుతాయి
- దూర్వాసుల పద్మనాభం
వ్యాఖ్యలు
చాలా సంతోషం. ఈ సురేష్ గారు
చాలా సంతోషం. ఈ సురేష్ గారు చాన్నాళ్ళు క్రితం నాకు కొద్దిగా పరిచయం. అప్పట్లో సమాజ సేవలు, గ్రామోద్ధరణ కార్యక్రమాలు చేస్తున్న అనేక NGOలని కలుస్తూ వీరిని కూడా కలిశాను. ఆటుపై ఇద్ద్రికీ ఉన్న తెలుగు సాహిత్య ఆసక్తితో కొంత సేపు ముచ్చటించుకున్నాను. ఒక సారి ్హైదరాబాదు బుక్ ఫెయిర్లోనే వాళ్ళు ఒక పిల్లల పుస్తక ప్రచురణ మొదలు పెట్టారని తెలిసి చాలా సంతోషించాను. వారంతా ఇలా ఈ-తెలుగు పరిచయస్తులవడం ముదావహం.
సురేష్ గారు ఈ రోజు e-తెలుగు
సురేష్ గారు ఈ రోజు e-తెలుగు సమావేశానికి వచ్చి, రుసుము చెల్లించి సంఘ సభ్యత్వం తీసుకున్నారు.