e-తెలుగు భవిష్యత్తు కార్యక్రమం

హై.లో జరిగిన పుస్తక ప్రదర్శనలో e-తెలుగు చేసిన ప్రచార కార్యక్రమానికి సందర్శకుల స్పందనను గమనిస్తే మన ప్రయత్నం సఫలమైనట్టేననిపిస్తోంది. కంప్యూటర్లో తెలుగు చదవొచ్చు, రాయొచ్చూ నని కొత్తగా తెలుసుకొన్నవారు కొందరైతే ఇప్పటికే ఏదో ఒక రకంగా తెలుగును వాడుతూ, అందులో ఎదురౌతున్న ఇబ్బందులకు సంబంధించి సహాయం పొందినవారు కొందరు. రోమను లిపిలో టైపు చేస్తే, తెలుగులోకి లిప్యంతరీకరణ జరిగిపోతుందని తెలుసుకున్నవారు మరి కొందరు. ఇంతమందికి ఎంతో కొంత కొత్త సమాచారాన్ని చెప్పామన్న తృప్తి మనకు కలిగింది. ఈ కార్యక్రమ నివేదికను చూడండి.

మొత్తమ్మీద అంతర్జాలంలో తెలుగుకు కొంత గుర్తింపు తీసుకురావడంలో మన ప్రయత్నం ఫలించిందని చెప్పవచ్చు. ఇప్పుడీ ఊపును కొనసాగించవలసిన అవసరం ఉంది.

ఇక్కడ ఈ చర్చలో అందరూ చురుగ్గా పాల్గొని, మన తదుపరి కార్యక్రమాన్ని నిశ్చయించుకునే క్రమంలో మీ అభిప్రాయాలు చెప్పమని కోరుతున్నాను.

pustaka prdarsanalo e-telugu

pustaka prdarsanalo e-telugu pracharam bagundi. naku alage parichayamaindi. kani ikkada telugulo type cheyavachu anukunte elago teliyatam ledu. english lone type avutondi

నరేంద్రకుమార్ గారూ మీకు ఈ

నరేంద్రకుమార్ గారూ
మీకు ఈ తెలుగు పేజీలు సరిగా కనబడుతున్నాయని భావిస్తా. పోతే మీరు ఇక్కడ తెలుగులో టైపు చెయ్యాలంటే
1. http://lekhini.org లోనికి పోయి అక్కడ phonetic Englishలో తెలుగు టైపు చేసి దానిని కాపీ చేసి ఇక్కడ
అతికించండి. లేదా ఇంకొక సులభ పధ్ధతి
2. http://www.baraha.com/BarahaIME.htm అనే సైటుకి పోయి అక్కడ baraha..ime ని డౌన్ లోడ్ చేసుకొని మీ కంపుటరులో స్తాపించండి. సరువాత దానిని క్లిక్ చేస్తే అది మీ కంప్యూటరు taskbar లోకి వస్తుంది. అందులో మీరు తెలుగు TE ని ఎన్నుకొని ఎక్కడైనా మీరు phonetic Englishలో టైపు చెయ్యవచ్చును.
- పద్మనాభం దూర్వాసుల

జనవరి 11 ఆదివారం నాడు హై.లో

జనవరి 11 ఆదివారం నాడు హై.లో జరుగనున్న e-తెలుగు సమావేశానికి వచ్చి అక్కడ ఈ విషయమ్మీద జరిగే చర్చలో పాల్గొనవలసినదిగా హై.లో ఉన్న సభ్యులందరికీ విజ్ఞప్తి. ఇప్పటికే వివిధ సందర్భాల్లో సభ్యుల నుండి వచ్చిన సూచనలు కొన్ని:

1. కళాశాలల్లో కుర్రాళ్ళకు అంతర్జాలంలో తెలుగును పరిచయం చెయ్యడం.
2. పేపర్ల వాళ్ళకు తమ వెబ్‌సైట్లను యూనికోడులోకి మార్చుకొమ్మని చెప్పడం
3. ప్రభుత్వ వెబ్‌సైట్లను తెలుగులోకి అనువదించేలా వత్తిడి తేవడం.
4. పై రెండు పనులకు అవసరమైన "సాంకేతిక సహాయం" ఉచితంగా చెయ్యడం
5. తెలుగు ఉపాధ్యాయులకు, రచయితలూ రచయిత్రులకు, పాత్రికేయులకు కంప్యూటర్లో తెలుగు గురించి చెప్పడం

కంప్యూటర్లో తెలుగు గురించే కాక, బయట కూడా తెలుగు గురించి ప్రచారం చెయ్యడం:
1. రాజకీయ పార్టీల ఎన్నికల మానిఫెస్టోలలో తెలుగుకు ప్రాముఖ్యతనిచ్చే అంశం చేర్పించడం
2. పై పని కోసం వివిధ రాజకీయ పార్టీలను కలవడం

పైన సూచించిన కొన్ని పనుల కోసం కొందరు సభ్యులు పని చేస్తూ ఉన్నారు. ఉదాహరణకు నల్లమోతు శ్రీధర్, తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం, అనిల్ అట్లూరి ఇప్పటికే అధికారభాషాసంఘ అధ్యక్షుడు ఎ.బి.కె.ప్రసాదు గారిని కలిసారు. రాజకీయ పార్టీలను కలిసే విషయమై యోగి కొంత పని చేస్తున్నారు. సభ్యులు తమ తమ అభిప్రాయాలను ఇక్కడ రాయవలసినది.

e-తెలుగు భవిష్యత్తు ప్రణాళికల

e-తెలుగు భవిష్యత్తు ప్రణాళికల విషయంలో నా ఆలోచనలు చెప్తాను. ఇందులో అన్నీ మన ప్రతిపాదనల్లో ఉన్నవే.
ముందుగా మనకి ఒక చిహ్నం,నినాదం,విధానం కావాలి.
1.ఎందుకంటే కొన్ని కోట్లమందిని స్వాతంత్రోద్యమంలో కలిపి నడిపినది వందేమాతరం అనే నినాదం. మనం ఉద్యమాలు చేయకపోయినా మనలోస్ఫూర్తిని నింపుతుంది.
2.అనేక దేశాలలో ఉన్న బహుళజాతీయ సంస్థల్లో ఉన్న ఉద్యోగుల్ని ఐకమత్యంతో నడిపేది సంస్థ చిహ్నం. కాబట్టి మనమంతా ఒక్కటే అని గర్వంగా ప్రదర్శించుకోవటానికి ఒక చిహ్నం ఉంటే బాగుంటుంది.
3. ఇక మనకంటూ ఒక విధానం నిర్దేశించుకోకపోతే ఏకాభిప్రాయం లేక నిర్మాణాత్మకంగా పనిచేయలేము. మన ప్రచారం వలన సభ్యులు పెరిగి మనతో కలిసిపనిచేయటానికి ముందుకు వస్తే వారిని సంఘటితపరిచి ముందుకు నడపాలంటే క్రియాశీలకంగా వారిని వినియోగించుకోవాలంటే e-తెలుగు స్టాండ్ ఎంటో ఖచ్చితంగా నిర్దేశించుకోవాలి. e-తెలుగు దేని కోసం పోరాడుతుంది, ఏ విషయాల్లో జోక్యం చేసుకోదు, ఏ విషయాల్లో పట్టింపులు లేవు అనేది సభ్యులందరికి ఒక స్పష్టమయిన అభిప్రాయం ఉండాలి. ప్రతీ ఒక్కరికి తమ కున్న అధికారాలు, భాద్యతలు మరియు పరిధుల పై స్పష్టత ఉండాలి. లేకపోతే మంది ఎక్కువయితే మతానికే చేటు అనే నానుడి తెలుసుగా.
4.ఇప్పుడిప్పుడే మీడియా తో అనుబంధం పెరుగుతుంది. అది అలానే కొనసాగేలా ఆలోచనచేయాలి.
5.గత సమావేశాల్లో పెద్దలు చెప్పినట్టు రాజకీయ చైతన్యం మన ఆశయాలకి చాలా అవసరం. కావున ప్రధాన రాజకీయపక్షాలను కలిసే ప్రయత్నంచేయాలి. మనం ప్రభుత్వం తరపున ఏదయితే ఆశిస్తున్నామో ఒక వినతిపత్రం అన్ని రాజకీయపక్షాలకి అందించాలి. మనం సాంకేతిక సహాయం చేయగలమని హామీ ఇవ్వవచ్చు. ఇప్పుడు ఎన్నికలసమయం కాబట్టి ప్రజల మాటలు, ఆర్తనాదాలు వారికి వినిపిస్తాయి. తరువాత మన మాటలు వారికి వినిపించవు.
6. సభ్యులకి అందుబాటులో ఉన్న కాలేజీల్లో ప్రచారకార్యక్రమాలు నిర్వహించగలిగితే బాగుంటుంది.
ఒడ్డున ఉండి ఈతనేర్పటం నాకిష్టం లేదు. ఏదయితే చేతనవుతుంది అనుకుంటున్నానో, నేను ఆచరణలో చేయగలను అని నమ్ముతున్నానో అవిమాత్రమే చెబుతున్నా.

ధన్యవాదాలు.

అంతర్జాలములో తెలుగు సులభముగా

అంతర్జాలములో తెలుగు సులభముగా నేర్చుకొనుటకు శిక్షణ గ్రంధాన్ని ప్రచురించిన ఉపయోగకరముగ వుండును. మొదటి పర్వముగా అచ్చులు ప్రచురించవలెను అన్నది నా అభిప్రాయము. ఇందుకొరకు అడొబి ఫ్లాష్ ఉపయొగించవలెను అన్న అభిప్రాయము వున్నది. ఈ గ్రంధములో అచ్చులు పలుకు విధానము మరియు వ్రాయు విధానమును ప్రచురించవలెను. కాని నేను తెలుగు పండితుడను కాను. అచ్చులు పలుకు విధానము (ధ్వని/శబ్ధము) మరియు వ్రాయు విధానము ప్రామాణికమై వుండవలెను. ఇందుకొరకు ఔత్సాహికులకు మరియు పండితులకు నా ఆహ్వణము.

mana telugu AMdariki

mana telugu AMdariki upayagaMloki rAAvaali

తెలుగులొ అంతర్జాలం ప్రయత్నం

తెలుగులొ అంతర్జాలం ప్రయత్నం చాలా బాగుంది.దీనిని ఇంకా అభివ్రుద్ది చెద్దాం.

Theme by Danetsoft and Danang Probo Sayekti inspired by Maksimer