తెలుగులో 7-జిప్

7-జిప్ అనేది ఓపెన్ సోర్స్ ఫైల్ ఆర్కైవింగ్ ప్రోగ్రామ్. మీరు దీన్ని జిప్ ఫైళ్ళు తయారుచేసుకోవడానికి మరియు వాటినుండి ఫైళ్ళను వెలికితీయడానికి వాడుకోవచ్చు. దీని ఇంటర్ఫేసు ఇప్పుడు తెలుగులో కూడా లభ్యం.

ఉదాహరణకు ఈ తెరచాప చూడండి:
తెలుగులో 7-జిప్

దీన్ని మీ కంప్యూటర్లో వాడుకోడానికి, ఈ అంచెలు అనుసరించండి:

  1. (మీ కలనయంత్రంలో ఈసరికే లేకపోతే) 7-జిప్ని దిగుమతి చేసుకొని, వ్యవస్థాపితం చేసుకోండి.
  2. ఈ జిప్ ఫైలులోనుండి భాషా ఫైలు te.txtని వెలికితీసి 7-జిప్ ప్రోగ్రామ్ ఫోల్డర్లో ఉన్న Lang ఫోల్డర్లోకి కాపీ చేయండి.
  3. ఇప్పుడు 7-జిప్ తెరచి Tools > Options లో Language అనే టాబులో "Telugu (తెలుగు)" అని ఎంచుకొని OK పై నొక్కండి
  4. తర్వాత 7-జిప్‌ని పునఃప్రారంభించండి.

తెలుగులో 7-జిప్ పై మరిన్ని వివరాలకు మరియు సందేహ నివృత్తికి 7-జిప్ స్థానికీకరణ చర్చావేదికలో అడగండి. ఇంకా అనువాదం కాని పదాలకు తెలుగు పదాలను ఇక్కడ సూచించండి.

జోడింపుకొలత
తెలుగులో 7-జిప్ తెరచాప27.4 కిబై
7-zip-te.zip4.16 కిబై

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer