విజయవాడ 20 వ పుస్తక ప్రదర్శనలో ‘e-తెలుగు’ సందడి

విజయవాడలో జరిగే పుస్తక ప్రదర్శనలలో నాలుగో రోజుకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ రోజున పుస్తకప్రియులు నగరంలో పాదయాత్ర నిర్వహిస్తారు. పుస్తక పఠనం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజెప్పడం దాని లక్ష్యం. 2009 జనవరి 4 న జరిగిన పాదయాత్రలో ‘e-తెలుగు’ కూడా పాల్గొంది. ఆ రోజున ప్రదర్శనలోని ప్రతిభావేదికపై ప్రదర్శన కూడా ఇచ్చింది.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

విజయవాడ కార్యక్రమానికి ఏర్పాట్లు నవ్వులాట శ్రీకాంత్ మరియు ఇతర మిత్రులు చేసారు. తగినంతమంది సేవకులు లేకపోవడం చేత, హైదరాబాదు ప్రదర్శనలోలాగా విజయవాడలో కూడా స్టాలు తీసుకుందామనే ఆలోచనను పక్కనబెట్టాం. జనవరి 4న సాయంత్రం 7,8 గంటల మధ్య ప్రదర్శన ఇచ్చేందుకు అనుమతి సంపాదించాం. అదే రోజున సాయంత్రం జరిగే ఊరేగింపులో పాలుపంచుకోవాలని కూడా అనుకున్నాం.

జనవరి 4 న పొద్దున్నే హైదరాబాదు నుండి ఆరుగురం కారులో బయలుదేరి మధ్యహ్నం ఒంటిగంటకు విజయవాడ చేరుకున్నారు. వారు శ్రీకాంత్ గారి ఇంట్లో కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాక, ఆకాశవాణి కేంద్రంలో ఒక గంటపాటు e-తెలుగు కార్యక్రమాలపై గోష్ఠిలో పాల్గొన్నాం. ఆ తరువాత, పుస్తక పఠనాన్ని ప్రజల్లో వ్యాపింపజేసే ఉద్దేశంతో నిర్వహించిన వాక్ ఫర్ బుక్ అనే పాదయాత్రలో e-తెలుగు బ్యానర్లతో పాల్గొన్నాం. ఈ పాదయాత్ర ప్రెస్‌క్లబ్బు నుండి పుస్తక ప్రదర్శన స్థలం వరకు జరిగింది. e-తెలుగు సభ్యులకు ఇదో చక్కని అనుభవం.

సాయంత్రం 5 గంటలకు ప్రదర్శన స్థలానికి చేరుకున్నాం. అక్కడికి ఇతర e-తెలుగు సభ్యులు కూడా కొందరు కలిసారు. అక్కదే ఇస్లామిక్ పుస్తకాల స్టాలు వాళ్ళనడిగి రెండు టేబుళ్ళు సంపాదించి వాళ్ళ స్టాలు ముందే తాత్కాలిక స్టాలును ఏర్పాటు చేసి, బ్యానర్లు కట్టి కాస్సేపు కరపత్రాలను పంచాం. 6:45 ప్రాంతంలో స్టాలును మూసేసి, e-తెలుగు ప్రదర్శన ఇవ్వబోయే ప్రతిభావేదిక వద్దకు చేరుకున్నాం. 7:15 కు ప్రదర్శన మొదలుపెట్టాం. విజయవాడ ఆకాశవాణి కేద్రం సంచాలకులు మంగళగిరి ఆదిత్య ప్రసాదు గారు ఈ ప్రదర్శనకు అధ్యక్షత వహించి e-తెలుగును ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఆ తరువాత 45 నిముషాల పాటు వీడియోలు ప్రసంగాలతో కూడిన e-తెలుగు ప్రదర్శనను నిర్వహించాం.

  • ప్రదర్శన తరువాత, దాదాపొక ఒక గంటపాటు వేదిక వద్దనే ఉండి సందర్శకులతో మాట్లాడి వాళ్ళ సందేహాలను తీర్చాం. విజయవాడలో సందర్శకుల స్పందన బాగానే ఉంది. ఆసక్తిగా విన్నారు. ప్రదర్శన తరువాత వేదిక వద్దకు వచ్చి తమ సందేహాలను తీర్చుకున్నారు.
  • ఒక బ్యాంకు ఉద్యోగి చాలా ఆనందంగా కనిపించారు. నేనేదో పుస్తకాలు కొనుక్కుందామని వచ్చాను. కంప్యూటర్లో కూడా తెలుగు ఉంటుందని ఇక్కడికొచ్చాక తెలిసింది. ఇవ్వాళ రావడం మంచిదైంది అని అన్నారు.
  • ఎనభయ్యారేళ్ళ ఎమ్.వి.సుబ్బారావు గారు కూడా ప్రదర్శనను ఆసక్తిగా చూసారు. ఆ తరువాత వారిని పరిచయం చేసుకున్నాం. బాగా చేస్తున్నారని అభినందించారు. వారు 'కొత్తపాళీ' గారి మామగారని తెలిసి సంతోషించాం.
  • డా.కేశవరెడ్డి, డా.జి.సమరం, డా.ఇండ్ల రామసుబ్బారెడ్డి వంటి పెద్దలను కలిసి e-తెలుగు గురించి వివరించాం.
  • సాయిసతీష్ అనే స్థానిక విద్యార్థి ప్రదర్శన వద్ద e-తెలుగు గురించి తెలుసుకొని, వెంటనే కార్యకర్తగా మారిపోయారు. కరపత్రాలు పంచుతూ, సందర్శకుల ఈమెయిలైడీలు సేకరిస్తూ చురుగ్గా పాల్గొన్నారు.
  • వీడియోలే కాకుండా మరింత ఇంటరాక్టివ్‌గా ఉండే ప్రజెంటేషను కూడా రూపొందించాలని ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు సతీష్ సూచించారు.
  • విజయవాడ కళాశాలల్లో విద్యార్థుల కోసం ప్రదర్శన నిర్వహించాల్సిందిగా ఆయన కోరారు. అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని కూడా చెప్పారు.

--------------------------------------------

ఈ ప్రదర్శనను నిర్వహించేందుకు హైదరాబాద్ నుండి చావా కిరణ్ కుమార్, దాట్ల శ్రీనివాసరాజు, నామాల నాగమురళీధర్, యనమండ్ర సతీష్ కుమార్, పప్పు అరుణ, తుమ్మల శిరీష్ కుమార్ వెళ్ళారు. విజయవాడలో ఉండే 'జాగృతి' శివరామప్రసాదు, బందరు నుండి శ్రీనివాస్ కర, హైదరాబాదువాసి 'జీవితంలో కొత్తకోణం' శ్రీనివాసకుమార్ కూడా e-తెలుగు ప్రదర్శనలో పాలుపంచుకున్నారు. గుంటూరు నుండి గీతాచార్య అనుకోకుండా పుస్తక ప్రదర్శనకు రావడం, అక్కడ e-తెలుగును చూసి ఆశ్చర్యపోవడం జరిగాయి.

ఇతర నివేదికల కోసం చూడండి:
జాగృతి
మురళీగానం
యువకుడు

నివేదిక చూశాక పుస్తక

నివేదిక చూశాక పుస్తక ప్రదర్శనలోనే మన ఆత్మీయులందరి మధ్యా ఉన్నట్లనిపించింది. చాలా బాగుంది.

జెమినీ న్యూస్‌లో గురువారం

జెమినీ న్యూస్‌లో గురువారం వార్త కూడా ప్రసారమైంది.

ఇ తెలుగు వారికి నుతన సంవత్సర

ఇ తెలుగు వారికి నుతన సంవత్సర శుభాకాంక్షలు. మీ లక్ష్యం చాల బాగుంది. ఆంతర్జాలం లొ తెలుగు వినియోగం వ్యాప్తి చెయలనే లక్ష్యం కొసం నేను కూడ క్రుషి చేస్తా

శ్రీధర్ గారు, మీకు కూడా నూతన

శ్రీధర్ గారు,

మీకు కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

నేను కూడా విజయవాడ పుస్తక

నేను కూడా విజయవాడ పుస్తక ప్రదర్శన లో ఇ తెలుగు గూర్చి తెలుసుకుని సభ్యుని గా చేరాను. తెలుగు అభివృద్ధికి ఇ తెలుగు ద్వారా జరుగుతున్న కృషికి అబినందనా లు

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer